సబ్ ఫీచర్

వివేకానందుడు తప్పుడు మేధావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వివేకానందుడు కులవ్యవస్థ సమర్థకుడు,స్ర్తి ద్వేషి, తప్పుడు మేధావి, తనను తాను అధికంగా భావించేవాడు, వివేక హీనుడు, శాస్తబ్రద్ధంకాని ప్రసంగాలు చేసేవాడు, నిజమైన తెలివితేటలు కలవాడు కాదు, ఇలాంటి వ్యక్తి జయంతిని మన కేంద్ర విశ్వవిద్యాలయంలో, ఆనవాయితీగా జరపడం పట్ల నేను ఆశ్చర్యపోతున్నాను, నిరుత్సాహ పడుతున్నాను..’’ అంటూ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి, 2016,జనవరి 8న తన ఫేస్‌బుక్‌లో ఉంచిన వ్యాఖ్య ఇది. జనవరి 12న స్వామీజీ జయంతి నిర్వహించడానికి ముందు వచ్చిన వ్యాఖ్య ఇది. వివేకానందుడిని భారతీయులు అమితంగా గౌరవిస్తారు, పరమ పూజ్యనీయుడిగా పరిగణిస్తారు. స్వామీజీ షికాగోలో 1893 సెప్టెంబర్ 11న, ‘పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్’లో ప్రసంగించారు. ఇది జరిగిన దాదాపు 123 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు అందునా ఒక విద్యార్థి నుంచి ఈ వ్యాఖ్య రావడం చాలా ఆశ్చర్యకరం.
ఇప్పటి వరకు ఎవరూ స్వామీజీ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ విద్యార్థి చేశాడు. నిజానికి షికాగోలో స్వామీజీ ప్రసంగిస్తూ, ‘‘నేను మీకు మతాలన్నింటికీ, మాతృక అయిన మతం తరపున,అన్ని తరగతులకు, తెగలకు, చెందిన లక్షలాది హిందువుల తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. నాటి ఆయన వాగ్ధాటికి మంత్రముగ్ధులు కానివారు లేరు. అలాంటి మహానుభావుడిని గురించి, 123 సంవత్సరాల తర్వాత, ఒక భారతీయ విద్యార్థి ఇలా మాట్లాడగలిగాడంటే, ఏమనాలి? అదీ మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత..! ఇంతకూ ఈ వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పెట్టిన విద్యార్థి పేరు రోహిత్ వేముల. అంత మొండిగా ధైర్యంగా, వ్యాఖ్యలు చేయగలిగిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే నిజంగానే ఆశ్చర్యమేస్తుంది. ఈ ఆత్మహత్యపై ఇంకా దుమారం చెలరేగుతూనే ఉంది.
కాస్త ప్రశాంతంగా ఈ దేశాన్ని గురించి ఆలోచించే వారందరినీ అతని వ్యాఖ్యలు అమిత దిగ్భ్రాంతికి గురి చేశాయి. దీనికి తోడు ఉగ్రవాదిగా నేర నిరూపణ జరిగిన అఫ్జల్ గురుకు విధించిన ఉరిశిక్ష కూడా విమర్శలకు గురికావడం మరింత విచిత్రం! సర్వసత్తాక పార్లమెంట్‌పైనే దాడి జరిపిన, ఆఫ్జల్‌గురుకు-పూర్తిగా న్యాయ విచారణ తర్వాతనే ఉరిశిక్ష విధించబడి, అమలైంది. అలాంటి వ్యక్తి విద్యార్థులకు ఆరాధ్యదైవమై, నినాదాలలో స్థానం పొందడాన్ని చూస్తుంటే, ఈనాటి యువతరం చేతులలో దేశ భవిత ఎలా ఉంటుంది? అనే ఆందోళన కలుగుతోంది. మరో విషయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు సరే. కానీ ఇదే సంస్థను నిషేధించిన నెహ్రూ, తర్వాత దాన్ని ఎత్తివేసిన విషయం రాహుల్ గుర్తించాలి. అంతేకాదు 1962 చైనా దురాక్రమణ తర్వాత, 1963 రిపబ్లిక్ పరెడ్‌లోపాల్గొనాల్సిందిగా స్వయంగా నెహ్రూనే ఆహ్వానించారు..దీనికి రాహుల్ ఏమని సమాధానం చెబుతారు?
మరి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్షాల నాయకులు వీరందరి వ్యవహారశైలి చూస్తుంటే రోహిత్ వేముల వివేకానందుడిపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారనే భావించాల్సి వస్తున్నది. ఇటువంటి వ్యవహారశైలితో, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలన్న ఉద్దేశం తప్ప, దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు మోదీ చేస్తున్న యత్నాలకు మద్దతునిచ్చే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నది స్పష్టమవుతోంది. కాని సమర్ధుడైన నేతగా దేశ విదేశాల్లో ఘనకీర్తినందుకుంటూ, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ఆయన యత్నాలకు విఘాతం కలిగించడం వల్ల దేశానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరుగబోదు. మీరు నిజంగా రాజకీయాలను దేశహితం కోసం చేస్తున్నారా? లేక దేశానికి నష్టం కలిగిందుకు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి!

-చాణక్య