సబ్ ఫీచర్

ఈ పరిస్థితులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామిక వ్యవస్థ ప్రభుత్వానికి రాజకీయాలకే పరిమితం కాదు. అన్ని రంగాలను అది ప్రభావితం చేశాయి. సమాజంలో కూరుకుపోయిన అసమానతలను ఛేదించి దాని కారణాలను సమాజం ముందు సవాళ్లుగా నిలిపింది. దానిలో విద్యారంగం చాలా మార్పులకు గురైంది. విద్య సమాజ పరివర్తనకు కారణభూతమని, ఆ విద్యను అందరికీ హక్కుగా ఇవ్వాలని మన న్యాయకోవిదులు ఇచ్చినటువంటి తీర్పులు ప్రభుత్వాలకు మార్గదర్శకమయ్యాయి. సమాజంలో అందరు ఒక రకంగా ఉండరు. కొందరు సంపన్నులుంటారు. కొందరు తిండిలేక కడుపు కాలే వారుంటారు. కొందరు మానసికంగా దెబ్బతిన్నవారుంటారు, కొందరు మేధావులుంటారు. ఈ తేడాలను కదిలించకుండా ఈ హక్కును అమలుపరచటం అసంభవం అని గుర్తించి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మొదట ఆకలి సమస్యను తీర్చితేనే మన విద్య అందరికీ అందుబాటులోకి వస్తుందని కనీసం బడిపిల్లలకైనా, ఆహార భద్రత కలిగించాలనే ఉద్యమం కూడా వచ్చింది కానీ, కొన్ని దేశాలు పిల్లల అందరికీ భద్రత కలిగిస్తాం. డబ్బున్నవారి దగ్గరనుంచి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందరికీ మాత్రం ఒకే రకమైన భోజనం పెడతాయ.
మన దేశంలో ప్రతి విషయాన్ని వర్గ దృష్టితోనే చూస్తాం. బీద పిల్లలతో కలిసి డబ్బున్నవాళ్ల పిల్లలు తింటారా? ధనవంతులు గీసుకున్న సామాజిక రేఖలు ఎక్కడికి పోవాలి? బడికి ఉద్యోగంకోసం పంపించాం కానీ సామాజిక రేఖలను తుడిచి వేయటానికి కాదు, తమ అధికారాన్ని, తమ ప్రాబల్యాన్ని ఉపయోగించి మనదగ్గర పేద పిల్లలకే పరిమితం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అన్నది మన సామాజిక నేపథ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. సానుభూతిపై చేసే వాటిలో ప్రమాణాలు చూడరు. మన మధ్యాహ్నభోజన పథకాన్ని పేద పిల్లలకే పరిమితం చేయటం జరిగింది. నాసిరకం తిండి పెడుతున్నారు. దీనివల్ల ఆహార భద్రత స్కీమ్‌కే నష్టం జరిగింది. సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు ఉండటంవలన అందరికీ పుష్ఠికరమైన ఆహారం లేకపోవటం వలన గ్రాహ్యశక్తిలో కూడా తేడా ఉంటుందని శాస్తవ్రేత్తలు తమ ప్రయోగాలద్వారా చూపారు. పేద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం కానీ హాస్టల్ భోజనం కానీ పుష్ఠికరం కాకపోతే అంతస్థులుగల సమాజాన్ని బద్దలుకొట్టలేమని సామాజిక కార్యకర్తలు ఆందోళనలు చేశారు.
ఈ ఉద్యమాలవల్లనే దొడ్డు బియ్యంపోయి సన్నబియ్యం వచ్చాయి. బియ్యం మార్చటం పుష్ఠికరమైన ఆహారమేమీకాదు, పుష్ఠికరం కావాలంటే పెట్టేవాని దృక్పథం మారాలి. అది మారనంతవరకు అది లేని వానికి సానుభూతితో పెట్టే అన్నంగానే ఉంటుంది. మధ్యాహ్నభోజన పథకాన్ని కాంట్రాక్టర్లకు కాకుండా విద్యారంగం వారికే అప్పగించాలి. ఇందుకు జవాబుదారీతనం ఉండే వ్యవస్థకావాలి. కాంట్రాక్టర్ల వ్యవస్థ పేదల కడుపులను చిల్లులు పొడుస్తుంది. ఉన్న రోగాలకుతోడు కొత్త రోగాలను తెచ్చిపెడుతున్నది. స్వచ్ఛత పేరుతో రోడ్లను శుభ్రపరచటం మాత్రమేకాకుండా ప్రభుత్వం పెట్టే అన్నంలో స్వచ్ఛత ఉండాలి. ఆహార భద్రత అనగా స్వచ్ఛమైన ఆహారాన్ని పిల్లలకు హక్కుగా అందించాలి. దీన్ని అమలుకు ప్రశ్నించే అధికారం ఏ సామాజిక కార్యకర్తకైనా ఉండాలి. మధ్యాహ్న భోజనాన్ని అర్థవంతం చేయాలంటే దానికి లీగల్ కవచాన్ని తొడగాలి. అప్పుడే మనస్థితి విద్యాహక్కుకు తోడ్పడుతుంది. దురదృష్ట వశాత్తు మనదేశంలో దేనికి చట్టపరమైన భద్రత అవసరమో దానికి రక్షణ ఉండదు. అవసరం లేని వాటికి మాత్రం విపరీతమైన భద్రత కల్పిస్తారు. ఈ పద్ధతిలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు న్యాయం జరుగుతుంది.

- చుక్కా రామయ్య