సబ్ ఫీచర్

పిల్లల పంటి సమస్యలు పోయేదిలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లలకు చికిత్స చెయ్యడం అంత సులువు కాదు. చాలా ఓపిక ఉండాలి. ఓదార్చగలిగే గుణం ఉండాలి. ఓ అమ్మ ‘చందమామ రావే’ అన్న అబద్ధం చెప్పి గోరుముద్ద పెడుతుంది, ఏడిస్తే ‘బూచాడొస్తాడన్న’ భయం పెట్టి ఏడుపు ఆపుతుంది. చిన్ని చిన్ని కథలు చెప్పి నిద్రబుచ్చుతుంది. అలా మాటలతో మ్యాజిక్ చేసి వాళ్లని బుట్టలో పడేసుకొనే గుణం ఉండాలి. చిన్న పిల్లలకి చికిత్స చెయ్యడంలో చాలా కష్టపడాలి. చెప్పిన మాట వినరు, ఏది చూసినా ఏడుస్తారు. అలాంటి వారి ముందు వైద్యుడు పెద్దరికం ప్రదర్శిస్తే.. ఆ పెద్దరికం వారికో పెద్ద దుఃఖంగా మిగిలుతుంది. అదే పిల్లలకు వైద్యం చేసే వైద్యుడికి కూడా ఓ కొడుకు పుడితే వాడి లాలన, పాలనలో పోయన చిన్నతనాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఆ వైద్యుడు కూడా ఓ పిల్లాడిలా మారిపోతాడు. అప్పుడు క్లీనిక్‌కి పిల్లలొస్తే ‘యాహూ’ ని అరుస్తూ..వారితో ఆడుతూ పాడుతూ చికిత్స చేయటం కష్టం కాదు. ప్రస్తుతం వైద్యుడుగా, ఓ కొడుకు తండ్రిగా పిల్లలతో సరిసమానంగా అల్లరి చేస్తూ చికిత్స చేస్తుంటే తల్లిదండ్రులు ముచ్చటపడుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. పిల్లలకొచ్చే సమస్యలు, రాకుండా కాపాడుకునే విధానం, వచ్చాక చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అతి పెద్ద సమస్య - పంటి పుచ్చు
పిల్లలు సరిగా పళ్లు తోమరు, తీయటి పదార్థాలు చాలా ఎక్కువగా తింటారు. దీనికి కారణంగా పళ్లలో పుచ్చు వస్తుంది. ఇది చాలా పళ్ళలో వస్తే దాన్ని Rampant caries అంటారు. పుచ్చు వచ్చిన పళ్లు నల్లగా కనిపిస్తాయి. కొందరిలో నొప్పి, వాపు వస్తాయి.
దానికి చికిత్స
పుచ్చు వచ్చి నొప్పిలేని పళ్లకి సిమెంట్ పెడితే సరిపోతుంది. నొప్పి ఉన్న పన్ను పాల పన్ను అయినా శాశ్వత పన్ను అయినా తియ్యడం మంచిది కాదు. శాశ్వత పన్ను అయితే పెద్దవాళ్లకి చేసినట్టే రూట్ కెనాల్ చికిత్స చేసి కృత్రిమ పన్ను తొడగాల్సి వుంటుంది. పాల పన్ను అయితే శాశ్వత పన్ను మళ్లీ వస్తుందన్న ఆలోచనలో ఉండకూడదు. దాన్ని తీసేయకూడదు. పిల్లలకి చికిత్స చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయం ఏంటంటే ‘స్పేస్ మేనేజ్‌మెంట్’. మన సమాజంలో ఖాళీ స్థలాలని కొందరు ఎలా కబ్జా చేస్తారో అలానే పాల పన్ను తీశాక అక్కడ ఉండే ఖాళీ స్థలాన్ని ముందు, వెనక పళ్లు కబ్జా చేస్తాయి. దీని మూలంగా ఆ స్థలంలో భవిష్యత్తులో అక్కడ రావాల్సిన శాశ్వత పంటికి స్థలం లేక నాలిక వైపో బుగ్గ వైపో వచ్చి పళ్లు ఎగుడు దిగుడుగా మారుతాయి. ప్రకృతి ప్రకారం పాల పన్ను శాశ్వత పన్ను వచ్చే కొద్ది వారాల ముందే పడుతుంది. అలా కాదని దాన్ని ఏ కారణం చేతో కొన్ని నెలలు లేక సంవత్సరాల ముందే తీసేస్తే ఇలానే జరుగుతుంది. పుచ్చు వచ్చి నొప్పిగా ఉన్న పాల పన్నుని తీయకుండా దానికి రూట్ కెనాల్ చేసి అది సహజంగా పడే దాకా దాన్ని కాపాడుకోవాలి. పాల పన్ను పడిపోడానికి చాలా సంవత్సరాలుంటే అప్పుడు పన్ను విరగకుండా తక్కువ ధర కృత్రిమ పన్ను తొడుగుతారు. ఇది పాల పన్నుతో పాటు పడిపోతుంది.
ఇది తెలీక పన్ను తీసేసిన వారిలో ఆ స్థలాన్ని పక్కపళ్లు ఆక్రమించకుండా కాపాడుకోవాలి. ఆ ప్రదేశంలో తీసిపెట్టుకునే పన్ను పెట్టుకోవడం చెయ్యాలి. వయసుతో దవడ పరిమాణం మారుతుంది. దానివల్ల ఆ తీసి పెట్టుకునే పన్ను వదులవుతుంది. అలా అయినపుడల్లా కొత్త పన్ను చేయించుకోవాల్సి వుంటుంది.
పుచ్చు రాకుండా కాపాడుకోవటం ఎలా?
మొదటి విధానం ‘్ఫ్లరైడ్ ట్రీట్‌మెంట్’. పుచ్చు చాలా ఎక్కువగా వచ్చే పిల్లలలో, నీళ్లలో ఫ్లోరైడ్ 0.6 పిపిఎమ్ కన్నా తక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ చికిత్స చేయించుకోవడం మంచిది. దానివల్ల పళ్లు గట్టిపడి పుచ్చు రాకుండా నిరోధిస్తుంది. ఈ విధానంలో పిల్లల పళ్ల పరిమాణం కొలతకు సరితూగే ఓ పళ్లాన్ని తయారుచేసి అందులో ఈ ఫ్లోరైడ్ మందు పెట్టి ఆ పళ్లాన్ని పిల్లల నోట్లో పళ్లపై కొంత సమయం ఉంచుతారు. ఈ విధానంలో ఏ నొప్పి ఉండదు. ఈ చికిత్స చేయించుకునే ఊహ ఉన్న పిల్లలతో దానిని చేస్తారు. ఎప్పుడు, ఎన్నిసార్లు చేయించుకోవాలన్న ప్రశ్నలకి దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది. రెండో విధానం --ని నిడడశ్రీ్గఉ డఉజోడ. పళ్లపై ఉండే గాడిలో తినే ఆహారం ఇరుక్కొని పుచ్చు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటివారిలో ఈ గాడిని ఓ సిమెంట్‌తో నింపేస్తారు. చేయించుకునే ఊహ వచ్చాక ఇది పిల్లలలో పాల పళ్లకి మరియు శాశ్వత పళ్లకి చేస్తారు.
‘శ్రీదిజకూ డశ్రీ్ళజనిది డదిఉ’ అంటే
8-12 సంవత్సరాలలోపు పిల్లలకి పళ్లు ఎగుడుదిగుడుగా కనిపిస్తాయి. దీనిని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. తల్లిదండ్రులు కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. చాలా మందిలో ఇది కనిపిస్తుంది. అవే చాలామందిలో చక్కబడతాయి. 14 సంవత్సరాల పైబడిన పిల్లలలో కూడా అలానే ఉంటే అప్పుడు దంత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇంత వేగవంతమైన నేటి సమాజంలో పళ్లు మాత్రం కొంతమందిలో ఆలస్యంగా వస్తున్నాయి. పాల పళ్లు 6-8 నెలల వయసప్పుడు రావడం మొదలవుతాయి. శాశ్వత పళ్లు ఆరు ఏళ్లకి మొదలవుతాయి. అలా రాని పక్షంలో కంగారు పడక్కరలేదు. నేటి పిల్లలలో కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి. రావాల్సిన సమయం కన్నా ఆరు నెలలు నుంచి ఏడాదివరకు వేచి చూడండి. అప్పటికీ రాకపోతే దంత వైద్యుడిని సంప్రదించి ఎక్స్‌రే ద్వారా శాశ్వత లేక పాల పళ్లు ఉన్నాయో లేదో నిర్థారించుకోవడం మంచిది.
10న10 ఎంతా అంటే వందా అని ఇరవై సంవత్సరాల క్రితం పిల్లలు ఠక్కున చెప్పేవాళ్లు. ఇప్పటి పిల్లలు గణనయంత్రముతో కూడి చెపుతున్నారు. మనం చేసిన యంత్రాలకి మనమే బానిసలయిపోతున్నామనడానికి ఇదో నిదర్శనం. రెండేళ్లకి తాతా బామ్మలతో ఆడుకునే సౌలభ్యం లేదు, అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా! పెరిగాక తల్లిదండ్రులతో గడిపేందుకు కుదరదు, ఇద్దరూ పనికిపోతారు కదా. అయిదేళ్లకి ఐప్యాడ్, ఆరేళ్లకి అందరికీ దూరంగా హాస్టల్, ఇక ఆ పిల్లవాడు మనిషిగా ఎలా మారతాడు, మానవత్వం తెలీని ఓ యంత్రంగా మారతాడు. వాడినుంచి లెక్కలు ఆశించాలిగాని ఆత్మీయత కాదు. అయిదో క్లాసులోనే ఎం.బి.బి.ఎస్‌కి తయారీ, ఆరో క్లాసులో ఐ.ఐ.టికి; పుస్తకాల చదువులో నేటి పిల్లలు వారి బాల్యానే్న కోల్పోతున్నారు. ‘బాల్యం, భాగ్యం పోతే తిరిగిరావ్’. స్మార్ట్ ఫోన్స్‌ని తయారుచేసాం కానీ ఆ స్మార్ట్‌నెస్‌ని మనమే కోల్పోతున్నాం.
**
-ఢా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com