సబ్ ఫీచర్

మాది అందమైన బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా మధ్య ఉన్నది అందమైన బంధం, నేను ఆమెకు తల్లినే గానీ స్నేహితురాలిగా ఉంటాను అని చెబుతుంది ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా. వ్యక్తిగత విషయాలను బయటకు వెళ్లడించేందుకు ఇష్టపడని ప్రియాంక చోప్రా నేడు అంతర్జాతీయ వేదికలపై సెలబ్రిటీగా మారి రెడ్‌కార్పెట్ స్వాగతాల ను అందుకుంటుంది. పెళ్లెపుడు అని అంటే ఇంట్లో ఈ విషయంపై తనమీద ఒత్తిడి లేదని మాత్రమే చెప్పి తప్పించుకుంటుంది. ఒకనొక సమయంలో ప్రియాంకకు పెళ్లి చేద్దామని అనుకున్నాంగానీ కెరీర్‌ను పాడుచెయ్యటం ఇష్టంలేక ఆ ప్రతిపాదనను విరమించుకున్నామని తల్లి మధుచోప్రా అంటున్నారు. ఇపుడు చిత్రపరిశ్రమలో మంచిస్థాయిలో ఉంది. ఆ పొజిషన్‌ను పాడుచెయ్యటం ఎందుకని పెళ్లి ప్రతిపాదనను విరమించుకున్నామని వెల్లడించింది. అంతేకాదు ప్రియాంక చోప్రా తన తల్లితో కలసి సొంత బ్యానర్‌ను ఏర్పాటుచేసి హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ టెలీ సీరియల్స్‌తో పాటు మరికొన్ని ఫిల్మ్ ప్రాజెక్టుల వర్క్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలనే పంజాబీ సినిమా తమ బ్యానర్‌పై విడుదల చేశారు. తమ బ్యానర్‌పై తీసే ప్రాజెక్టుల్లో ప్రియాంక చోప్రా పేరును ఏమాత్రం ఉపయోగించుకోకుండా జాగ్రత్తపడుతున్నట్లు కూడా తల్లి మధు అంటుంది. ఏదిఏమైనా నాబిడ్డను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుందని ఉప్పొంగిపోతుంది.
ఏది సంతోషాన్నిస్తే అది తింటాను
నా మూడ్‌ను బట్టి, నాకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని తింటాను. ఎక్కువగా పప్పు బర్గర్‌ను తింటానికి ఇష్టపడతాను. మా ప్రిజ్ నిండా కోడిగ్రుడ్లు ఉంటాయంటుంది ప్రియాంక చోప్రా. కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవటానికి ఇష్టపడే ఆమె ఫ్రిజ్ నిండా ఎప్పుడూ గుడ్లు రెడీగా ఉంటాయని చెబుతూ.. ఎపుడు ఆకలి అనిపిస్తే వాటిని గిలకొట్టి ఆమ్లెట్‌నుగానీ, పాలల్లోగానీ కలుపుకుని శుభ్రంగా తాగేస్తుంది. తరిగిన మాంసం, చీజ్ కూడా రెడీగా ఉంటుంది. ఆకలేస్తే కేక్‌ను లాగించేస్తుంది. రోజుకు 18 గంటలు పనిచేస్తాను. ప్రయాణాల్లో మాత్రం అధికంగా మంచినీళ్లు తాగుతాను. అమెరికాలో కొన్ని టెలీ సీరియల్స్‌లో నటిస్తున్న ప్రియాంకాచోప్రా ఇంటి ఆహారానే్న ఇష్టపడుతుంది. అందుకే తన వెంట చెఫ్‌ను తీసుకువెళుతుంది. మానసిక ఆనందంతో ఉల్లాసంగా ఉంటే అందంగా కనబడతామని చెబుతుంది.

**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03