సబ్ ఫీచర్

ధనం కన్నా ధనియం మిన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కుటుంబాల్లో నెలసరి సరుకులు తెప్పించుకునేటప్పుడు ధనియాలు, శొంఠి, వాము మన జాబితాలో వుండవు. నిత్య జీవన విధానంలో వాటి అమూల్యమైన విలువలు మనకు తెలియవు. ఆరోగ్యరీత్యా ప్రత్యేకించి పిల్లలకు అవి ఎంతో ఉపయోగపడతాయి. అసలు ధనియాలు కూరల్లో, మసాలా కోసం కాకుండా ఔషధంగా కూడా వాడవచ్చు. రోజూ స్ర్తిలు తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన స్ర్తిలలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది. జీలకర్ర, ధనియాలు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని మాత్రలుగా చేసి వాటిని ప్రతిరోజూ మూడు పూటలా వేసుకుంటే అజీర్ణానికి, కీళ్ళనొప్పులనుండి విముక్తి లభిస్తుంది. స్ర్తిలలో కొందరికి రాత్రిళ్ళు నిద్రపట్టక అవస్థపడుతూ వుంటే వారికి నిద్రపోయే ముందు దనియాలతో కషాయాన్ని చేసి దానిలో పాలు కలుపుకొని కొద్దిగా తీసుకుంటే సుఖ నిద్రపడుతుంది. అజీర్తి, పులిత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది. కడుపులో మంట, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే కడుపులో నొప్పి, తలనొప్పి కూడా తగ్గిపోతుంది. పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసానికి బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే చిన్నపిల్లలకుకూడా అది మంచి ఆరోగ్యం. దగ్గు, ఆయాసం మటుమాయవౌతాయి.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03
**

- బి.విజయలక్ష్మి