సబ్ ఫీచర్

ఇల్లాలి కోపం ఇంటికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లాలు ఎప్పుడూ కోపంగా, చిర్రుబుర్రులాడుతూ ఉం టే అందరిపైనా విసుగును ప్రదర్శిస్తూ ఉంటే ఆ ఇంట్లో శాంతి సౌఖ్యాలు లోపిస్తాయి. ఆ ప్రభావం ఇంటిల్లిపాదిపై పడుతుంది. కుటుంబంలోని వారి ఆయురారోగ్యాలు బాగుండాలన్నా, ఇల్లు వాకిలి శుచిశుభ్రతలతో కళకళలాడాలన్నా ఆ ఇంటి ఇల్లాలి నైపుణ్యంమీద ఆధారపడి ఉం టుంది. ఇంట్లో వున్న వ్యక్తులమధ్య ఆప్యాయత, అనురాగం వర్థిల్లాలంటే ఇల్లాలి వల్లనే సాధ్యమవుతుంది. కుటుంబంలో అహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే పిల్లలు మంచి అలవాట్లతో ఉత్తమ పౌరులుగా ఎదగగలరు.
**

‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి’ అన్నారు. గృహాలంకరణలో నేర్పు, సృజనాత్మకత, పరిశుభ్రత ఆ గృహిణి అభిరుచిని, నైపుణ్యాన్ని తెలియజేసేవిగా వుంటాయి. కాని ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శిస్తూ- రుస రుసలాడుతూ వుంటే మిగిలినవారికి కూడా మనశ్శాంతి కరువవుతుంది. పూర్వం రోజుల్లో పదిమంది పిల్లల్ని కన్నవాళ్ళు కూడా చిరాకులు, పరాకులు లేకుండా ఓపిగ్గా అన్ని పను లు ఒంటిచేత్తో చక్కబెట్టుకుని ఆనందంగా తాము జీవిస్తూ చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలతో మెలిగేవారు. తరువాత కాలంలో ముగ్గురు, నలుగురు పిల్లలున్నవాళ్ళు కూడా సహనంతో పనులన్నీ చేసుకునేవారు. ఇప్పుడు ఇద్దరో లేక ఒక్కరో పిల్లలతో అన్ని ఆధునిక సౌకర్యాలున్నప్పటికీ హైరానా పడిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట భర్తను ఆఫీసుకు, పిల్లలను స్కూళ్ళకు పం పించే లోపుగా కొంతమంది ఇళ్ళల్లో ఏ రోజు కారోజే నానా గందరగోళంగా ఉంటుంది. ఆ టైమ్‌లో ఆడవాళ్ళ అరుపులు, పిల్లలను పరుగులు పెట్టించడం, భర్తకు పనులు పురమాయించటం, రాని పనిమనిషి గురించి సణుగుళ్ళు.. ఇలా చాలా భయానక వాతావరణం కనిపిస్తూ వుంటుంది.
ఇల్లాలు కోపంతో అరిచే అరుపులతో, కేకలతో ఎలాగో బయటపడిన ఆ భర్త, పిల్లలు ప్రశాంతమైన మనసుతో ఆఫీసుకు, స్కూళ్ళకు వెళ్ళగలరా! వెళ్లినా మనసును పనిపై, చదువుపై ఎంతవరకు లగ్నం చేయగలుగుతారు? ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని మనమే ఏర్పరచుకున్నాం. అర్థరాత్రిదాకా టివీలు చూడటం, ఎప్పటికో నిద్రపోయి ఆలస్యంగా లేవటం, లేచింది మొదలు టైమ్ లేదంటూ చిరాకుపడటం. త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేస్తే ఈ సమస్యలు ఉండవు కదా! ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకోవటంవలన ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇంట్లో పనులన్నీ అం దరూ పంచుకుని చేస్తూ ఉంటే కూడా ఇల్లాలికి సహకరించినవారవుతారు. చికాకుతో కోపంగా చేసే పనులవల్ల నష్టా లు, కష్టాలు మిగులుతాయి. ఇష్టంతో, శ్రద్ధతో ఎంతటి పనినైనా అవలీలగా చేయవచ్చు. స్ర్తిలకు సహజంగానే పురుషులకంటే సహనం, సర్దుకుపోయే గుణం అధికంగా ఉం టాయి. అయినా వాళ్ళు కోపంతో, అసహనంతో ఉంటున్నారంటే దానికి కారణం తెలుసుకుని సవరించవలసిన బాధ్యత ఇంటి యజమానికి ఉన్నదని గ్రహించాలి. ఇంటిని స్వర్గంగా తీర్చిదిద్దగల నేర్పు ఇల్లాలికి మాత్రమే ఉంది. కోపతాపాలతో, అలకలతో, అనవసరపు వాదులాటలతో సాధించలేనిది ఒక్క చిరునవ్వుతో, శాంతి స్వభావం తో సాధించవచ్చు. ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- అబ్బరాజు జయలక్ష్మి