సబ్ ఫీచర్

బైకింగ్ క్వీన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బాయలకే పరిమితమైన బైక్ రైడింగ్‌లో ఈ నలుగురు మహిళలు సత్తా చాటారు. సామాజిక చైతన్యం కోసం చేసిన వీరి సాహసయాత్ర ప్రధాని నుంచి పదుగురి మన్ననలు అందుకుంది. ‘‘బాలికలను రక్షించండి - చదివించండి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో 39 రోజులలో 10 దేశాలను బైక్‌లపై చుట్టివచ్చారు. మహిళలు అంటే ‘‘అబలలు కాదు సబలలు’’ అని నిరూపించారు. ఆ నలుగురు గుజరాత్‌లోని సూరత్‌కు చెందినవారు.

ఈ సామాజిక కార్యక్రమానికి నాయకత్వం వహించిన డాక్టర్ సారికా మెహతా, వృత్తిరీత్యా మానసిక వైద్యురాలు. ఆమెకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. తన వలే బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉన్నవారిని ఒక చోట చేర్చడానికి ఆమె 2015లో బైకింగ్ క్వీన్స్ అనే సంస్థను ఏర్పాటుచేసింది. ఆమెకు గుజరాత్ ప్రభుత్వం ‘మహిళారత్న’ అవార్డును కూడా అందజేసింది. ఈ బృందంలోని ఇతర సభ్యులు డాక్టర్ యుగ్మా దేశాయ్, దుర్రియా తాపియా, ఖ్యాతిదేశాయ్. డాక్టర్ యుగ్మా దేశాయ్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్నారు. ఖ్యాతిదేశాయ్ ఒక బహుళజాతి సంస్థలో హెచ్‌ఆర్ హెడ్‌గా పనిచేస్తున్నారు. దుర్రియా తాపియా సూరత్‌లో ట్రావెలింగ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. వీరు నలుగురు కలిసి పది దేశాలలో భ్రూణ హత్యలు, బాలికా విద్యపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. బైక్ రైడింగ్ ద్వారా 10 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించి సాహస యాత్ర కొనసాగించారు.
ఆసియన్ హైవేమీద తొలిసారి ప్రయాణించిన ఘనత
వీరి పర్యటన నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, వియత్నాం, కాంబోడియా, మలేషియా, సింగపూర్, ఇండియా దేశాలలో కొనసాగింది. నాగాలాండ్‌లోని దట్టమైన అడవులలో, భూటాన్‌లోని పర్వత లోయ ప్రాంతాలలో సైతం నిర్భయంగా ముందుకు సాగారు. థాయ్‌లాండ్, మయన్మార్, సింగపూర్ సరిహద్దులలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇండియన్ ఎంబసీ సకాలంలో స్పందించడంతో, వారి ఇబ్బందులు తొలగిపోయాయి. ఇండియా- మయన్మార్‌ల మధ్య నూతనంగా నిర్మించిన ఆసియన్ హైవేమీద తొలిసారిగా ప్రయాణించిన ఘనత ఆ నలుగురు మహిళా బైకర్లకే దక్కింది.
వీరు తమ పర్యటనలో పలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలను సందర్శించారు. బాలికా విద్య ఆవశ్యకత, భ్రూణహత్యల నిరోధం, లైంగిక వివక్షతలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. బైక్ రైడింగ్ వలన ఎంత అలసటకు గురైనా, వారు సందర్శించిన ప్రాంతాలలో ప్రజలనుంచి వచ్చిన స్పందన చూసి, తాము అలసటను మరచిపోయామన్నారు ఆ నలుగురు.
ప్రజలలో ఉన్న నిరక్షరాస్యత, అవగాహనలోపం వ్లలనే పలు దేశాలలో లైంగిక వివక్షత, భ్రూణహత్యలు కొనసాగడానికి ప్రధాన కారణంగా వారు గుర్తించారు. నిరక్షరాస్యతను రూపుమాపితే, పలు సామాజిక రుగ్మతలు వాతంట అవే కనుమరుగు అవుతాయని వారు పేర్కొన్నారు. 39 రోజులపాటు కొనసాగిన వీరి బైక్ రైడింగ్ గత జూలై 12న తిరిగి సూరత్‌కు చేరడంతో ముగిసింది.
మోటార్ బైక్ నడపడంపై కేవలం పురుష పుంగవులకే హక్కు ఉందనే భావనను వీరు పటాపంచలు చేశారు. ప్రస్తు తం సూరత్‌లో నిర్వహిస్తున్న బైకింగ్ క్వీన్స్‌లో 50 మంది సభ్యులు ఉన్నారు. పలువురు మహిళలు బైకింగ్ క్వీన్స్‌లో చేరడానికి ఆసక్తిని చూపుతున్నారు. మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆ నలుగురు అభినందనీయులు.

- పి.హైమావతి