సబ్ ఫీచర్

స్వైన్ ఫ్లూ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం వచ్చిందంటే చాలు స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించడం షరామామూలైంది. ఇది విజృంభిస్తున్నదని వార్తలు వస్తున్నప్పుడే నివారణ కోసం ప్రయత్నాలు జరగడం పరిపాటైంది. స్వైన్‌ఫ్లూ అనేది హెచ్1ఎన్1 అనే వైరస్. దీని బారిన పడ్డ వారికి జ్వరం, గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళనొప్పులు, వాంతి వచ్చినట్లు అనిపించడం సహజం. షుగర్ వ్యాధి గ్రస్తులు, రోగనిరోధక శక్తి ఉన్నవారు, చిన్నపిల్లలు, గుండె జబ్బులకు గురైనవారు, ఊబకాయం ఉన్నవారు, తరచూ జలుబు, దగ్గులకు గురయ్యేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వైన్‌ఫ్లూ వైరస్ చల్లని వాతావరణంలో ఎక్కువగా విస్తరిస్తుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకే వ్యాధి. చల్లని వాతావరణంలో నుండి కొద్దిసేపైనా ఎండలో ఉంటే ప్రమాదం నుండి బయటపడవచ్చు. సూర్యరశ్మి లోని విటమిన్-డి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
‘ స్వైన్ ఫ్లూ’ లక్షణాలు ఉన్నప్పటికి ప్రజలు ఆందోళన చెందకుండా, దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనైనా, జిల్లా కేంద్రంని హాస్పిటల్‌లో అయినా అతి త్వరగా వైద్యం చేయించుకోవాలి. ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. ఆలస్యం ఎక్కువ రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. వ్యాధి నిర్థారణ కోసం రోగి ముక్కు, నోరు, గొంతు నుండి చిన్నపాటి కణజాలాలను సేకరించి పరీక్షిస్తారు. ఆ తర్వాత అనేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయవలసి వుంటుంది. స్వైన్‌ఫ్లూను అరికట్టాలని ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రజలలో అవగాహన చాలా ముఖ్యం. గది వాతావరణాన్ని పొడిగాను, వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని కాపాడుకునేందుకు పరిశుభ్రతను, వైద్యుల సలహాలను విధిగా పాటించాలి.
సైన్‌ఫ్లూ ప్రబలుతున్నప్పుడే కాకుండా, దీనిని శాశ్వతంగా నివారించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాలి. వాటిని క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడాలి. గ్రామ స్థాయిలో నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కాలాలలో ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులను 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆసుపత్రిలో కావలసిన పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేట్టాలి. అందరికీ మాస్క్‌లు విరివిగా అందించాలి. పాఠశాల విద్యార్థులకు 15 రోజులకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యత తీసుకోవాలి. మాస్క్‌లను ధరిద్దాం, అవగాహనను కలిగిద్దాం, పరిశుభ్రతను పాటిద్దాం. సైన్‌ఫ్లూ మహమ్మారిని తుదముట్టిద్దాం.

-సూరం అనీల్