సబ్ ఫీచర్

తప్పు ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ జోక్యం, అభిమానుల కులతత్వం, వెబ్‌సైట్ రివ్యూలు.. మా సినిమా ఆడకుండా కక్షకట్టి ప్రచారం చేస్తున్నాయి! దానివలన కోట్లు ఖర్చుపెట్టి విదేశాల్లో నిర్మించిన మా సినిమాలు ఆడకుండాపోతున్నాయి! ప్రేక్షకులు కూడా ఆ ప్రచారాలను నమ్మి సినిమాలను కనె్నత్తి కూడా చూడటం లేదు.. అని నేడు కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు లబోదిబోమని ఏడుస్తున్నారు! ప్రెస్‌మీట్‌లు పెట్టి గోడు వెళ్ళబోసుకుంటున్నారు. టీవీ షోల్లో తలలు పట్టుకొని విలపిస్తున్నారు!
మీకు నచ్చినట్లు కోట్లు కుమ్మరించి, సంవత్సరాల తరబడి తీస్తూ, వేల రూపాయల్లో టిక్కెట్ల ధరలు పెట్టి మమ్ముల్ని చూడమని చెప్పే హక్కు మీకు ఎక్కడిది? మాకు నచ్చితేనే చూస్తాం! లేదా! మానేస్తాం! మాపైన నిందవేయటం మీరెవరు?.. అని ప్రేక్షకుల వాదన!
విమర్శ అనేది సర్వసాధారణం! సినిమాలో లోటుపాట్లను తెలియపరుస్తూ విశే్లషించటం మా విధి. మీరు చెప్పినట్లు మేం ఎందుకు గొప్పగా రాయాలి? డబ్బులిస్తే గొప్పగా రాస్తారు. డబ్బులివ్వకుంటే సినిమాను ఏకిపారేస్తారు అంటూ మాపైన నిందలెందుకు? ప్రెస్‌మీట్లు పెట్టి, టీవీ షోల్లో కూర్చుంటూ మాపై నిందలేస్తున్నారే? డబ్బులు ఇవ్వకుండానే అవి చేస్తున్నారా? ప్రెస్‌మీట్‌లకు ఎంత తగలేస్తున్నారో, ఆడియో రిలీజ్ రోజు ఎన్ని లక్షలు తగిలేస్తున్నారో? ఒక్కసారి మీరే గుండెమీద చెయ్యివేసుకొని ఆలోచించండి? మీకే తెలుస్తుంది! విమర్శకుడు ఎప్పుడూ డబ్బుకోసం విమర్శ చేయడు. మంచిచెడులను బేరీజువేసి ప్రేక్షకులకు నిజం చెప్పటమే తన విధి. మమ్ములను శంకించాల్సిన పనిలేదు అని విమర్శకుల వాదన!
... ఇలా చిత్ర పరిశ్రమలో నేడు మూడురకాల ధోరణులు రాజ్యమేలుతున్నాయి. ఇది ముమ్మాటికి సినీ పరిశ్రమ చేసుకున్న పాపమే! నిర్మాతలకు నిబద్ధత వుందా? బాధ్యత వుందా? ఉంటే? నెంబర్ వన్ హీరోకు ఒక పారితోషికం. నెంబర్ టూ కు ఒక పారితోషికం, నెంబర్ త్రీకి ఒక పారితోషికం అని ఎందుకు? బడ్జెట్‌పై కంట్రోలు ఎందుకు లేదు? స్వంత కథలు కాకుండా ఇతర భాషా చిత్రాలను ఎందుకు తస్కరించి, చిత్రాలు నిర్మిస్తున్నారు? చిత్ర పరిశ్రమలో వర్గాలుగా విడిపోయి ఆజ్యం పోస్తున్నదెవరు? కులాల వారీగా హీరోలను విభజించి కొమ్ముకాస్తున్నదెవరు? థియేటర్స్‌ని చేతుల్లో పెట్టుకొని గుత్త్ధాపత్యం చెలాయిస్తున్నదెవరు? మీడియాను రెండువర్గాలుగా విభజించి కొమ్ముకాస్తున్నదెవరు?
ఎవరి ఇష్టానుసారం వాళ్ళే పారితోషికాలు పెంచి, క్రేజీ కాంబినేషన్స్‌తో లెక్కలు వేసుకొని, వందల కోట్లు తమ జేబులు నిండాలనుకోవటం ఎంతవరకు న్యాయం? చిత్ర పరిశ్రమలోనికి మాఫియాలను, గ్యాంగ్‌స్టర్స్‌ను, కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించి కొమ్ముకాస్తున్నదెవరు? చిత్ర పరిశ్రమలో వారసత్వ వారధి కట్టుకుంటున్నది ఎవరు? నిర్మాతల మండలిలోనే కట్టుబాటు లేనప్పుడు మిగతావారికి కట్టుబాట్లు ఎలావర్తిస్తాయి? ప్రతివారు డబ్బే ప్రధానంగా సాగుతున్నారు.
నిర్మాతల మండలికి ఒక కట్టుదిట్టమైన బాధ్యత ఉన్నప్పుడు, అన్నీ సక్రమంగా వుంటాయి. 24 క్రాఫ్ట్స్‌కు వున్నా నిబద్ధత, కట్టుబాటు నిర్మాతల మండలికి ఎందుకు ఉండవు? తుదకు శాటిలైట్స్ ఛానల్స్‌ని కూడా రెండుగా విభజించి కొమ్ముకాస్తున్నారు. దీంతో ఎన్నో సినిమాలు అమ్ముడుపోతే ల్యాబుల్లోనే మూలుగుతున్నాయి. ఇప్పటికైనా మూలాలను మరిచి మిగతా వారిపై నిందలు మానండి. మీ చిత్రంలో దమ్ముంటే ఎవరు ఎన్ని చెప్పినా విజయం సాధిస్తుంది. దానికి ‘బిక్షగాడు’, పెళ్ళిచూపులు’ వంటి వంటి చిన్న సినిమాలే ఉదాహరణ. మరి వీటిని ఆడకుండా ఎవరూ ఆపలేదే? మీ చిత్రాలు కూడా మంచివైతే. మీరు తీసింది బంగారమై మీ ఇల్లు కోట్లతో నిండిపోతుంది కదా!

- జనజాగృతి ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాద్