సబ్ ఫీచర్

తరగతి గధి సంఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది సమాజంలో అంతర్భాగం. విద్యార్థిపైన సమాజం ఎంత ప్రభావితం చేస్తుందో, విద్యార్థి కూడా సమాజాన్ని అంతే ప్రభావితం చేస్తాడు. సమాజం పరిధి పెద్దది కాబట్టి విద్యార్థి ప్రభావం సమాజం మీద ఏ కొద్ది పాటి ఉన్నా అది సమాజం దశను మార్చుతూ ఉంటుంది. ప్రతి సమాజానికి కొన్ని విలువలుంటాయి. కొన్ని ఆశయాలు ఉంటాయి. కొన్ని సంస్కారాలుంటాయి. ఇవన్నీకూడా ఆనాటి విద్యావిధానంపై ప్రభావం చూపుతాయి. విద్యావిధానం ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. తరగతి గదిలో జరిగే ప్రక్రియ భవిష్యత్ విలువలను, ఆలోచనా విధానాన్ని మార్చుతూ ఉంటుంది. విద్యార్థుల ప్రభావం వ్యక్తిగతమైనది. వీరి ద్వారా సమాజంలో మార్పు అస్పష్టంగానే కనిపిస్తుంది. కానీ సమాజంలో గర్భితమైయున్న శక్తులు ఆ మార్పును నిరోధిస్తూ ఉంటాయి. ఆ నిరోధన గత చరిత్రపై ఆధారపడి ఉంటుంది. తరగతి గది చదువు- మార్పుకు కావల్సిన శక్తిని ప్రసాదిస్తుంది.
మనిషి నడిచేటప్పుడు గతం వెనుకకు లాగుతూ ఉంటుంది. తరగతి గది ముందుకుతోస్తూ ఉంటుంది. ఈ సంఘర్షణనే చైతన్యం అంటాం. తరగతి గది సమాజానికి చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ చైతన్యం వలన మనకు తెలియకుండానే సమాజంలో పరివర్తన వస్తుంది. ఐదు సంవత్సరాల క్రితం మన వేషధారణకు, ఈనాడు మన వేషధారణకు ఎంత మార్పు వచ్చిందో గమనిస్తే మనకు అవగతమవుతుంది. వర్తమాన సమాజం నాలుగైదు రంగాల నుంచి దాడికి గురవుతూ ఉంటుంది. అవి- 1. రాజకీయ రంగం 2. ఆర్థిక రంగం 3. సామాజిక రంగం 4. సాంస్కృతిక రంగం. రాజకీయ రంగం ప్రభావమంటే ఎన్నికల సమయంలో ఒక్కసారి ఓటు వేయటమే అనుకుంటారు. తరగతి చదువును రాజకీయ రంగం ఎంత ప్రభావితం చేసిందో ఒక్కసారి గమనించవచ్చు. రాజకీయ నాయకుడు ఆశిస్తున్న సమాజానికి తరగతి గది మనకు తెలియకుండానే సహాయపడుతూ ఉన్నది. సిలబస్‌ను నిర్ణయించేదెవరు? ప్రపంచీకరణ ముందున్న మన లక్ష్యాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు మన తరగతి గది చదువుసరళి ఎలా ఉండేది? ఆ తర్వాత క్రమక్రమంగా ఏ రకమైన మార్పుకు గురైంది? ఎప్పుడైనా విద్యార్థి ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది పరీక్షల్లో వస్తుందా? అని తరగతి గదిలో పిల్లలు అడిగేవారు కాదు. అదే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చదువంటే కొలమానం పరీక్షగా మారింది. అదే ఆర్థిక రంగాన్ని పరీక్షిస్తే తరగతి గది గ్రాహ్యశక్తే పాఠం వేగాన్ని నిర్ణయించేది. కానీ ఈనాడు మేనేజ్‌మెంట్ ఆదేశాలే నిర్ణయిస్తున్నాయి. కాలపరిమితిని ఆర్థిక దృష్టితో చూస్తున్నాం. ఒక రకంగా సాంస్కృతికంగా చూస్తే మన దినచర్య ప్రభావం కూడా తరగతి మీద పడుతుంది. వర్తమానం యొక్క జనరేషన్ ప్రభావం తరగతి గదిపైన పడుతుంది. తరగతి గది సంఘర్షణకు కేంద్రం. గతం తనను తాను కాపాడుకోవటానికి ఎలా ప్రయత్నం చేస్తుందో, భవిష్యత్తు అంతే వేగంతో ముందుకు లాగుతుంది. ఈ రెంటినీ ‘బ్యాలెన్స్’ చేయటమే తరగతి గది తనకుతాను వేసుకున్న సవాలే. దీనివలన విలువలు మారుతాయి. దృక్పథం, వైఖరి మారుతుంది. పిల్లల ప్రవర్తన మారుతుంది. ఆ పిల్లలు ఈ మార్పును తీసుకుని తను కుటుంబంలోకి వెళతారు. కేవలం మన పాఠాన్ని మాత్రమే తీసుకుపోరు, తరగతి గది సంఘర్షణను కూడా తీసుకుపోతారు. తరగతి గది సంఘర్షణ సమాజంలో ఏర్పడే సంఘర్షణకు నిప్పురవ్వలుగా ఉపయోగపడతాయి. విద్యార్థుల యొక్క తరగతి ప్రభావం సమాజంపైన తీవ్రంగా ఉంటుంది. అందుకే సమాజ పరివర్తనకు విద్య ఒక సాధనమన్నారు.

-చుక్కా రామయ్య