సబ్ ఫీచర్

శాకాహారమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మాంసాహారం తింటే బలం కలుగుతుంది అనుకుంటారు. అలా అనుకుంటే.. పొరపాటే! మాంసాహారంలో లేని పోషక విలువలు శాకాహారంలో మెండుగా దండిగా వున్నాయి. పైగా ఖర్చు కూడా తక్కువే..
ప్రస్తుతం శాకాహారులు ప్రపంచ స్థాయిలో నానాటికీ పెరుగుతూనే వున్నారు. అధికంగా మాంసాహారంపైనే ఆధారపడే పాశ్చాత్య దేశాలు సైతం ప్రస్తుతం శాకాహారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. జంతువులపై హింసను వ్యతిరేకించడం కూడా ఇందుకు ప్రధాన కారణమవుతోంది. ఈ మాంసాహారం వలన పర్యావరణానికి సైతం అనేక సమస్యలు ఏర్పడతాయంటున్నారు. ప్రపంచ జంతు సంరక్షణ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో మాంసాహారం తినకండి! జంతువులను సంరక్షించండి!’ అని బోధిస్తున్నాయి. ఈవిషయంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ సంస్థ కృషి మరువలేనిది. నోరులేని మూగజీవాలను, జంతువులను చంపి తింటే అది మానవత్వమా అని బౌద్ధమతం ప్రశ్నిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం బ్రిటన్ దేశంలో దాదాపు 12.50 శాతం, స్వీడన్ దేశంలో 10.50 శాతం, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలలో మరో 5 శాతం యువత శాకాహారంపై దృష్టి పెడుతోందని తెలియడం విశేషం.
గడచిన దశాబ్దకాలంగా పాశ్చాత్య దేశాలలో శాకాహారుల సంఖ్య మాంసాహారుల సంఖ్య కంటే అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ధ్యానం చేసేవారు అధికంగా శాకాహారంపైనే దృష్టి పెడుతుండడం గమనార్హం. తాజా ఆకుకూరల, కూరగాయల్లో పోషకాలు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారానికి బదులు తాజాగా మన కు రోజూ లభించే ఆకుకూరలు, కూరగాయలు తీసుకున్నట్లయితే అత్యధిక శక్తి లభిస్తుంది. గింజ లు, పప్పు్ధన్యాలు శరీరానికి తగిన మాంసకృత్తులు సమకూరుస్తాయి. మొలకెత్తిన గింజలలో సైతం పోషకాలు మెండుగా దండిగా మనకు లభిస్తాయి.
మాంసాహారం కంటే శాకాహారం స్వీకరించేవారి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా వున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. శాకాహారం స్వీకరించడంవలన ఎలాం టి ఇబ్బందులు వుండవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్మన్ వెయిట్ లిఫ్టర్ పాట్రిక్ బాబోమియాన్, ఆస్ట్రేలియన్ బాడీ బిల్డర్ బిల్లీ సిమ్మండ్స్, మన భారతీయ క్రీడాకారులు కొందరు శాకాహారానే్న అమితంగా ఇష్టపడడం గమనార్హం. జంతువులను ప్రేమించండి! జంతువులను సంరక్షించండి వరల్డ్ వైల్డ్ లైఫ్ నినాదం మరువకండి. జీవహింస మాని శాకాహారం అలవాటు చేసుకోవడం మానవ ధర్మం! మాంసప్రియులూ కాస్త ఆలోచించండి! శాకాహారం వైపు అడుగు ముందుకు వేయండి.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎల్.ప్రపుల్లచంద్ర