సబ్ ఫీచర్

సైజ్ జీరో సాధ్యమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న ఆహార అలవాట్లతో సుమారు 70 శాతంమంది ఊబకాయానికి గురవుతున్నారు. ఫలితంగా శ్వాస, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి రక్షించుకునేందుకు అనేకమంది వ్యాయామాలతోపాటు ఆహార నియంత్రణ కూడా పాటిస్తున్నారు. ఏ తరహాలో నియంత్రణ పాటించాలో తెలియక శరీరంలో ఉన్న కాస్త శక్తినీ కోల్పోతూ నిస్సత్తువగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ చేసేవారు మినహా మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు విధిగా రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాల్సి వుంది. ఆహార నియంత్రణ పాటించడంపై శ్రద్ధ వహించాలి.
ఎదుగుదల, కండ పుష్టికి విధిగా కాల్షియం, ఇనుము (ఐరన్) పోషకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాటితోపాటు విటమిన్ బి, సితోపాటు అయోడియన్ ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. కాల్షియం లోపిస్తే ఎదుగుదల లేకపోవడంతో పాటు ఎముకలు పెళుసుబారిపోతాయి.
ఐరన్ లోపంతో రక్తహీనత
ఎముకల పటుత్వంతోపాటు కండపుష్టి కూడా వుండాలి. అప్పుడే శరీరం దృఢంగా ఉంటుంది. ఐరన్ పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే కండపుష్టి చేకూరుతుంది. ఐరన్ లోపం వున్న వ్యక్తుల్లో రక్తహీనత లోపించడంతోపాటు, రక్తం ఎర్రగా కనిపించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉంటుంది.
ఇవి పాటిస్తే మేలు
1800 నుంచి 2100 కేలరీల శక్తి మనిషికి అవసరం. అందుకు 30 నుంచి 40 గ్రాముల ప్రొటీన్లు లభించే ఆహారం తీసుకోవాలి. 0.4 నుంచి 0.5 గ్రాముల కాల్షియం, 15 నుంచి 20 మిల్లీ గ్రాముల ఐరన్ ఉండేటట్లు చూసుకోవాలి. కండపుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు, నూనెలు లేని ఆహారాన్ని మితంగా రోజుకు ఐదుసార్లు తీసుకోవాలి.
రోజువారీ ఆరోగ్య షెడ్యూల్ ఇలా..
ఉదయం పూట రొట్టె, గ్లాసుడు పాలు, గుడ్డుతో కలిపిన పాల చక్కెర, ఈ మూడింటిలో రెండింటిని విధిగా తీసుకోవాలి. మధ్యాహ్నం వేళ అన్నం, పప్పుకూర, పెరుగు, మజ్జిగ, ఏదైనా ఒక పండు తినాలి. సాయంత్రం పూట బిస్కెట్లు, రవ్వ, లడ్డూ వంటివి ఇంట్లో తయారుచేసుకున్నవి తినాలి. రాత్రికి భోజనం ఆకు కూరతో కూడిన రెండు చపాతీలు, పప్పు, ఆకు కూరతో కూడిన రెండు కప్పుల అన్నం, పెరుగుతో భోజనం చేయాలి.

పోషకాలు లభించే ఆహారం
పాలు, ఆకుకూరలు, చిన్న సైజు చేపల్లో కాల్షియం ఎక్కువగా వుంటుంది. కాలేయం, గుడ్లు, చేపలు, పప్పు, డ్రైఫ్రూట్స్, బెల్లం, అటుకులు వంటి వాటిని తగిన మోతాదులో తీసుకుంటుండాలి. వీటితోపాటు స్వచ్ఛమైన నీటిని తీసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని, శరీరాకృతిని మన సొంతం చేసుకోవచ్చు. ఇక పరితపిస్తే అందరికీ సైజ్ జోరో సాధ్యమే.

-నీలిమ సబ్బిశెట్టి