సబ్ ఫీచర్

ఉద్యమంలా స్వచ్ఛంద సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవ చేయాలని చాలామంది చెబుతారు. అలా చెప్పినవారిలో చాలామంది చేతల్లో అది చూపించరు. కానీ నిజంగా, చిత్తశుద్ధితో స్వచ్ఛందంగా సేవ చేసేవారు చాలామందే ఈ ప్రపంచంలో ఉన్నారు. లాభాపేక్ష లేకుండా, జాతిని, జగతిని, కష్టాల్లో ఉన్నవారిని రక్షించేందుకు ముందుకు వస్తున్న వారు లెక్కకుమించి ఉన్నారు. వారి సేవకు వెలకట్టలేం. నిజానికి సేవచేయడమన్నది ఓ త్యాగం. అలా పనిచేస్తున్న వలంటీర్ల కోసం ఐక్యరాజ్య సమితి ఏటా డిసెంబర్ 5న అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం (ఇంటర్నేషనల్ వలంటీర్స్ డే) నిర్వహిస్తోంది. స్వచ్ఛంద సేవ అనేది ఓ ఉద్యమమనే చెప్పాలి. ఈ ఉద్యమంలో ఐక్యరాజ్య సమితి కీలకపాత్ర పోషిస్తోంది. రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పలు ఎన్‌జిఒ సంస్థలు, స్వచ్ఛంద సేవలో నిమగ్నమయ్యాయి. అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, స్థానిక సమస్యల సమయంలో ముందుకువచ్చి తమ విలువైన సమయాన్ని, శ్రమను, వ్యయప్రయాసలను ఫణంగాపెట్టి సేవలు అందించడంలో లక్షలాదిమంది నిమగ్నమవుతున్నారు. 1985 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ స్వచ్ఛంద సేవను ఓ ఉద్యమంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం వలంటీర్లను స్వయంగా కూడదీసి ప్రోత్సహిస్తోంది.
హెచ్‌ఐవి అదుపు, భూకంపాలు, వరదలు, ఇతర విపత్తులు, యుద్ధాలు, ఘర్షణల సమయంలో బాధితులకు అండగా నిలిచి సేవలు అందించడంలో ఈ స్వచ్చంద సేవకులు అండగా నిలుస్తున్నారు. మొన్నటికిమొన్న న్యూజిలాండ్, ఇటలీల్లో భూకంపాల ధాటికి జనం విలవిలలాడితే క్షణాల్లో అక్కడకు చేరి సాయం చేశారు ఈ వలంటీర్లు. జర్మనీలోని బాన్ వేదికగా యుఎన్ వలంటీర్ల సంస్థ సేవలందిస్తోంది. 130 దేశాల్లో ఐక్యరాజ్య సమితి వలంటీర్ల సంఘం 86 ఫీల్డ్‌యూనిట్లతో పనిచేస్తోంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎక్కడ కావలసి వస్తే అక్కడ సేవలందిస్తూంటారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల నుంచి, మిగతావారు సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలకు చెందినవారు ఉంటున్నారు. ఇక యుఎన్ ఆన్‌లైన్ వలంటీర్ల విభాగం 2000 సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఆన్‌లైన్‌లో సేవలందించే వలంటీర్లు ఉంటారు. ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు భాషల్లో ఈ ఆన్‌లైన్ వేదికలు పనిచేస్తాయి. 2014లో 16,134 సందర్భాలలో వీరు విశేష సేవలు అందించారు. ఇక యుఎన్ వలంటీర్లు విపత్కర పరిస్థితుల్లో, తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా సేవలందించాల్సి ఉంటుంది. వీరికి నామమాత్రమ గౌరవభృతిని నెలనెలా ఐక్యరాజ్య సమితి అందిస్తుంది. ఇలా స్వచ్ఛంద సేవాకార్యకర్తగా ఐక్యరాజ్య సమితి వలంటీర్ విభాగంలో పేరు నమోదు చేసుకునేందుకు కనీస వయోపరిమితి 25 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి లేదు. ఇక్కడ కావలసిందల్లా ప్రయోజనం ఆశించకుండా స్వచ్చందంగా సేవలు అందించడమే. ప్రపంచాన్ని వేధిస్తున్న 8 సమస్యలను ది మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ (ఎండిజి)గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాప్తిని అడ్డుకోవడం, సంపూర్ణ అక్షరాస్యత సాధించడం, ప్రాథమిక విద్యను ప్రోత్సహించడంలాంటి అంశాలు వాటిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎదురయ్యే సంక్షోభాల సమయంలో స్థానిక వలంటీర్లు సేవలందించడం మామూలే. కానీ అంతర్జాతీయ సమాజం గుర్తించిన పెను సమస్యల పరిష్కారంలో వలంటీర్ల పాత్రం ఇటీవలి కాలంలో కీలకమైంది. యూరోప్‌లో వలసలు, మద్యప్రాచ్యంలో ఐసిస్‌పై యుద్ధం, పేదరికం, వౌలిక వసతుల లేమి నెలకొన్న ప్రాంతాల్లో వలంటీర్ల సేవలు ఎంతో అవసరం. వలంటీర్‌గా పనిచేయడమంటే ఓ స్ఫూర్తి కలిగించినవారిగా మన్నన పొందడమన్నమాట. ప్రజల్లో ఆ స్ఫూర్తి కలిగించడానికి ఐక్యరాజ్య సమితి స్వచ్ఛంద సేవను ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా ఓ సందేశంతో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది లక్ష్యం ‘గ్లోబల్ అప్‌లాస్... గివ్ వలంటీర్స్ ఎ హాండ్’. అందుకే మనం స్వచ్చంద సేవకులకు చేయూతనిద్దాం.

-కృష్ణతేజ