సబ్ ఫీచర్

స్ఫూర్తి ప్రదాత శ్రీరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది భారతదేశం. అఖండ భారతదేశం. సాక్షాత్తు భగవంతుడే తనకు తానుగా సృష్టించుకున్న దేశం మన భారతదేశం. అందుకే భగవంతునికి ఇష్టమైన దేశంలో మనం జన్మించినందుకు, మన జీవితాలు ధన్యమైనాయి అని కూడా చెప్పవచ్చు. ఈనాడు వైజ్ఞానికంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని అందరూ అంటున్నారు. కాని వాస్తవంగా ఏనాడో మన మహర్షులు ఇప్పుడున్న వైజ్ఞానిక పరంపరను ఆనాడే సమాజానికి అందించారు. అటువంటి ఉజ్వల వైజ్ఞానిక పరంపరగల దేశం మన దేశం. విశ్వవిఖ్యాతి గాంచిన దేశం. ధర్మం నాలుగు పాదాల నడయాడిన భూమి మనది. సనాతనం మాత్రమే కాదు ధర్మంతో ముడిపడిన సంస్కృతి మనది. అదే హిందూ సంస్కృతి. హిందూ ధర్మం. ఇది ప్రకృతినుండి వచ్చింది. హిందుత్వం, ప్రకృతితో ముడిపడిన సంస్కృతిని హిందూ ధర్మము, హిందూ జీవన విధానం అని అన్నారే కాని దీన్ని ఎక్కడ కూడా హిందూ మతం అని ఎక్కడ కూడా మన ప్రాచీన పురాణ గ్రంథాలలో లేదు. హిందూ ధర్మానికి మూలకర్త అంటూ ఎవరూ లేరు. దీనికి మూలకర్త ఎవరూ అంటే అది విశ్వశక్తి. ఆ శక్తిని రకరకాలుగా ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు పూజించుకుంటున్నారు. విజ్ఞానశాస్త్రంలో కూడా శక్తి అనేక రకాలుగా మార్పుచెందుతుందని తెలుసు. శక్తియొక్క వివిధ రూపాలుగానే సనాతన భారతీయ ధర్మంలో వివిధ రూపాలుగా పూజిస్తున్నాం. సనాతన భారతీయ ధర్మంలో ఎవరిమీద కూడ బలవంతంగా ఈ దేవుణ్ణి పూజిస్తేనే మీకు ముక్తి, మోక్షం లభిస్తుంది అని చెప్పిన సందర్భాలు లేవు. ‘కృణ్వంతో విశ్వమార్యం’అని, ‘విశ్వకళ్యాణాన్ని’ కాంక్షించేది హిందూ ధర్మం అని చెబుతుంది. ఈ అఖండ భారత భూభాగంలో వున్న వారందరూ కూడా మొదట హిందువులే. కాలక్రమంలో మతాంతీకరణ జరిగి ముస్లింలు అయిన, క్రైస్తవులు అయినవారు మొదట హిందువులే. ఈ ఏకాత్మ భావన నిర్మాణం కావాలి. సంపన్నమైనటు వంటి భారతదేశం మీద అందరి దృష్టిపడింది.
మొదట ఇస్లాం మన దేశంలోకి ప్రవేశించింది. క్రమక్రమంగా ఇస్లాం శాంతిని కోరుకుంటుంది అని చెబుతూనే రక్తపాతం సృష్టించి, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడింది. హిందువుల పవిత్ర ధార్మిక కేంద్రాలను ధ్వంసం చేశారు. హిందువులు తమలోతాము రోధిస్తూ కుమిలిపోయారే తప్ప ఏనాడు కూడా ప్రతి దాడి చేయలేదు. మన భారతదేశంలోని ముస్లింలు అందరూ కూడ వేరే దేశాలనుండి ఇక్కడికి వలస రాలేదు. వారంతా ఇక్కడివారే. ఈ దేశంలోని వారే. భారతదేశ స్వాతంత్య్రంకొరకు హిందువులు, ముస్లింలు అందరూ కలిపి ఏకాత్మాభావంతో పోరాడారన్న విషయం అందరికీ తెలిసిందే. అపుడు వారిలో నరనరాన దేశభక్తి, జాతీయ భావన వున్నాయేగాని ‘మతం’ ఏమిటన్న విషయం వారి మనసులలోకి ప్రవేశించలేదు.
భారతదేశానికి స్ఫూర్తిప్రదాత ఎవరూ అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని లాంటి ఆదర్శగుణాలు అందరికీ అలవడాలని అందరూ చెబుతుంటారు. అందుకే రామరాజ్యం అన్నారు. అటువంటి శ్రీరామచంద్రుడు, పుణ్యపురుషుడు జన్మించిన ప్రదేశం అయోధ్య. అయోధ్యా నగరం శ్రీరామచంద్రుని జన్మస్థలమని మనకు అనేక పురాణాలు కూడా చెబుతున్నాయి. అందువల్ల అయోధ్యానగరంలో రామాలయం కావాలని కోరుతున్నారు. ఎందుకనగా అది శ్రీరామచంద్రుని జనన ప్రదేశం. ఎన్నో వందల సంవత్సరాలుగా పరిష్కరింపబడకుండా నలుగుతున్న ఈ సమస్య పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు బాబరు విదేశీయుడు, దురహంకారంతో సామ్రాజ్యవాద ధోరణితో రామమందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించాడు. కాబట్టి ఈ విషయంలో జాతీయవాదులైన దేశభక్తులు దీనిపై ఆలోచించవలసిన అవసరం ఎంతైనా వుంది.

- గౌరుగారి గంగాధరరెడ్డి