సబ్ ఫీచర్

‘జయ వసంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ జిల్లాలోని వేముల అనే ఓ గ్రామంలో విద్యార్థులు రాసిన కవితలను వినూత్న రీతిలో సంకలనం రూపంలో ఆవిష్కరించారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పల్లెర్ల హనుమంతరావు ‘జయ వసంతం’ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. తమ పాఠశాలకు తప్పకుండా రావాలని నన్ను ఆయన ఆహ్వానించడంతో ఆ గ్రామానికి వెళ్లాను. పాఠశాలలో విభిన్న రీతిలో చేసిన ప్రయోగాన్ని నేను చూడాలని ఆయన ఆకాంక్షించారు. నేను ఒక పాఠం చెబితే పద్దెనిమిది రకాల నిర్మాణాలుంటాయి. ఆయన ఒక వ్యాసం చెబితే పిల్లలు దాన్ని గేయంగా రాశారని తెలిపారు. ఏడో తరగతి విద్యార్థిని అరుణ, ఎనిమిదో తరగతి విద్యార్థి శివశాంతి రాసిన కవితలు చూస్తే- వారు రాసిన ఆ వాక్యాలు ఎవరినైనా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, ప్రపంచానికి పరిచయం చేసేందుకు వారు రాసిన చిట్టిపొట్టి కవితలను ఉపాధ్యాయుడు ఓ సంకలనంగా వెలువరించాడు. దీనినే ‘కాల్పనిక పాఠం’ అని అభివర్ణించవచ్చు. అంటే విద్యార్థిలోని సహజసిద్ధమైన భావాలలో కనిపించే విలువలను బహిర్గతం చేసే విధంగా పనిచేసేదే ‘క్రియేటివ్ లెసన్’ అని అంటారు. ఇలాంటి ‘కాల్పనిక శక్తి’ కొంతమందిలో బహిర్గతం అవుతుండగా, మరికొంతమందిలో అ ది నర్మగర్భంగా ఉం టుంది. కొందరిలో బ యటకు కనిపించకుం డా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే ప్రతి విద్యార్థిలో ఈ ‘కాల్పనిక శక్తి’ తప్పక ఉంటుంది. దీన్ని వెలికితీసే వ్యక్తి సైన్స్ టీచర్ కావచ్చు. లేదా గణితం మాస్టారు కావచ్చు. ఇక్కడ సబ్జెక్టు అన్నది ప్రధానం కాదు. ఒక విద్యార్థి ఒక అంశం నేర్చుకున్న తర్వాత తన జ్ఞానాన్ని, తన నైపుణ్యాన్ని, తన భావాలను అంతరంగంలో తనదైన రీతిలో విశే్లషించుకుంటాడు. దీనే్న ‘క్రియేటివ్ థింకింగ్’ అంటాము. క్రియేటివ్ థింకింగ్ అంటే ‘ఫ్రెష్ థింకింగ్’. ఉపాధ్యాయుడు ఒక పాఠం బోధించిన అనంతరం- పిల్లల్లో కలుగుతున్న భావాలను కూడా చూడగలగాలి. పాఠం చెప్పడం ఒక్కటే ప్రధానం కాదు, పిల్లల్లోని సృజన, వారి భావనలను ఉపాధ్యాయుడు గమనించి వాటిని కొత్త కోణంలో విశే్లషించాలి. బోధన తర్వాత విద్యార్థుల్లో కలిగే విమర్శనాత్మకమైన ఆలోచనలే ‘క్రిటికల్ థింకింగ్’. ఆ భావన ఒక కథలా రావచ్చు. అది ఒక నూతన ఆవిష్కరణ కావచ్చు. కానీ, అది ఎప్పుడూ కొత్త సంబంధాలను మాత్రం రూపొందిస్తుంది. అదే తరగతి గది అసలు లక్ష్యం. పాఠం ముగిసిన అనంతరం విద్యార్థి ఒంటరిగా కూర్చుని ఒక మూడ్‌లోకి వెళ్లిపోతాడు. దానే్న వెనుకటి తరం వారు ‘్ధ్యనస్థితి’ అనేవారు. అది విద్యార్థి మెదడు నుంచి వచ్చిన మీగడ. దాన్ని చిలికితే అది తరగతి గది లక్ష్యం అవుతుంది. అదే- ఈ ‘జయ వసంతం’ పుస్తకం అని.. దాన్ని రూపొందించిన ఉపాధ్యాయుడు తెలిపారు.

-చుక్కా రామయ్య