సబ్ ఫీచర్

క్యాన్సర్‌పై సమరభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిని ని యంత్రించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో దీర్ఘవ్యాధులతో మరణిస్తున్న వారిలో 35 శాతం మంది క్యాన్సర్ బారినపడ్డవారే. ఏటా కొత్తగా పది లక్షల మంది క్యాన్సర్ వ్యాధులకు లోనవుతున్నారు. ఏటా సగటున 7.36 లక్షల మంది పలురకాల క్యాన్సర్లతో మరణిస్తుండగా, 2020 నాటికి ఈ సంఖ్య 8.8 లక్షలకు చేరుకునే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ నిర్ధారణ, నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంకల్పించింది. ‘ప్రపంచ క్యాన్సర్ దినం’ సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీన దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైద్యబృందాలు ఇంటింటికీ తిరిగి క్యాన్సర్, మధుమేహం, గుండెజబ్బులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
దేశవ్యాప్తంగా క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంటోంది. సకాలంలో గుర్తించలేక పోవడంతో వ్యాధి నియంత్రణ సవాలుగా మారుతోంది. ముఖ్యంగా 30 నుంచి 70 ఏళ్లలోపు వయసువారు ఈ మూడు వ్యాధులను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారడంతో పలురకాల కాన్సర్లు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల జోరు పెరుగుతోంది. ఈ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపడితే మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. ఏటా జనాభాలో కనీసం 30 శాతం మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. తొలిదశలో 2018 నాటికి దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ఇంటింటా వైద్యపరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు. 30 నుంచి 70 ఏళ్లలోపు వారు మన దేశజనాభాలో 37 శాతం మంది ఉన్నారు. ఈ వయసువారే ఎక్కువగా వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంది. వీరందరికీ క్యాన్సర్, మధుమేహం, ఆస్త్మా, గుండెజబ్బులకు సంబంధించి వైద్య పరీక్షలు చేసి నివారణ చర్యలు చేపడితే అకాల మరణాలను 55 శాతం మేరకు తగ్గించే వీలుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇంటింటా వైద్యపరీక్షలను ఒకేసారి చేసే అవకాశం లేదు. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూనే, దీర్ఘకాలిక వ్యాధులపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ఈ వ్యాధుల నివారణకు ఆటంకంగా పరిణమిస్తున్నాయి.
ఇక, మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో 26 శాతం మంది గుండెజబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు మధుమేహం భయంకర రూపం దాల్చుతోంది. 2015లో 6.9కోట్ల మంది ఈ వ్యాధికి లోనయ్యారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు 32వేల కోట్ల రూపాయలు కేటాయించగా, కేవలం మధుమేహం నివారణకు దేశవ్యాప్తంగా అయిన ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలని ఓ అంచనా. దీర్ఘరోగాల నివారణకు చేసే ఖర్చు ఏటేటా 30 నుంచి 40 శాతం మేరకు పెరుగుతోంది. *