సబ్ ఫీచర్

‘తెలుగువాళ్ల’పై ప్రేమ ఇలాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏ టీవీ చానెల్ చూసినా, ఏ పత్రిక చదివినా ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తమ లక్ష్యం అని వివిధ రాజకీయ పా ర్టీల నేతలు, ఉద్యమకారులు మాట్లాడటం చూ స్తున్నాం. ఇలా తమ ప్రాంతానికే పరిమితమైపోయి మా ట్లాడడంలో ఏమైనా వేషధారణ వుందా? లేక వాస్తవంగా వీరు మనసా వాచా అభివృద్ధినే కోరుకుంటున్నారా? ఈ వ్యా ఖ్యలు చూస్తుంటే దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాలే రెండుగా చీలిపోయాయా? ఒకే భాష మాట్లాడే ఎన్నో రాష్ట్రాలు రెండుగా అంతకంటే ఎక్కువగా విడిపోలేదా? ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం తెలుగువారు, ఆంధ్రులే వున్నారా? వేరే మాతృభాషలు మాట్లాడేవారు లేరా? తెలుగు మాట్లాడేవాళ్లు వేరే రాష్ట్రాల్లో లేరా? వారి అభివృద్ధిని మాత్రం ఈ నేతలు ఎందుకు కాంక్షించటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ- ‘ఒక ప్రాంతం.. ఒక కులం..’ అంటూ ప్రత్యేక అభిమానం, ప్రత్యేక వివక్ష చూపడం కూడా కొనసాగుతోంది. ఈ భావజాలం ఉన్నప్పుడు- తెలుగు రాష్ట్రాల్లో వేరే భాష మాట్లాడేవారిని ఎంత ఆదరణగా చూడగలుగుతారు?
ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారి మావోయిస్టుల కాల్పుల్లో చనిపోతే వెనువెంటనే హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ కూడలిలో ఆ అధికారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇంతకంటే ముందు మావోల కాల్పుల్లో మరో పోలీసు అధికారి మరణిస్తే అప్పటి ముఖ్యమంత్రి కాని, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కాని- ఆ అధికారి విగ్రహాన్ని తెలంగాణలోగాని, ఏపిలో గాని నేటివరకు ప్రతిష్ఠించలేదు. ఇలా ప్రాంతీయ, కులవివక్ష చూపే వారికి అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వుందా?
తెల్లవారితే చాలు.. న్యూస్ చానళ్లలో తెలుగువారి సమస్యలంటూ రెండు రాష్ట్రాల గురించి కలిపి చర్చలు పెడతారు. విభజన జరిగింది కనుక రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా చర్చలు జరపవచ్చు. అయితే, అలా జరపక పోవడంతో రెండు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని చర్చాగోష్టులను వేడెక్కిస్తుంటారు. గతంలో రెండుగా విడిపోయిన మధ్యప్రదేశ్‌లో కాని, బిహార్‌లో కాని ఎక్కడా పదే పదే ‘రెండు.. నాలుగు.. ఆరు హిందీ రాష్ట్రాలు’ అని చర్చలు జరగడం లేదు. ఎవరి రాష్ట్రం వారిదే. ఎంపి, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అని అంటున్నారు. ఎవరి చానల్స్ వారివి, ఎవరి పత్రికలు వారివి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణించాలే తప్ప పదే పదే ‘రెండు తెలుగు రాష్ట్రాలు’ అనుకుంటూ, ఒకరి నష్టం కోరుకుంటూ.. తమ లాభాలనే పరిగణనలోకి తీసుకుంటూ అనవసర వాదనలు చేయ డం ఎంతవరకు సమంజసం. విభజన ఫలితంగా నష్టపోయామని మరో రా ష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదు. పదవుల్లో ఉన్నపుడు వీరు ఉమ్మడి రాష్ట్రంలో ని తెలంగాణకు ఎంత న్యా యం చేశారో చెబితే బాగుంటుంది. ఒక ప్రాం తంపై వివక్ష చూపడం వల్లే రాష్ట్ర విభజనకు కారకులమయ్యామని కొందరు నేతలు ఇప్పటికీ గ్రహించడం లేదు. విభజన ఖాయమని తెలిసినా, తమకు ఏమి కావాలో అడగకుండా ఉదాసీనంగా వ్యవహరించిన నాయకులను ప్రజలు ఎందుకు విశ్వసిస్తున్నారో అర్థం కాని విషయం. విభజన వల్ల నష్టం జరిగిందంటున్న వారు- సమైక్యంగా ఉన్నప్పుడు ఏయే ప్రాంతాలు ఎంత లాభపడ్డాయో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా? అలా ఎందుకు చెప్పటం లేదు.
మన దేశంలో సుమారు పదికోట్లమంది తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. అంటే రెండు కోట్ల మంది తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాలలో వున్నారన్నమాట. ‘రెం డు తెలుగు రాష్ట్రాలు’ అనే ఈ నాయకులు వేరే రాష్ట్రాల్లోని తెలుగువారి క్షేమం గురించి పట్టించుకోరా?
భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1953, 1956లో విభజించినప్పుడు ఆయా రాష్ట్రాలలో మాట్లాడే ప్రజలకు, భాషలకు తీరని అన్యాయం జరిగింది. తద్వారా ఎన్నో భాషలకు పోషణ లేకుండాపోయింది. ఎన్నో పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. అన్ని భాషల వాళ్లు అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాల్లో వుంటే భాషకు బతుకుతుంది. ఆ విధంగా చేయకపోవటంతో కొన్ని భాషలకు ఆదరణ లేకుండా పోతున్నది. వాటిలో ముఖ్యంగా దెబ్బతిన్నది తెలుగు భాష. మాతృభాషను ఇంట్లో కూడా మాట్లాడుకోని పరిస్థితి వుంది. ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రత్యేకమైన చర్చ జరగవలసి వున్నది. 1972లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు ముఖ్యమంత్రి భూ సంస్కరణలను పట్టుదలతో అమలుపరచి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పించినప్పుడు, ఆయనను పదవి నుంచి దింపటానికి ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉద్యమాలు చేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారు. అదే వ్యక్తి ప్రధానమంత్రి హోదాలో పలు ఆర్థిక సంస్కరణలను అమలు చేసినప్పుడు- తెలుగేతర శక్తులు ఇబ్బంది పెట్టినప్పుడు మన తెలుగువాళ్లు అడ్డుకోలేదు. ఈ విషయంలో మాత్రం కొన్ని సామాజిక వర్గాలకు ‘తెలుగుదనం’ గుర్తుకురాలేదు.
ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు- వాటిలోని నేతలు అప్పటి ‘తెలుగు ముఖ్యమంత్రి’కి సహకరించి వుంటే ఇప్పుడు వీళ్లు మాట్లాడుతున్న భాషాభిమానానికి అర్థం వుండేది. ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికగా విడిపోయి కలహించుకుంటూ ‘మేమంతా తెలుగువాళ్లం’ అనుకోవడం అర్థరహితం. ఏ రాష్ట్రంలో వుండేవారు ఆ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ దేశ క్షేమాన్ని కాంక్షించడం ఉత్తమం. ఇంకా భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. చానల్స్‌లో ఈ రకమైన చర్చలను, గోష్టులను ప్రసారం చేయరాదు. ఇలాంటి చర్చలు గాని, వార్తలు గాని ఆ రాష్ట్రాలకే పరిమితం చేయండి.
ఉభయ రాష్ట్రాలకూ అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంలో తప్పులేదు. అనవసర చర్చల వల్ల ఎవరికీ మేలు జరగదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను వేర్వేరు రాష్ట్రాలు గానే చూడండి. రెండూ తెలుగు రాష్ట్రాలని భ్రమలో పెట్టకండి. పత్రికలు, చానళ్లు కూడా విడిపోయిన తర్వాత- ఒక ప్రాంతంపై మరో ప్రాంతం వారు విశే్లషణలు చేయడం వల్ల తప్పుడు సంకేతాలే వెళతాయి. ఇలాంటి చర్చలు, గోష్టుల వల్ల విభేదాలు పెంచుకోవటమే తప్ప సఖ్యత ఏర్పడదు.

-కందిబండ నరసింహారావు