సబ్ ఫీచర్

నట్స్ తినండి.. నాజూగ్గా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాదం పప్పు: బరువు తగ్గుటకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
వాల్‌నట్: బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ లెవెల్స్‌ను పెంచుతుంది. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
జీడిపప్పు: రక్తపోటును తగ్గిస్తుంది. కాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడుతుంది. ఎర్ర రక్తకణాలను పెంపొందిస్తుంది. కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రిను మెరుగుపరుస్తుంది.
ఖర్జూర: కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కండరాలను బలంగా చేస్తుంది. తక్షణ శక్తిని కలుగజేస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. అలసటను దూరంగా ఉంచుతుంది.
అంజీర: హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. సెక్సువల్ డిసార్డర్స్‌ను సరిచేస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. కంటిచూపును రక్షిస్తుంది.
ఆప్రికాట్: ఇన్‌ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది. విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాక కావలసిన ఫైబర్స్ పుష్కలంగా వున్నాయి. కంటిచూపును రక్షిస్తుంది. కండరాలను బలంగా చేస్తుంది.
పిస్తాషియోస్: హిమోగ్లోబిన్‌ను పెంపొందిస్తుంది. చర్మ సౌందర్యానికి, కళ్ళకు ఎంతో గొప్పగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
అవిశగింజలు: కడుపునొప్పిని దూరం చేస్తుంది. బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్‌ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా చేస్తుంది. మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. హార్మోన్ లెవెల్స్‌ను స్టెబిలైజ్ చేస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు: అవసరం లేని ఫ్యాట్స్‌ని తీసేసి అవసరమైన ప్యాట్స్‌ని వుంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ని తగ్గిస్తుంది. ఆందోళన, డిప్రెషన్‌ను కంట్రోల్ చేస్తుంది. న్యూట్రియంట్స్‌ను వంటపట్టేలా చేస్తుంది.

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం