సబ్ ఫీచర్

పవర్ ఏంజిల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మహిళలపై ప్రతి ఆరు నిముషాలకు ఒకసారి ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, దాడులకు గురైన పలువురు మహిళలు తమపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, పోలీసు స్టేషన్‌కు వెళితే, అక్కడ ఉన్న పురుష పోలీసులు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే. ఉత్తరప్రదేశ్‌లోని మహిళలు తమపై వివిధ రూపాలలో దాడులు జరిగినప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు. ఒకసారి అవమానం జరిగింది చాలులే, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరోసారి అవమానపడటం ఎందుకు అన్న భావన పలువురు మహిళలలో వేళ్ళూనుకుపోయి ఉంది.
మహిళలను చైతన్యపరిచి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు వారు తమపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ పోలీసు ఆఫీసర్స్‌గా మహిళలను నియమిస్తున్నది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు అయితే బాగా అర్థం చేసుకోగలుగుతారు. దాడికి గురైన మహిళలు వాస్తవ పరిస్థితులను మహిళలకు అయితే సవివరంగా వివరించగలుగుతారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలను స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. వీరిని పవర్ ఏంజిల్స్ అని కూడా పిలుస్తారు.
వీరు వేధింపులకు సంబంధించిన కేసులను పరిశీలిస్తారు. వేధింపులకు గురయ్యే మహిళలు ఫిర్యాదు చేయడానికి 1090 అనే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులను స్పెషల్ పోలీసు ఆఫీసర్లు పరిశీలిస్తారు. వీరు ఫిర్యాదు చేసిన మహిళల వద్దకు వెళ్లి, వారి నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దాడులపై మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోతే, వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
పదవ తరగతి చదివిన మహిళలకు ఐదు సంవత్సరాలు, తొమ్మిదవ తరగతి చదివిన మహిళలకు రెండు సంవత్సరాలు కాల పరిమితితో స్పెషల్ పోలీసు ఆఫీసర్ లేదా పవర్ ఏంజిల్స్ అని గుర్తింపు కార్డులు ఇస్తారు. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పవర్ ఏంజిల్స్ నియామకాన్ని ప్రారంభించింది. వీరికి కొద్దికాలంపాటు శిక్షణ ఇస్తున్నారు. పవర్ ఏంజిల్స్ పనిచేయడం ప్రారంభం అయిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో ఈవ్ టీజింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన మహిళలను నియమిస్తున్నారు. మొత్తంమీద ఈ పథకం ఉత్తరప్రదేశ్‌లోని మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నది. ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయడంవలన మహిళలకు ఎంతో మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు.

చిత్రం..మహిళా స్పెషల్ పోలీసు ఆఫీసర్లతో ఎంపీ డింపుల్ యాదవ్

-పి.హైమావతి