సబ్ ఫీచర్

మేరా ‘ఇస్రో’ మహాన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు సినిమా ఇపుడే మొదలైంది. 104 ఉపగ్రహాలను ఒకే వాహకనౌక ద్వారా పంపించి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మున్ముందు మరిన్ని అద్భుతాలు సృష్టించనుంది. ప్రధానంగా సూర్యుడు, చంద్రుడిపై ఊహించనలవికాని అద్భుతమైన పరిశోధనలకు సిద్ధంగా ఉంది. అంతే కాదు, శుక్రగ్రహంపైనా పెద్ద ఎత్తున ‘ఇస్రో’ పరిశోధనలు ప్రారంభించనుంది. 2008 అక్టోబర్‌లో ‘చంద్రయాన్-1’ ప్రయోగం ద్వారా చంద్రుని కక్ష్యలో వాహక నౌక ప్రయాణించింది. ఈ ప్రయోగం 2009 ఆగస్టులో ముగిసింది. ‘మంగళ్‌యాన్’ ప్రయోగం ద్వారా 2013 నవంబర్ 5న ‘ఇస్రో’ మరో చరిత్ర సృష్టించింది. భారత ఖగోళ శాస్త్ర ఉపగ్రహ మిషన్ ఆస్ట్రో శాట్‌ను 2015 సెప్టెంబర్ 28న ప్రయోగించారు. ఈ మూడింటి ఫలితాలు భారత ఖగోళ పరిశోధనల సామర్ధ్యాన్ని ఒక మెట్టుపైన నిలబెట్టాయి. ‘చంద్రయాన్-2’ ద్వారా ల్యాండర్‌ను చంద్రుడిపై దింపి పరిశోధనలకు అన్ని సన్నాహాలూ పూర్తి చేసుకుంది.
అంతే కాదు, మానవసహిత అంతరిక్ష కార్యక్రమాలకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా త్వరలో రూపుదాల్చనుంది. అంతరిక్ష పరిశోధనలో కాకలు తీరిన దేశాలు సైతం భారత్ ప్రతిభకు దిమ్మదిరిగిపోతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా అంతరిక్ష పరిశోధనా సంస్థ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను నమ్ముకుంది. 36 సార్లు పిఎస్‌ఎల్‌వి ద్వారా ప్రయోగాలు చేయగా అత్యంత కచ్చితత్వమైన ఫలితాలనే సాధించింది. ‘మంగళ్‌యాన్’తో పాటు అనేక కీలక విజయాలను ఈ వాహక నౌకే అందించింది. జిఎస్‌ఎల్‌వి ద్వారా పది ప్రయోగాలు నిర్వహించగా అందులో ఆరు విజయవంతం అయ్యాయి. ఇంత వరకూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మొత్తం 60 ప్రయోగాలను చేసింది. వాటి ద్వారా మన దేశానికి చెందిన 77 ఉపగ్రహాలను, 180 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్ధులు రూపొందించిన మరో ఎనిమిది ఉపగ్రహాలను కూడా అంతరిక్షానికి పంపించింది.
ఎంత చెప్పుకున్నా తక్కువే..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇపుడు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించి యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుండి ఒకే సారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అగ్రదేశాలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం సరిగ్గా 9.28 గంటలకు ‘షార్’లోని మొదటి ప్రయోగ కేంద్రం నుండి 104 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి -సి 37 వాహక నౌక 524 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఉపగ్రహాలను వాటి నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ‘కౌంట్‌డౌన్’ ప్రారంభం కాగానే రాకెట్ నాలుగో దశకు అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్, మిక్స్‌డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుందని నిర్ధారించుకున్నాక ప్రయోగానికి రెండు రోజుల ముందు రెండో దశకు అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి చేసి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను తుది పరిశీలన చేశారు.
మొత్తం మీద ఈ అద్భుత ప్రయోగం నాలుగు దశల్లో సా గింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకువెళ్లిన పిఎస్‌ఎల్‌వి -సి 37 వాహక నౌక తన పనిని విజయవంతంగా పూర్తి చేసింది. సరిగ్గా 17.31 నిమిషాలకు కార్టోశాట్ -2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఐఎన్‌ఎస్, ఐఎన్‌ఎస్-బి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాని తర్వాత అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయిల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎఇ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించాయి. ఇందుకు సంబంధించి మారిషస్‌లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు అందాయి.
ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. 2015 జూన్‌లో ‘ఇస్రో’ సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యయనానికి తెరలేపింది. ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపించింది. ఇందులో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్ ఉపగ్రహాలు 8 ఉన్నాయి. మిగిలిన వాటిలో ఇజ్రాయిల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. మన దేశానికి చెందినవి కార్టోశాట్ -2 దాదాపు 714 కిలోలు, ఐఎన్‌ఎస్-1ఎ , ఐఎన్‌ఎస్-1 బి ఉపగ్రహాలున్నాయి. ఇవి ఒకొక్కటి 15 కిలోల బరువు ఉంటాయి. ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ఇస్రోతో కాంట్రాక్టు ముగుస్తుంది. ఇక ఆయా ఉపగ్రహాల నిర్వహణ బాధ్యతను ఆయా దేశాలే చూసుకోవల్సి ఉంటుంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా పంపించడం అనేది రికార్డుల కోసం మాత్రం కాదని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ బుధవారం మరోమారు చెప్పడం ద్వారా ఇస్రో సామర్ధ్యాలను పెంచుకునేందుకేననేది సుస్పష్టం అయింది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపగ్రహాలను పంపించడంతో పాటు నాణ్యమైన సేవలు అందించడంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా మారింది. అంతే కాదు, ఒకసారి వాహక నౌకను ప్రయోగించాలంటే వేల కోట్ల వ్యయం అవుతోంది. ఇక ముందు ఉపయోగించిన వాహక నౌకనే మరోమారు ఉపయోగించుకునేందుకు వీలుగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భారత్ సిద్ధం చేసుకుంటోంది. పదే పదే పునర్వినియోగ వాహక నౌకలు ద్వారా అన్ని దేశాలకూ వేల కోట్ల రూపాయిలు ఆదా కావడం తథ్యం.

- బివి ప్రసాద్