సబ్ ఫీచర్

ఎన్నికల బరిలో నవాబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించాక రాచరికాలు అంతరించిపోయినా, జనం మాత్రం నవాబులు, రాణులకు ఇంకా అధికారం అప్పగిస్తూనే ఉన్నారు. అలనాటి రాచకుటుంబాలు ఇప్పటికీ అధికార దర్పాన్ని వెలగబెడుతూనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాచకుటుంబాలకు చెందిన వారు పోటీ చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుపి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పలువురు నవాబులు, రాణులు బరిలో నిలిచారు. నవాబుల వంశానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే నవాబ్ కాజిమ్ అలీఖాన్ రాంపూర్ అసెంబ్లీ స్థానానికి బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అబ్దుల్లా అజామ్‌ను అలీఖాన్ ఢీకొంటున్నారు. అలీఖాన్ నివసించే ‘నూర్ మహల్’ ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలతో కోలాహలంగా ఉండేది.
భడావర్ సంస్థానికి చెందిన రాణీ ప్రచ్చళ్లికా సింగ్ ఇపుడు బిజెపి అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2012 ఎన్నికల్లో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఖరియాగఢ్‌లో పోటీ చేసి ఓటమి పొందారు. భండ్రీ సంస్థానానికి చెందిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ( రాజా భయ్యా) ప్రతాప్‌గఢ్ జిల్లా కుండా నుంచి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా గెలిచి ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించాలని ఆయన తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజాభయ్యా గతంలో కల్యాణ్ సింగ్, రామ్‌ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఇపుడు అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బర్గాడికోఠ్ రాజవంశానికి చెందిన కున్వర్ అజయ్ ప్రతాప్ సింగ్ (లల్లా భయ్యా) కొలెనల్‌గంజ్ నుంచి ఇపుడు బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజకుటుంబానికి చెందిన మయంకేశ్వర్ శరణ్ సింగ్ రాయ్‌బరేలీ జిల్లా టిలోయి నుంచి బిజెపి తరఫున బరిలో నిలబడ్డారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో మాత్రం సమాజ్‌వాదీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. అలహాబాద్ జిల్లాలోని బరోన్ సంస్థానానికి చెందిన ఉజ్వల్మ్రణ్ సింగ్ కర్చహనా నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని సిస్వాన్ రాజవంశానికి చెందిన కున్వార్ శివేంద్ర సింగ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా సిస్వాన్‌లో పోటీ చేస్తున్నారు.
రాణుల మధ్య సమరం..
అమేథీలో ఇద్దరు రాణుల మధ్య ఎన్నికల సమరం ఇపుడు యావత్ యుపి దృష్టినీ ఆకర్షిస్తోంది. అమేథీ మహారాజు అయిన కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ మొదటి భార్య మహారాణి గరిమా సింగ్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా. ఇదే నియోజకవర్గంలో సంజయ్ సింగ్ ప్రస్తుత భార్య అమితా సింగ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మొదటి భార్య గరిమా సింగ్ చాలా కాలంగా అమేధీకి దూరంగా ఉంటున్నారు.

చిత్రాలు.. అమితా సింగ్ , కాజిమ్ అలీఖాన్, గరిమా సింగ్
*