సబ్ ఫీచర్

కలసిన మనసులు... కమనీయ నేస్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి, పురుషుల వివాహ బంధం మనకు మనం అందించుకునే ఓ అపూర్వమైన కానుక. ఇరువురు కలిసి జీవించే సంతృప్తికరమైన జీవితం కేవలం శరీరానికి సంబంధించిందే కాదు, మనసుకు సంబంధించింది కూడా. మనసుకు సంబంధించిన ఆలోచనలు, ఊహలు దంపతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. దీనికి భాగస్వామ్యం వహించే ప్రధాన అంశం ముద్దూ ముచ్చట్లే. ముద్దు ముచ్చట్లంటే అదేదో తెరచాటు వ్యవహారం అని చాలామంది దంపతులు భావిస్తారు. శరీరానికి పుష్టికరమైన ఆహారం ఎంత అవసరమో భార్యాభర్తలు నిత్యనూతనంగా చలాకీగా హుషారుగా వుండడానికి సరస సంభాషణలు అంతే అవసరం. కళ్లతో పలికే భావాలు, మృధు మధుర మాటలు, చేతలు దంపతులలో ఉల్లాసాన్ని పెంచుతాయి. రోజంతా ఉత్తేజంగా గడిచిపోతుంది. భర్త చెప్పే ముద్దు ముద్దు మాటలు భార్య అందాన్ని ప్రభావితం చేస్తాయి. కళ్లల్లో ఆరోగ్యవంతమైన మెరుపు, ముఖంలో నిగారింపు వచ్చి చేరుతుంది. ఒకర్ని ఒకరు చేసుకునే స్పర్శలు, కౌగలింతలు టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. నడిచే తీరు, చేసే పనుల్లో చురుకుదనం వస్తుంది.
మనసుతో మనసు పెనవేసి
భార్యాభర్తలంటే బస్టాండ్‌లో కలుసుకుని అప్పటికప్పుడు విడిపోయే వారు కాదు. వీరి ప్రయాణం జీవితకాలం సాగాలి. అబద్ధాలకు, అనుమానాలకు చోటుండకూడదు. ప్రతిమాట, ప్రతి పని, మనసు లోతుల్లోనుంచి రావాలి. వేసే ప్రతి అడుగు మనసుతో సంబంధం కలిగివుండాలి. ఒకరిపట్ల ఒకరు మానసికంగా సంతృప్తికరంగా ఉన్నప్పుడే ముఖంలో కాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ విషయంలో అయినా విభేదాలు వస్తే వివాదాన్ని పెంచే అంశాలు వదిలి పరిష్కార మార్గాలు వెతకాలి. అలా కానప్పుడు తలెత్తే అసహజ పరిణామాలు సంసారాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. మనసులు గాయపడ్డాక మందులు వెతకడం అంత సులభం కాదు. చిరు అలకలు, బతిమలాటలు ఉత్తేజాన్ని పొందడానికి లాభిస్తాయని మరువవద్దు.
ఒకరినొకరు గౌరవిస్తూ..
భర్త తన మనసు విప్పి చెప్పాలని భార్య, భార్య మనసు విప్పి మాట్లాడాలని భర్త కోరుకుంటారు. ఎదుటివారు చెప్పింది వింటునే స్వార్ధం చూసుకుంటే అది రెండోవారిని అవహేళన చేసినట్టే అవుతుంది. ఎవరి కోరికలు వారివి ఎవరి అభిరుచులు వారివే. అయితే ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలై తే అగాధం ఏర్పడుతుంది. విరిగిన మనసులతో సహజీవనం ముళ్లబాటపైన గమనమే అవుతుంది. దూరం దగ్గరవ్వాలంటే ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి. ఇగోలను వదిలేయాలి. సమస్యలు ఎన్ని వున్నా ఒకరి భావాలను మరొకరు గౌరవించినపుడే సంసారం ఆనందభరితం అవుతుంది.

-పి.నాగలక్ష్మి