సబ్ ఫీచర్

చుక్కల్ని చూసొస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాన్వా పాండ్యా కేవలం వ్యోమగామి, వైద్యురాలిగానే కాదు.. మరెన్నో అంశాల్లో ప్రావీణ్యం సాధించారు. మార్షల్ ఆర్ట్ తాయ్‌క్వాండోలో 17 ఏళ్లుగా అభ్యాసం చేసి పట్టు సాధించారు. ఒపెరా సంగీతంలో ప్రవేశం ఉంది. ఇంగ్లీషు, హింది, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆమె మంచి వ్యాపారవేత్త కూడా. పీజీ చేస్తున్నప్పుడే సిలికాన్ వ్యాలీలో మేథోబృందంగా పిలిచే ‘సింగ్యులారిటీ యూనివర్శిటీ’లో ఆమెకు చోటు దక్కింది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎదురయ్యే విపత్తులను
ఎదుర్కొనే అంశాలపై ఆమె పరిశోధనలు సాగాయి. ‘నేవీసీల్స్’ విభాగం ఆధ్వర్యంలో ‘ముయెథాయ్’ మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందింది. ఆమె మంచి రచయిత కూడా. జీవితం అంటేనే సాహసాలతో కూడుకున్నది. ధైర్యంతో అడుగువేస్తే
సాధించలేనిదీ ఏమీ ఉండదన్నది ఆమె నమ్మకం.
ఆకాశంలోకి చూడటం ఆమెకు ఇష్టం.. మిలమిల మెరిసే తారలను చూస్తే ఆమె కళ్లల్లో మెరుపు.. అక్కడో ఏదో ఉంది...ఏముందో తెలుసుకోవాలన్నది ఆశ.. ఎప్పటికైనా అక్కడకు వెళ్లగలమా అన్నది సందేహం.. ఇది ఆరేళ్ల వయసులో ఆమె అంతరంగం... కానీ 32 ఏళ్ల వయసులో ఆమెకు అక్కడికి వెళ్లే అవకాశం వస్తోంది..
భూవాతావరణంలో 80 కిలోమీటర్ల ఎగువకు వెళ్లి కిందనున్న మేఘమాలను చూసి ఉబ్బితబ్బిబ్బైన ఆమె త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది..
ఆమె పేరు షావ్నా పాండ్యా.
సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ (సిఎస్‌ఎ) ప్రోగ్రామ్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు పోటీపడిన 3200మందిలో ఎంపిక చేసిన తొమ్మిదిమందిలో ఆమె ఒకరు. త్వరలో నిర్వహించే ‘ప్రాజెక్ట్ పొస్సుమ్’, ‘ది ఫెనమ్ ప్రాజెక్ట్’లలో ఈ బృందంతో ఆమె పాల్గొనబోతోంది.
అంతరిక్షంలో పర్యటించి ప్రయోగాలు చేసి రికార్డులు నెలకొల్పిన మహిళా వ్యోమగాములు కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ తరువాత అలాంటి అవకాశం అందిపుచ్చుకుంటున్న భారతీయ సంతతి మహిళ షావ్నా పాండ్య. అంతరిక్షంలోని రహస్యాలు ఛేదించడం, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో మనిషి ఎలా బతకాలి, అవకాశాలు ఉన్నాయా లేదా, సరికొత్త వాతావరణ పరిస్థితులు, ప్రాంతాల్లో మనిషి శరీరం ఎలా స్పందిస్తుందన్న అంశాలపై పరిశోధనలు నిర్వహించేందుకు ఆమె త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది. మరో ఎనిమిదిమంది వ్యోమగాములతో కలసి ఆమె స్పేస్ జర్నీకోసం అహరహం శ్రమిస్తోంది. రెండు అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంటోంది. అన్నీ కుదిరితే ఆమె అంతరిక్ష ప్రయాణం 2018 మొదట్లో ఉంటుంది. షావ్నా పాండ్యా తాతముత్తాల మూలాలు ముంబైలో ఉన్నాయి. తరచూ భారత్‌కు వచ్చే ఆమె ఇటీవలే ముంబైలో బంధువులతో గడిపేందుకు వచ్చింది. ఆమె పుట్టింది కెనడాలో. పెరిగింది, చదివిందీ, ప్రయోగాలు చేస్తున్నదీ అక్కడే. ఆకాశం అంటే ఎంతిష్టమో... వైద్యశాస్తమ్రన్నా అంతే ఇష్టం. కెనడాలో తొలి మహిళా వ్యోమగామిగా ప్రసిద్ధికెక్కిన రాబర్టా బొండర్ ఆమెకు స్ఫూర్తి. ఆమె న్యూరో-ఆప్తమాలజిస్ట్. అదే స్ఫూర్తితో పాండ్యా కూడా న్యూరోసైన్స్‌పై దృష్టిసారించింది. మొదట యూనివర్శిటీ ఆఫ్ ఆల్బర్టాలో బిఎస్‌సి (న్యూరోసైన్స్) పూర్తి చేసింది. ఆ తరువాత మెడిసన్‌లో అదే వర్శిటీ నుంచి ఎండి చేసింది. అంతకుముందు ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్శిటీ నుంచి ఎమ్‌ఎస్‌సి చేసింది. ఒకవైపు మెడిసిన్, మరోవైపు స్పేస్ సైన్స్‌లలో విద్యాభ్యాసం చేసి ఔరా అనిపించింది.
ఆ తరువాత జనరల్ ఫిజీషియన్‌గానే స్థిరపడింది. అయితే అంతరిక్షంలో వైద్యశాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేయాలన్న తపనతో రంగంలోకి దిగింది. నాసాలోని జాన్సన్ స్పేస్ సెంటర్ (హోస్టన్), యూరోపియన్ ఆస్ట్రోనాట్ సెంటర్ (జర్మని)లలో పనిచేసింది. ఆమె ఆలోచనాతీరు విభ్రాంతి గొలుపుతుంది. ‘అంటార్కిటికాలో గడ్డకట్టిన సముద్రం అడుగున వైద్యసేవలు అం దిస్తే ఎలా ఉంటుంది. వనరులు, నీరు, తిండి లేనిచోట మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది. అక్కడ బతకడం ఎలా’? అన్న ఆలోచనలు నన్ను పరిశోధనలకు పురిగొల్పుతాయంటారు పాండ్యా. ప్రస్తుతం ముంబైలో కుటుంబ సభ్యులు, వివిధ సంస్థ ల తరపున విద్యాసంస్థల్లో ఉపన్యాసాలలో తలమునకలైన ఆమె అమెరికా వెళ్లిన వెంటనే అంతరిక్ష ప్రయోగానికి కావలసిన శిక్షణలో మునిగితేలనుంది.