సబ్ ఫీచర్

అమ్మో.. నగదు రహితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నగదు రహిత తెలంగాణ’లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేందుకు ఐదుగురు ఐఎఎస్ అధికారులతో ఒక కమిటీని ముఖ్యమంత్రి నియమించడం హర్షణీయం. అయితే, డిజిటల్ లావాదేవీలతో ప్రజలకు సరికొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. స్వైపింగ్ మిషన్లు, ఎటిఎం కార్డుల ద్వారా లావాదేవీల ఫలితంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంది. ఎటిఎం కేంద్రాల్లో సిసి కెమెరాలతో నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ అనేక నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎటిఎం కార్డులను వాడేవారు ‘పిన్’ నెంబర్లను ఎంత రహస్యంగా ఉంచుకున్నప్పటికీ వారి ఖాతాల్లో నగదు అదృశ్యం కావడం వంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు ఖాతాదారులు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా కేసుల సంగతి తేలడం లేదు.
గ్రామీణ ప్రాంతాల వారు, అంతగా చదువుకోని పేదలు నగదు రహిత లావాదేవీలను ఇతరులపై ఆధారపడకుండా ఎలా చేయగలరు? ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రహితం కావాలని నిబంధనలు విధిస్తే అది సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే అవుతుంది. బీడీ కార్మికులు, కూలిపనులు చేసుకునేవారికి ఈ విధానంతో సమస్యలు తప్పవు. తమ పేరుకూడా తప్పులు లేకుండా రాసుకునే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది. ‘వేలిముద్రలు మానండి.. సంతకాలు నేర్వండి’ అనే నినాదం చాలాకాలంగా విన్పిస్తున్నా- ఎంతోమంది మూడక్షరాల పేరును కూడా సరిగా రాయలేని స్థితిలో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ సెల్‌ఫోన్ ద్వారానే జరపాలంటే ఇలాంటి వారికి ఇక్కట్లు అనివార్యం. విలాస వస్తువులు, బంగారు, వెండి, కార్లు కొనుగోలు చేసేవారికి నగదు రహిత విధానం అమలు చేస్తే మంచిది.
గ్రామీణ ప్రాంతాలలో చాలా బ్యాంకుల పరిస్థితి చెప్పనక్కరలేదు. ట్రాన్జాక్షన్ వివరాలను ఎంట్రీ చేయమంటే ‘ఆన్‌లైన్’ పనిచేయడం లేదని, ప్రింటర్ పాడైపోయిందని బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. ఇంకా వేలాది గ్రామాలు బ్యాంకు సేవలకు దూరంగా ఉన్నాయి. కనీసం ఐదు ఊళ్లకు కలిపి కూడా ఒక బ్యాంకు శాఖ లేదు. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ‘నగదు రహిత లావాదేవీ’లంటూ నిబంధనలు విధిస్తే పల్లెవాసులు, పేదప్రజలు తీవ్ర కష్టనష్టాలను భరించవలసి ఉంటుంది. ఇందుకు ఇటీవల పెద్దనోట్ల రద్దు తర్వాతి పరిణామాలే నిదర్శనం. నగదు కోసం బ్యాంకుల్లో, ఎటిఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడిన జనం బాధలు వర్ణణాతీతం. పేదవాడికి రెండువేల రూపాయల నోటు దొరకడం దుర్లభం కాగా, కొత్త కరెన్సీ కట్టలు కట్టలుగా బడాబాబుల వద్దకు చేరిపోయింది. ‘క్యూ’లో నీరసించిన పేదలను పలకరించేందుకు రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ వచ్చిన దాఖలాలు లేవు. నోట్ల రద్దు వల్ల భవిష్యత్‌లో తమకు మేలు జరుగుతుందని భావించి పేద, మధ్యతరగతి వారు వౌనంగానే కష్టాలన్నీ భరించారు. ఈ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో నగదు రహిత లావాదేవీలంటూ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టడం భావ్యం కాదు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే అవినీతిని, నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాలి. సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు.

- పెండెం శ్రీ్ధర్