సబ్ ఫీచర్

రోజంతా హుషారుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఏళ్లు దాటాయంటే శరీరంలో హుషారు తగ్గిపోతుంది. బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది మహిళలు రోజూ బరువు చూసుకుంటుంటారు. కాస్తంత బరువు పెరిగితే చాలు కంగారు పడిపోతుంటారు. బరువు తగ్గించుకోవటానికి వ్యాయామంతో పాటు కొద్దిపాటి ఆహార నియమాలు పాటిస్తే చాలు. ప్రతిరోజూ హుషారుగా ఉంటారు. బరువు తగ్గాలంటే తీసుకునే ఆహారాన్ని ఒకేసారి కాకుండా నాలుగైదుసార్లుగా తీసుకుంటే మేలు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవటం వల్ల అధిక బరువు బారి నుంచి బయటపడవచ్చని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆహారంలోనూ కాల్షియం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సీజన్‌లో టామాటాలు చాలా చౌకగా లభిస్తున్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మిక్సీలో వేసుకుని జ్యూస్ వలే తీసుకుంటే చాలు.
* తాజా పండ్ల రసాలను తీసుకోవటం వలన మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
* ఒక టీ స్పూన్ తేనెను ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసంను గ్లాస్ వేడి నీటిలో కలుపుకొని రోజూ ఉదయం తాగితే మీ బరువు తగ్గేలా చేస్తుంది.
* గ్రీన్ టీ లేదా అల్లం టీని రోజూ రెండుసార్లు తీసుకున్నా ఇది శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించడంతో పాటు బరువుతగ్గేలా చేస్తుంది.
* చెంచాడు ఉలవలను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానాబెట్టి ఉదయం పరగడుపుతో తినండి.
‘ భోజనానికి ముందు ఒక చిన్న అల్లం ముక్కను చప్పరించండి.
* బొప్పాయి లేదా వెజిటిబుల్ సూప్‌ను రెండు నుండి మూడు నెలల పాటు తినండి.
ఆరోగ్యపరంగా మన జీవనవిధానంలో మంచి మార్పులు చేసుకోవటానికి ఈ ఏడాదిలో నిర్ణయం తీసుకుని అందుకు తగ్గ ప్రయత్నాలు ఆరంభించండి. వ్యాయామాన్ని, పోషకాహారాన్ని తీసుకోవటానికి నిర్ణయించుకోండి. శరీరం హుషారుగా ఉండేందుకు ఇవి రెండూ దోహదం చేస్తాయి.