సబ్ ఫీచర్

‘ఏకీకృత’ శాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1998వ సంవత్సరంలో ఒక జి.ఓ. సృష్టించి పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకటిగా చేసింది. ప్రభుత్వ టీచర్లకు నిర్దేశించిన పదోన్నతులను పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు కూడా ఇచ్చింది. దీనికి ‘ఏకీకృత సర్వీసు రూల్సు’ అని అప్పట్లో ప్రభుత్వం నామకరణం చేసింది. ఏకీకృత సర్వీసు రూల్సు పుణ్యమాని ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. వారి సంఖ్య తక్కువ. సంఘబలం లేదు. కనుక వారు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి గత్యంతరం లేక చివరికి న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీచేసిన ఏకీకృత సర్వీసు రూల్సు జిఓను సుప్రీం కోర్టు కొట్టివేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యాయం చేసింది. తన నిర్ణయం అమలుకాకపోవడంతో ఆగ్రహించిన ప్రభుత్వం వెంటనే ఒక అడ్డగోలు ఆర్డినెన్సు సృష్టించి సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయకుండా వ్యవహరించింది. ఆర్డినెన్సులో ఐ.టి.డి.ఎ. ఉపాధ్యాయులను కూడా చేర్చవలసిందిగా అప్పట్లో కొందరు మంత్రులు సూచించారు. అప్పటికే ఇది వివాదాస్పదం కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ అస్తవ్యస్త పరిస్థితులకు మూలకారణం- ఆనాడు విద్యాశాఖలోని కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించడమేనన్న ఆరోపణలు లేకపోలేదు.
పంచాయితీరాజ్ ఉపాధ్యాయ సంఘం బలమైనది కనుక ఏకీకృత సర్వీసు రూల్సుకు ఆటంకం లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఇపుడు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు సహకరిస్తున్నారని, కొన్ని సవరణలతో ఏకీకృత సర్వీసు రూల్సు జీవోకు రాష్టప్రతి నుంచి అనుమతి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయులందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తామని గతంలో పాలకులు పలుసార్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ విధానాన్ని అటకెక్కించి, పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు మాత్రమే మేలుచేయాలని ఇప్పటి ప్రభుత్వం సంకల్పించింది. పురపాలక సంఘాల్లో, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)ల్లో, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు పంచాయితీరాజ్ టీచర్లకన్నా ఏ విధంగా తక్కువవారు? వారికి వీరికి జీతం, యోగ్యతలు సమానమే. ఏకీకృత సర్వీసు రూల్సు అందరికీ ఎందుకు వర్తింపజేయరు? ఒకప్పుడు ఐటిడిఎ ఉపాధ్యాయులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వారిని ఎందుకు వేరుచేశారు? ఇప్పుడు మిగిలిన ఉపాధ్యాయులంతా తమకూ ఏకీకృత సర్వీసు రూల్సు అమలుచేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా నేడు విద్యాశాఖ ఉనికి కోల్పోతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలన్నీ సర్వీసు కమిషన్ ద్వారా జరుగుతాయి. గతంలో విద్యాశాఖలోని ఉద్యోగాలు కూడా అలాగే జరిగేవి. స్కూలు అసిస్టెంట్లను, డిప్యూటీ ఇఓలను, డిఇఓలను సర్వీసు కమీషన్ ఎంపిక చేసేది. సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులను డివిజనల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారు నియమించేవారు. విద్యాప్రమాణాలు మెరుగుపడాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖలోని ఉద్యోగులను సర్వీసు కమిషన్ ద్వారా ఎంపిక చేసే విధానం పునరుద్ధరించాలి. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలి. మండల వ్యవస్థ ప్రారంభమైన తరువాత ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ కుంటుపడింది. దీనికి కారణం- ‘ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం’ అనే పెద్ద పనిని ఎంఇఓలకు అప్పగించడం. పాఠశాలలపై పర్యవేక్షణకు అధికారులు వేరుగా ఉండాలి. పూర్వం పంచాయితీ సమితులలో ఈ పద్ధతి ఉండేది. కనుక మండల విద్యాశాఖ అధికారులను పరిపాలన, ఆర్థిక సంబంధ విషయాలకు పరిమతం చేయాలి. విద్యా ప్రమాణాలు పెరగడానికి ప్రతి రెండు మండలాలకు ఒక పర్యవేక్షణ అధికారిని నియమించాలి.

-వేదుల సత్యనారాయణ