సబ్ ఫీచర్

మొటిమలు తెచ్చే అందవికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువకుల్లో మొటిమలు వస్తే అంత ఎబ్బెట్టుగా వుండదు. కాని యువతులకు అవి వస్తే వారు పరువంలో ప్రవేశించినట్లే! ఇది సైంటిఫిక్‌గా ఆలోచిస్తే సెక్స్ హార్మోన్‌లవల్ల ఇవి వస్తాయి. మగ పిల్లలకంటే ఆడపిల్లలు తమ ముఖ సౌందర్యం చందమామకు మచ్చలు వచ్చినట్లే భావిస్తారు. మనసులో బాధపడుతూ ఉంటారు. ఎన్నో స్నోలు, ఆయింట్‌మెంట్లు, సౌందర్య సాధనాలు, ఆయిల్స్, ఫెయిర్ అండ్ లలీ క్రీమ్సు, ప్రస్తుతం మార్కెట్లో దొరికే లేపనాలు వాడతారు. కొంతకాలం ఇవి వాడినా లాభం లేక కొత్త మొటిమలు పొటకరిస్తుంటే చిరాకుపడి ఎక్స్‌పర్ట్ డాక్టర్లను ఆశ్రయిస్తారు. వారు మందుల పరంగా, డైటింగ్ పరంగా సలహాలు ఇస్తారు, నయం చేస్తారు. బద్ధకించి ఎవ్వరినీ సంప్రదించకపోతే కోతి పుండు బ్రహ్మరాక్షసి అయిన చందంగా మొటిమలు పెరిగి నల్లమచ్చలు వస్తాయి. దానికి ఇంగ్లీషు, ఆయుర్వేద వైద్యాలు వున్నాయి. మోడర్న్ వైద్యానికి వస్తే టెట్రాసైక్లిన్, ఇతర యాంటిబయాటిక్స్ మందులు వాడి కడుపులోనికి ఎంత్రోమైసిన్ టాబ్లెట్స్ ఇస్తారు. సొల్యూషన్ మొటిమలపై రాయమంటారు. విటమిన్ ఇ, ఏ, బి కాంప్లెక్స్ మందులు, రక్తవృద్ధిని కల్గించే ఐరన్, ఫోలిక్ యాసిడ్, మందులు వాడక తప్పదు. ఇప్పుడు డెర్మటాలజిస్టులు నవీన మందులు, పైపూతలు ఇస్తున్నారు. సుగుణం ఇస్తోంది. ఇదివరకు పైపూతలకు రిసార్సినాల్, శాలిసివిల్ యాసిడ్, కర్పూరం వాడమనేవారు. తరచూ గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుంటే చర్మ రంధ్రాలు విచ్చుకొని మొటిమలు తగ్గుతాయి. ఆయుర్వేద వైద్యంలో పసుపు, తులసి ఆకు, ఇతర మూలికలతో ఇవి తగ్గుతాయి. ఏదిఏమైనా వైద్యుల పర్యవేక్షణలో జరిగితే మంచిది. ఇరుగమ్మ పొరుగమ్మ చెప్పే నాభి, గురువిందింజలు, జీడికాయలు వాడితే రియాక్షన్స్ వస్తుంది. అందవికారులౌతారు సుమా. సొంత వైద్యం అన్ని వేళలా అపాయకరకం అని గ్రహించండి.

-బి.విజయలక్ష్మి