సబ్ ఫీచర్

నిమ్మరసంతో నిగారింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని కాలాల్లోను లభిస్తుంది నిమ్మికాయ. ఇది సిట్రస్ జాతికి చెందినది. రుచికి పులుపుగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మపండులో నీరు, సి విటమిన్ అత్యధికంగా లభిస్తాయి. నిమ్మరసం ఏ విధంగా శరీరానికి తోడ్పడుతుందో తెలుసుకుంటే ప్రతివారూ నిమ్మరసాన్ని తప్పక వాడతారు.
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, తేనెను కలిపి త్రాగితే అధిక బరువును తగ్గించవచ్చును.
నిమ్మరసం నాలుకమీద ఏర్పడిన జిగురును పోగొట్టి, నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
జీర్ణశక్తికి తోడ్పడుతుంది.
తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టు మెత్తగా మారుంతుంది.
జలుబుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతూంటే చర్మం వర్చస్సును పెంచుతుంది. నిమ్మరసంలో క్యాలరీలు లభించవు కనుక, స్థూలకాయం ఏర్పడదు ప్రతిరోజూ తీసుకున్నా.
ఎండ ప్రభావం చర్మం మీద పడకుండా రక్షణగా పనిచేస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.
జిడ్డు చర్మం వున్నవారు ముఖానికి నిమ్మరసం రాస్తే జిడ్డు తొలగిపోయి ముఖం కాంతిగా కనిపిస్తుంది.
నిమ్మరసంలో పసుపును కానీ, గంథం పొడిని కలిపి మొటిమలమీద ఆరారగా రాస్తూంటే ఆ సమస్యను నివారించవచ్చు.
ఉదర సంబంధిత అనారోగ్యాలకు నిమ్మరసం ఔషధంలా పనిచేస్తుంది.
పంటి చిగురు వాపును తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను క్రమంగా పనిచేసేలా చేస్తుంది. కఫాన్ని పోగొడుతుంది. అజీర్తి వ్యాధిని పోగొడుతుంది. వాతాన్ని అరికడుతుంది.
వేడి నీటిలో నిమ్మరసాన్ని కలిపి పుక్కిట పట్టి పుక్కిలిస్తూంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది. అధిక దప్పికను నివారిస్తుంది.
నిమ్మరసంలో వంట సోడాను కలిపి త్రాగితే కడుపులో మంటను నివారిస్తుంది.
చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని, మృదుత్వాన్ని పెంపొందిస్తుంది.
- మాదకద్రవ్యాలవల్ల ఏర్పడే మత్తునుంచి బయటపడేలా చేస్తుంది.
మతిమరుపును తొలగించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది.

-కె.నిర్మల