సబ్ ఫీచర్

అమ్మనవ్వటం చెప్పలేని అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలంతా కష్టపడినా చెరగని అందానికి చిరునామాగా నిలిచే ఆడవాళ్లు నిజంగా అభినందనీయులని, అది అందరికీ సాధ్యం కాదు ఆడదానికే సాధ్యం అని అంటుంది సినీ నటి భూమిక. ఎం.ఎస్ ధోని బయోపిక్ చిత్రంలో ధోని సోదరిగా నటించిన భూమిక దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో తన మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ఇప్పటికీ పాతపద్ధతిలోనే అతి సాధారణంగా కనిపిస్తున్నారని ప్రశ్నించగా.. అతివల అందంపై పైవిధంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ప్రేక్షకులు తనను హాట్‌గా చూడలనుకోరు అని చెప్పింది. పెళ్లయిన తరువాత సినిమాలకు దూరమైన మాట నిజమైనప్పటికీ తాను ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటిస్తుండటం వల్ల ఇటువైపు దృష్టిపెట్టలేకపోయినట్లు వెల్లడించారు. దర్శకులు నీరజ్ పాండే ధోని చిత్రం గురించి చెబుతూ ధోనికి చిన్నప్పటి నుంచి సోదరితో అనుబంధం ఉంటుందని, కాబట్టి ఆ పాత్రలో నటించమని కోరటంతో నటించినట్లు తెలిపారు. ధోని సోదరి జయంతిని కలిశారా అని అడుగగా..తాను కలువలేదని నీరజ్ పాండే చెప్పినట్లు మాత్రమే నటించినట్లు, కాకపోతే ధోని స్నేహితులను, కోచ్‌ని కలిసి చాలా విషయాలను తెలుసుకున్నట్లు తెలియజేసింది. వాస్తవానికి ధోని ఫుట్‌బాల్ ఆటగాడు. క్రికెట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాడనేది సినిమాలో తెలియజేశారు. 13ఏళ్ల క్రితం తాను, సల్మాన్‌ఖాన్ నటించిన తేరేనామ్ చిత్రానికి సంబంధించి ఇప్పటికీ అభిమానులు ఈ-మెయిల్స్ వస్తుంటాయని అంటుంది.
ఎన్నో విషయాలు నేర్పింది..
ఓ బిడ్డకు తల్లినవ్వటం నిజంగానే మహిళకు వరమే. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. పసిబిడ్డను పెంచటంలో ఎన్నో విషయాలను నేర్పుతోంది. మొదటి సంవత్సరం ఎంతో కష్టమనే చెప్పవచ్చు. బిడ్డకు కడుపునిండా ఆహారం అందించటం, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించటం, జ్వరం వస్తే ప్రతి తల్లివలే తల్లడిల్లిపోయాను. రెండవ సంవత్సరంలో బిడ్డతో ప్రయాణం ప్రత్యేకంగా ఉంటుంది. పండ్లు తినిపించటం, యాష్ (్భమిక కుమారుడి పేరు) చేత సరిగా మాటలు నేర్పించటం వంటి పనులు చేస్తుంటే భలే ఆనందంగానూ, అమ్మకు తెలియని అందాన్ని కూడా చేకూరుస్తుంది. యాష్ కోసం చేసే ప్రతి పని ఆనందాన్ని ఇచ్చేది. వాడికి తినిపించటం, స్నానం చేయించటం, నిద్రపుచ్చటం, చదివించటం వంటి పనులన్నీ ప్రేమతో చేయాలనిపిస్తోంది. మీ అబ్బాయికి తెలుసా మీరు గొప్ప స్టార్ అని అడిగితే.. వాడికి షూటింగ్ అంటే తెలియదు. ఇపుడిపుడే షూటింగ్‌కు వెళుతుంటే ముమ్మా షూటింగ్‌కు వెళుతుందని అంటాడు. బాలీవుడ్‌ను మిస్స్ అయ్యారని విచారించటం లేదని, ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయని , భవిష్యత్తులో విభిన్నమైన సినిమాలు తప్పక వస్తాయని, వాటిల్లో తాను తప్పక నటించే అవకాశం వస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని భూమిక వ్యక్తం చేస్తోంది.