సబ్ ఫీచర్

మొండి శత్రువుపై మహాయుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్‌పై యుద్ధం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఇది వస్తే ఆశలు వదులుకునేవారు. కాని నేడు ఆధునిక వైద్యంతో క్యాన్సర్ కొమ్ములను విరిచేస్తున్నారు. క్యాన్సర్‌పై ఈ ఏడాది సరికొత్త నినాదం తీసుకున్నారు. ఎలాంటి క్యాన్సర్ అయినా కావచ్చు, భవిష్యత్తుమీద దృష్టిపెట్టి సానుకూల దృక్పథంతో జీవిస్తే దీనిపై విజయం సాధించటం సులువే. అందుకే ఈసారి మనం ‘‘పోరాడగలం.. నేనూ పోరాడగలను’’ అనే నినాదంతో క్యాన్సర్ భయానికి చరమగీతం పాడదామంటున్నారు వైద్య నిపుణులు. ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆందోళన, కుంగుబాటు, కోపం వంటి భావనలను విడనాడి నేడు అందుబాటులో వున్న అత్యాధునిక చికిత్స చేయించుకుంటే దీర్ఘకాలం హాయిగా జీవించవచ్చు.

నేడు క్యాన్సర్ డే...
క్యాన్సర్ వ్యాధి నివారణ నిమిత్తం 2000 సం.లో పారిస్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినంగా నిర్వహించాలని తీర్మానించారు. 2020 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 మిలియన్లకు చేరుకోగలదని అంచనా. ప్రతీ సంవత్సరం ఈ వ్యాధితో 8 మిమియన్ల మంది మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జనాభాలో 15 శాతం మంది ఈ వ్యాధితోనే మరణిస్తున్నారు. 2005 సంవత్సరంలో 7.6 మిలియన్లమంది, 2010 సం.లో 9.5 మిలియన్ల మంది క్యాన్సర్ వ్యాధివల్ల మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. మన దేశంలో ప్రతీ యేటా సుమారు ఏడు లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. వీరిలో మూడు లక్షల వరకు నోటి క్యాన్సర్ (ఓరల్ కాన్సర్) ఉంటున్నాయి. సగటున ఒక్కో కేసుకు సుమారు 3.5 లక్షలు చికిత్స కోసం వెచ్చించాల్సి వస్తోంది. అదే పనిగా గుట్కాలు, జర్దా, సుపారి, పొగాకు ఉత్పత్తులను తీసుకోవడంవల్ల క్యాన్సర్ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది.
ఆల్కహాల్‌ను సేవించకుండా ఉండడం, మితాహారం, కాలుష్యానికి దూరంగా వుండడం, ఆధునిక చికిత్సా విధానాలపై ఉన్న అపోహలను విడనాడి తగు జాగ్రత్తలతో పాటు ఆహార నియమాలు పాటించటమే సరైన పరిష్కారం. ముఖ్యంగా మాంసం ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అధికంగా మాంసం తినటం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటే మూత్రాశయం, ఎముక క్యాన్సర్ కూడా వస్తుందని వీరి పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాన్ని అధిక వేడితో ఉడికించటం వల్ల దీనిబారిన పడుతున్నారని చెబుతున్నారు. కాబట్టి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ అరగంట వ్యాయాపం చేయాలి. శారీరకంగా చురుకుగా ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 30 శాతం వరకు తగ్గిపోతుంది. తల్లులు వీలైనంత వరకు పిల్లలకు పాలు ఇవ్వటమే మంచిది. బరువను నియత్రించుకుంటూ భయాన్ని వీడితే దీని మూలాలను నిర్మూలించటం సులువే.
**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03