సబ్ ఫీచర్

మేధకు మేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదడు సమర్థంగా పనిచెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. ఇందుకోసం మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మెదడును చురుకుగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు వ్యాయామం దగ్గరనుంచి కొత్త హాబీలను అలవరచుకోవటం వరకూ రకరకాల పద్ధతులు తోడ్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.
మతిమరుపు ఇప్పుడది అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. చదివింది గుర్తుండక, పరీక్షల్లో జవాబులు తట్టక ఇబ్బందులు పడే విద్యార్థులు ఎందరో. చాలాసార్లు ఏదో ఒకటి మరచిపోతున్నామని చెబుతున్న యువకులూ లేకపోలేదు. ఇలా అడపా దడపా ఏదో ఒకటి మరచిపోవటం పెద్ద సమస్యేం కాదు. కానీ తరచుగా దీర్ఘకాలంగా వేధిస్తుంటే మాత్రం జాగ్రత్తపడాల్సిందే. తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు ఇది సూచికా కావచ్చు.
పనిచేస్తుంటేనే మన కండరాలు బలపడతాయి. ఎప్పటికప్పుడు కొత్తశక్తిని సంతరించుకుంటాయి. మెదడు కూడా అంతే. పదునుపెట్టే పనులు ఆలోచనతోనే అది చురుకుగా, సమర్థంగా తయారవుతుంది. అందుకే మన మెదడుకూ వ్యాయా మం అవసరం. నిజానికి 20, 30 ఏళ్ళ క్రితంతో పోలిస్తే మనం ఇప్పుడు మెదడును అంత సమర్థంగా వాడుకోవటం లేదనే చెప్పాలి. ఒకప్పుడు కావాల్సిన ఫోన్ నెంబర్లన్నీ గుర్తుంచుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్స్ వచ్చేశాయి. మెదడు చురుగ్గా ఉండాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీలయినంతగా చదవాలి. కొత్త భాషను నేర్చుకునే క్రమంలో మెదడు చురుగ్గా స్పందించి ఉత్తేజితమవుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం అంటే మెదడుకి తగినంత వ్యాయామం అందించినట్లే. మానసిక ఒత్తిడివల్ల కార్టిజోల్ హార్మోన్ విడుదలవుతుంది. అది మెదడు పనితీరును నిరోధిస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనయినట్లు గుర్తించిన వెంటనే పది నిమిషాలసేపు ఇష్టమైన పని చేయడంవల్ల ఒత్తిడి తగ్గి మెదడు ఉత్తేజితమవుతుంది. ఆహార విహారాదుల్లో క్రమశిక్షణ ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల మెదడు చురుకుదనం కోల్పోతుందని ఆండ్రొవెయిల్ అనే పరిశోధకుడు చెబుతున్నారు. మరి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండేం.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి
ఆహారంలో బి విటమిన్ పుష్కలంగా తీసుకోవాలి. దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. బి విటమిన్లు ఆకుకూరలు, చికెన్, గుడ్లవంటివాటిలో దండిగా వుంటాయి. అలాగే విటమిన్ కె దండిగా ఉండే అరటి, గోబీపువ్వు, బ్రకోలీ వంటివి తీసుకోవటం మంచిది. చేపలు కూడా మెదడు చురుకుదనాన్ని పెంచేందుకు పనిచేస్తాయి. ఈ ఆహారం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
*

-మూర్తి