సబ్ ఫీచర్

అహం వీడితే అందరికీ చేరువ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టీవీ వార్తల్లో చూసినా, పేపర్లలో చూసినా హెడ్ లైన్స్ ఎక్కువగా హత్యలు లేకపోతే ఆత్మహత్యలు. హత్యలు కక్షలతో గూండాలతో సినిమాలో విలన్ల టైపులో జరిగేవి కొన్నయితే, మొగుళ్లు పెళ్లాలని, పెళ్లాలు మొగుళ్ళని, అత్తల్ని చంపడాలు, అత్తలు కోడళ్ళని చంపడాలు ఇలా కొన్ని. వీటికి డెయిలీ సీరియల్స్ ప్రేరణ కావచ్చు. మొగుడిమీద కోపంతో తన చేతులతో తనే పిల్లలకి విషం పెట్టి, తను తిని చచ్చేవాళ్ళు కొందరు. ఆస్థుల కోసమో పర స్ర్తి (పురుషుడి) ఆకర్షణలో పడి ధర్మబ్ద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యని (్భర్తని) హత్య చేసే ప్రబుద్ధులు కొందరు. ఒక్కొక్క కథ చదువుతూ వింటూ వుంటే మనం కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నామా? ఇప్పుడే ఇలా వుంటే చివరికెలా వుంటుంది? అని ఆలోచించి బిపిలు పెంచుకునేవారు కూడా లేకపోలేదు.
వీటిని అన్నిటికీ మూలకారణం అహంకారం. తాము చేసేదే సరైనది, మిగిలినవారంతా ఎందుకూ పనికిరాని వెధవలు అని ఎవరికివారు అనుకోవడం కొంత కారణం. వారూ మనలాంటి వారే! వారి భావాలు వారికుంటాయి. అందరికీ మనలాంటి భావాలే వుండాలని ఎక్కడుంది? అని ఆలోచిస్తే అసలు గొడవలు రావు. అహంకారంతోనే ఎదుటివాళ్ళు తమ మాట వినాలని, వినలేదని తిట్టడాలు కొట్టడాలు ఇంకా పరాకాష్టకు వచ్చి హత్య చెయ్యడాలు జరుగుతున్నాయి.
వివాహ బంధమంటూ ఏర్పడ్డాక ఒకరికొకరుగా జీవించడం, కష్ట సుఖాల్లో భాగం పంచుకోవడం, ఒకరి లోపాలని ఒకరు సహించి సర్దుకుపోవడం, ఒకరి విషయాలు ఒకరు మనసు విప్పి చెప్పుకోవడం, ఎదుటివారికి ఇష్టంలేని పనులు వీలయినంతవరకూ మానుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆచరించాల్సి వచ్చినా తమ తప్పుని ఒప్పుకోవడం, క్షమాపణ (సారీ) చెప్పుకోవడం, అలాంటివి పాటిస్తే రోషాలకి, కక్షలకి హత్యలకి, ఆత్మహత్యలకి తావుండదు. ఎదుటివారిలో అటువంటి గుణం లేక ఎప్పుడూ తామే సర్దుకుపోవాలంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. అయితే వారిలో మార్పుకి శాయశక్తులా ప్రయత్నించాలి. తప్పనిసరి పరిస్థితి అయితే విడాకులు తీసుకునేందుకు ప్రయత్నించాలే గానీ హత్యలకి ఆత్మహత్యలకి పాల్పడకూడదు. దానివల్ల ఒరిగేదేమీ వుండదు. జైలు పాలవడం, జీవితానే్న పోగొట్టుకోవడం తప్ప. పిల్లలుంటే వారి బతుకు ఏవౌతుందో కూడా ఆలోచించాలి. ఆలోచించే బుద్ధి వుంటే అటువంటి పనులకి పాల్పడరు.
ఇటీవల అమ్మాయిలకి పాతికేళ్ళు పైబడ్డాక పెళ్లిళ్ళు అవడం, వెంటనే పిల్లలు వద్దని కొంతకాలం కుటుంబ నియంత్రణ పాటించడం, తరువాత కావాలనుకున్నప్పుడు సంతానం కలగకపోవడంతో భార్యని తిట్టడం, ఇంట్లో పెద్దలు కూడా గొడ్రాలు అంటూ సతాయించడం, వేరే పెళ్లి చేసుకోమంటూ సలహాలు ఇవ్వడం కొన్ని చోట్ల జరుగుతోంది.
మగవారు కూడా వేరే స్ర్తిలమీదకి దృష్టి మరల్చుకోవడం వంటివి జరుగుతున్నాయి. అది సహించలేక ఇక తమ జీవితమే వృధా అనుకుని ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. కొందరైతే అత్త, భర్త కలిసి ఆమెని చంపేసి ఆత్మహత్యగా నిరూపించి లంచాలిచ్చి తప్పించుకుని రెండవ పెళ్లి చేసుకుంటున్నారు.
సంతానం కోసం హింసించేకన్నా లేకపోవడమే మంచిది. వారి కోసం వారు బ్రతుకుతారు. కావాలంటే ఏ అనాధలనైనా చేరదీస్తే వారికీ వీరికీ కూడా ఆనందం చేకూరుతుంది. సంతానం కలగకపోతే పుట్టేం ములిగిపోదు. అంతమాత్రం చేత వారు పనికిరాని వారైపోరు. దశరథుడికే అరవై వేల ఏళ్ళు భార్యలతో కాపురం చేసినా సంతానం కలగలేదు, పుత్రకామేష్టి చేసేవరకూ! అంతమాత్రం చేత హత్యలు, ఆత్మహత్యలూ అక్కర్లేదు.

- ఆర్.ఎస్.హైమవతి