సబ్ ఫీచర్

నెల గంట మోగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి ముంగిళ్లలో పెద్ద పండుగ సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని చిన్నా పెద్దా ఎదురుచూసే సంక్రాంతి సంబరాలను మోసుకుంటూ ఇంటి ముంగిటకు చేరింది. ధనుస్సంక్రమణం ప్రారంభం కావడం నెల్లాళ్ల పండుగ సంబరం మొదలవుతోంది. ముత్యాల ముగ్గులతో వాకిళ్లు కళకళలాడనున్నాయి. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, ఆటల పోటీలు, కోడి పందాలు అందరినీ ఉత్తేజపరచనున్నాయి. ఊరు,వాడా ముస్తాబవుతోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే పెద్ద పండుగ అంటే అందరికీ అమితమైన అనురక్తి. పాతకు స్వస్తిపలికి కొత్తదనానికి నాంది పలికే మూడు రోజుల పెద్ద పండుగ ఇది. ఇంటింటికి తిరిగి పేడ కోసం చిన్నారులు చేసే హడావుడి అందరినీ బాల్యంలోకి తీసుకెళ్ళి మనస్సులను పులకింపజేస్తుంది. కొత్త అల్లుళ్ళు, పందాల జోరు చెప్పక్కర్లేదు. పోలీసుల కళ్ళుగప్పి కోళ్లను చంకన బెట్టుకుని కోడి పందాల కోసం పరుగులు తీసే పందెం రాయుళ్లు..ఇలాంటి దృశ్యాలు చూడముచ్చటగా కనువిందు చేయను న్నాయి.

- నందిని