సబ్ ఫీచర్

ఆదిత్య కిరణాల్లో అపార ప్రాణశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకసాక్షి సూర్యభగవానుని కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘసుద్ధ సప్తమి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని సూర్యుని జయంతిగా చెబుతారు. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమినాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కునకు మళ్లించే రోజు.కశ్యప ప్రజాపతి సూర్యునకు రథము, సారథి, గుర్రములను ఇచ్చి లోకాధిపత్యం ఈ రోజు కలిగించాడు కాబట్టే ఈ రోజు రథసప్తమి అంటారు అని ఒక భావన. సూర్యుని తీక్షణత ఈరోజునుండి క్రమేణా పెరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం కఫ, పిత్త, బుద్ధిమాంద్యములను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు కాబట్టి ఈ రోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు. ఆవు పిడకలను దాలిగా చేసి మండించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి. పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈ రోజు వండే పరమాన్నంలో కొత్త బియ్యం వాడతా రు.
ఆమ్లగుణంగల రేగుపండూ జిల్లేడు ఆకూ శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది. మేధని చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనయినా విధిగా అలా స్నానం చేస్తారు. ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి. చిక్కుడు ఆకులలో పీచు పదార్థం ఉండడంవలన మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.
ఈకాలంలో దొరికే చిక్కుడు తరచు తినడంవలన మలబద్ధకం సమస్యలు తొలగుతాయి. ఈ రోజు తరిగిన కూరగాయలు తినకూడదు. చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలని పెద్దలు చెప్పడంలో ఉద్దేశ్యం కనీసం ఈరోజైనా చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే. మన సంప్రదాయం ఏదైనా దానికి శాస్ర్తియపరమైన కారణం వుంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన కూరగాయ చిక్కుడు. అది మనం మర్చిపోకుండా సూర్యారాధనలో పొందుపరిచారు.
సకల జీవుల ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం
సూర్యరశ్మి ఎన్నో రోగాలను హరించే శక్తి కలిగి వుంటుంది. సూర్యరశ్మి లేకపోతే జీవశక్తి మనలేదు. రకరకాల వ్యాధులు సోకుతాయి. ప్రాతఃకాలంలోని సూర్యరశ్మిలో డి విటమిన్ పుష్కలంగా వుంటుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దలవరకూ అందరూ ఏసిలకు, కంప్యూటర్లకు, స్టార్ట్ఫోన్లకు అతుక్కుపోయి సూర్యరశ్మి ఏ మాత్రం శరీరానికి సోకకుండా వుండటంవలన అందరికీ డి విటమిన్ తగ్గిపోయి అనేక ఎముకల రోగాలకు దారితీస్తోంది. చలికాలంలో కలిగే రుగ్మతలను తర్వాత వచ్చే వేసవికాలం చాలావరకు అరికడుతుంది.
రథసప్తమి తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మనం మనిష్టమొచ్చిన విధంగా సహజ వనరులను దుర్వినియోగం చేస్తే వాతావరణంలోని సమతుల్యత దెబ్బతిని అన్ని కాలాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అది మనం గ్రహించి గుర్తుపెట్టుకోవడానికే మనం సంప్రదాయం, మన పెద్దలు ఎంతో శాస్ర్తియంగా ఆలోచించి మన పండుగలలో ప్రకృతి ఆరాధనను అంతర్భాగంగా చేసారు. ఈరోజు పరమాన్నం సూర్యునికి నివేదించిన తరువాత అందరికీ పెట్టి మూషికములకు కూడా నివేదిస్తారు రైతులు. ఇలా నివేదించడంవలన తమ ధాన్యపు గాదెల సమీపమునకు రావు అని వారి వి శ్వా సం. ఈ రోజు స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. సూర్య నమస్కారాలు చేయాలి. అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈరోజు 12 సార్లు పారాయణచేయాలి. ఏ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయాడో అదేవిధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని ఇమ్మనమని రథసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు. రథసప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు, వస్తమ్రు, ఆవుపాలు, ఆవు నెయ్యి దానము చేసిన మంచిది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి