సబ్ ఫీచర్

నరమేధానికి అంతం లేదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటు చూసినా బాంబులు అది రెస్టారెంటైనా కావొచ్చు, పాఠశాలైనా కావొచ్చు లేదా మసీదు, చర్చి, దేవాలయమైనా కావొచ్చు. ఐ.ఎస్ ఉగ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. తాజాగా ఢాకాలో పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ ఆలీ ఆబాదీ కరాదాలోని ఘటనా స్థలికి వస్తే ‘దొంగ’గా అభివర్ణిస్తూ ప్రధాని కాన్వాయ్‌పై రాళ్ళు, చెప్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనకు కారకుడు ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీలీగ్ నేత ఎస్.ఎం.ఇంతియాజ్ తనయుడు రోహన్ ఇంతియాజ్ ఉన్నాడని మరో అవామీలీగ్ నేత ముకుల్ చౌదరి ఆరోపించారు.
2014 నుంచి 2016 వరకు ఉగ్రవాదులు సృష్టించిన క్రూరత్వపు ఆనవాళ్లు... విషాద వీచికలెన్నో! మనుషుల్ని నిలువునా తగలబెట్టడం, పేలుడు పదార్థాలతో పాఠశాలల్ని పేల్చేయడం లేదా తుపాకులతో పసి ప్రాణాలతో ఆడుకోవడం పరిపాటే. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఉగ్రవాద సంస్థలు పంజా విప్పుతున్నాయి. వీటి ద్వారా ప్రపంచంలోని మతపరమైన అల్లర్లు చెలరేగుతూ అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అన్ని మతాలలోనూ మంచివారు మొత్తం ఉండరు. అలాగే అన్ని మతాలవారిలో చెడ్డవాళ్లూ అందరూ అయివుండరు అనేది స్పష్టం. ఉదాహరణగా నిన్న జరిగిన బాగ్దాన్ నరమేధం రెస్టారెంట్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించి ముంబైకు చెందిన తరుషిజైన్ తన తండ్రితో చనిపోయే ముందు ఏ క్షణంలోనైనా నన్ను... నా స్నేహితుల్ని చంపేస్తారు నాన్నా అంటూ బిక్కుబిక్కుమంటూ బాత్రూం నుంచి... నాన్నా మేము ప్రాణాలతో బయటపడతామన్న ఆశ లేదని చెప్పే మాటలు విని ఆ తండ్రి హృదయం ఎలా ద్రవించిపోయి ఉంటుంది. తర్వాత తన ఫోను మూగబోవడం మృతదేహం ఢిల్లీ చేరుకోవడం.. కేవలం హిందువునైనందుకే తమ అన్నలు మా చెల్లెల్ని చంపేసారని ప్రకటన ఇచ్చారు. చనిపోయినవారిలో తరుషి స్నేహితుడు ముస్లిం కూడా వున్నాడు. ఇక హిందూ-ముస్లిం అనేది కాదు ప్రధాన సమస్య. ఈ ఉగ్రవాదులపై మూడో కన్నుగా సీ.ఎం.ఎస్. డేగకళ్లు, కోట్ల మందిలో అనుమానితున్ని గుర్తించి వారి ఫోన్లు, మెయిల్స్ ట్రాప్ చేస్తున్నా జరగాల్సిన ఘోరం జరిగిపోతునే వుంటోంది. వేర్వేరు ఖండాలకు సంబంధించిన పారిస్, ఇస్తాంబుల్, ఢాకా, బాగ్దాద్... హైదరాబాద్ ఇలా ఇవన్నీ ఒక్కో ప్రత్యేకత కలిగిన ప్రపంచంలోని ప్రముఖమైన నగరాలు. అందుకే ఇక్కడే తమ ఉగ్రవాద ఉనికి చాటుకుని ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థ తన ఉగ్ర రక్కసితో ఉగ్ర దాడులు జరుగుతున్న సంఘనలు చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అంతేకాకుండా ఐ.ఎస్.ఎస్ వరుస దాడులు జరిపి తమ ఉనికి ప్రపంచ దేశాలకు చాటాలని ప్రయత్నంలో భాగంగా అమాయకుల్ని బలి తీసుకుంటోంది. ఢాకాలో బేకరిపై దాకి పాల్పడింది మేమేనంటూ వారి చిత్రాలను కూడా చేసింది. ముష్కరులంతా బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు దీంతో ప్రమేయం లేదని ఈ ఘటనకు పాల్పడింది ఐఎస్‌ఐఎస్ గానీ అలాగే ఆల్‌ఖైదా గానీ కాదని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ స్థాయిలో దేశాలన్నీ ఏకమై ఓ బృహత్తర పథకంతో రానున్న భవిష్యత్‌లో ఉగ్రవాద దాడులు ఏ ఒక్క దేశంలో కూడా జరుగకుండా ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఆ ఉగ్రవాద సంస్థల్ని కూకటి వేళ్లతో పెకలించివేయాలి. అలాగే సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటి చెబుతూ ఉగ్రవాద ముష్కరుల ఆటకట్టిస్తూ వారి అంతానికి గట్టి ప్రయత్నం చేసే దిశగా ప్రపంచ దేశాలన్నీ ఓచోట సమావేశం కావాలి. అందుకోసం ప్రపంచ దేశాలు అడుగు ముందుకు వేయాలి.

- ఈవేమన