సబ్ ఫీచర్

ఆకాశ వీధిలో మెరిసే కుసుమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ చూసినా రంగు రంగుల గాలిపాటలు దర్శనమిస్తున్నాయి. విభిన్న రంగులలో భిన్నఆకృతులతో ఉన్న పతంగులు ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే గాలిపటాల పండుగ వైభవంగా సాగుతోంది. యువతీ యువకులు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌తారలు ,శాస్తస్రాంకేతిక అంశాలు, పక్షులు, ప్రకృతి సోయగాలు, కార్టూన్ బొమ్మలతో రెడీ చేసిన కైట్ లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
సంక్రాంతి అంటే కొందరికి మాత్రం అచ్చం గాలిపటాల పండుగే. భూమీద రంగుల ముగ్గలు.. ఆకాశంలో సప్తవర్ణాల గాలిపటాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొద్దునే్న చరఖా తీసుకున్నామంటే తిండీ తిప్పలు గుర్తుకురావు, నీళ్లు తాగాలన్న ధ్యాస కూడా ఉండదు. అరుపులు కేకలు.. పతంగ్ కట్ అయిందంటే గల్లీ గల్లీ అంతా దద్దరిల్లాల్సిందే. సఫా అయిన పతంగులు పట్టుకోవడంకూడా ఒక కళే. దానికి ఎన్ని ఎత్తులు వేయాలో తెగిన గాలిపటాలని గాల్లోనే పట్టేయడం కొంతమందికే తెలిసిన టెక్నిక్.
పతంగుల పండుగ పగలు మాత్రమే జరుపుకుంటారనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాత్రిళ్లు కూడా గాలిపటాలు ఎగరేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కన్పిస్తాయి. వాటిని చూసి పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నారుల్లా చప్పట్లు చరిచి ఆనందించాల్సిందే. అహ్మదాబాద్‌లోని పతంగ్ బజార్‌లో గాలిపటాలను పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా అమ్ముతూనే ఉంటారు. ఇక్కడి ఢిల్లీ దర్వాజ కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు రాజులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించేవారట.
గాలిపటాల్లోనూ ఎన్నో వెరైటీలు, నామందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, డోరేదార్, అద్దా- ఇలా చాలా రకాలుంటాయ. పతంగిమీద నామం ఉంటే అది నామందార్, కైట్ అడుగున చిన్న గౌనులాంటి డిజైన్ ఉంటే అది లంగోటి! గుడ్లందార్ అంటే రెండు కళ్లున్న పతంగి. గాలిపటంమీద చారలుంటే అది బనియన్‌దార్. ఒంటికన్నుంటే గుడ్డి లంగోటి, కైట్ సైజ్ పెద్దగా ఉంటే అది అద్దా! రంగు రంగుల కాయితాలతో చేసింది డోరేదార్! పర్ణీ పతంగ్ అంటే గు ట్కా పేపర్తో చేసింది, అద్దా అంటే పెద్ద పతంగ్, ఎవడు ఎంత పెద్ద పతంగి లూట్ చేస్తే వాడే ఆ గల్లీలో తోప్. ఇవే కాకుండా మో డ్రన్ పతంగులు కూ డా దొరుకుతా
యి. దుల్హ న్ జీబియా లంగోన్ చార్ ఆంఖ్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్ అని కార్టూన్ నెట్‌వర్క్, గాలిపటాలు, హీరోల బొమ్మలున్న కైట్లు మార్కెట్లో చాలా ఉన్నాయి.
మాంజా దారాలు పక్షుల కాళ్లకు చుట్టుకొని చనిపోతున్నాయి. మిద్దెలపై పతంగులు ఎగురవేసేవారు కింద పడిపోతున్నారు. తెగిపోయిన గాలిపటాలను పట్టుకునే యత్నంలో ఎందరో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ర్యాంకుల కోసం చదువులు సెలవుల్లోనూ తప్పని అసైన్‌మెంట్లు మరోవైపు చదవమంటూ పేరెంట్స్ పెట్టే పోరు, ఫలితంగా కైట్స్ ఎగరేసేందుకు ఇంట్రెస్ట్ పోయిందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలిపటాలు ఎగురవేసే సమయంలో ఆనందం ఎంత వుందో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా డేంజరే. డాబాలమీద గాలిపటాలు ఎగురవేయవద్దు. మైదానాలు, ఖాళీ ప్రాంతాల్లో అయితే మం చిది. తెగిన గాలిపటాలు పట్టుకునేందుకు గుంపులుగా పరుగులు తీయవద్దు. విద్యుత్ వైర్లు, గోతులు, నీటి సంపులు ఉన్న చోట ఈ ఆటలు విషాదమే మిగులుస్తాయి. గాలిపటాలు పడితే తెచ్చుకోవడానికి గోడ లు దూకవద్దు. చిన్నారుల ఆటలు ఏవైనా ఎలాంటి ముప్పు జరగకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. విద్యుత్ లైన్లకు దూరంగా ఎగురవేయాలి. విమానాశ్రయాల వద్ద ఎగురవేయవద్దు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి