సబ్ ఫీచర్

విఫల ప్రయోగం.. ‘జంబ్లింగ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానం విఫలమైంది. నిజానికి ఈ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీనియర్ ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపిసి విద్యార్థులకు నిర్దేశించిన ఈ పద్ధతిలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గత ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షల్లో బైపీసీ గ్రూపునకు సంబంధించి 78,112 మంది, ఎంపిసి గ్రూపునకు సంబంధించి 2,42,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 3 నుంచి 22 వరకు 977 కేంద్రాల్లో వీరంతా ప్రాక్టికల్స్‌కు హాజరయ్యారు. ఒప్పుడు వరసగా 4 రోజుల్లోనే ఈ ప్రాక్టికల్స్ పరీక్షలు విద్యార్థులు చదివే కళాశాలలోనే జరిగేవి. ఈ పద్ధతి విద్యార్థులకు ఎంతో అనుకూలంగా వుండేది. అయితే జింబ్లింగ్ పద్ధతిలో విడతల వారీగా మధ్యలో బాగా విరామం ఇచ్చి పరీక్షలు జరిపినందున విద్యార్థులు ఆ తర్వాత జరిగే థియరీ పరీక్షలకు తయారయ్యేందుకు అవకాశం లేని పరిస్థితి ఎదురైంది. ఎంతో విలువైన కాలం వృథా అవుతోంది. కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించలేకపోయిన దుస్థితి ఏర్పడింది.
అన్నింటికీ మించి విద్యార్థులు తమకు అందుబాటులో లేని సుదూర ప్రాంతాలలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. ప్రాక్టికల్స్‌కు సంబంధించి 60 శాతం కళాశాలల్లో కనీస వసతులు కూడా లేవనేది అక్షర సత్యం. దాంతో ఈ పరీక్షలను మొక్కుబడిగా తంతులా నిర్వహించారు. ప్రాక్టికల్స్ నిర్వహణ అధ్యాపకులకు సైతం కత్తిమీద సాముగా మారింది. ఆయా కళాశాలల్లో ఉపకరణాలు ఏకరూపత లేకుండా వేర్వేరుగా వున్న పరిస్థితి వున్నందున విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఎవరికి నచ్చిన కంపెనీల నుంచి స్లయిడ్స్, చార్టులు, రసాయనాలను తెప్పించుకోవం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థి తాను చదువుతున్న కళాశాలలోని ప్రయోగశాల పరిస్థితికి, వేరే కేంద్రంలోని ప్రయోగశాలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించినట్టు పేర్కొంటున్నారు. కొన్ని ఉపకరణాలను వారు గుర్తించలేని పరిస్థితిని ఎదుర్కొన్నట్టు అనుభవరీత్యా స్పష్టమైంది. విద్యార్థులు దీనివల్ల కొన్ని మార్కులను కోల్పోయినట్టు ఆవేదన చెందారు. డిగ్రీ, బిటెక్, బి.్ఫర్మసీ, ఎంబిబిఎస్‌లలో లేని ఈ జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్మీడియట్‌లో ప్రవేశపెట్టడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలోవుంచుకుని ప్రభుత్వం వ్యవహరించాలే తప్ప, వారిని ఇబ్బంది పెట్టే విధానాలను అమలు చేయడం సరికాదు. ఈ పద్ధతివల్ల ఎంతో నష్టపోయామని వారంతా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎసి గదుల్లో కూర్చుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై కొత్త ప్రయోగాలను చేయడం వల్ల ఒరిగేదేమీ వుండదు.
విద్యాశాఖకు ఏదైనా కొత్త ప్రయోగాలను చేపట్టే ఆలోచనలు వుంటే క్షేత్రస్థాయిలో రాష్టవ్య్రాప్తంగా సదస్సులను నిర్వహించాలి. అందులో కళాశాల అధ్యాపకులను, విద్యార్థులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. అంతేకానీ ‘లేడికి లేచిందే పరుగన్న’ట్టు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టమే జరుగుతుంది తప్ప ఆశించిన లక్ష్యాలు నెరవేరవు. విద్యార్థి చదివిన కళాశాలలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానాన్ని గతంలో వలె నిర్వహించాలి. ఈ ప్రాక్టికల్స్ పరీక్షకు పరిశీలకులుగా బయటి కళాశాలల అధ్యాపకులు వస్తారు కాబట్టి అక్రమాలు జరిగేందుకు ఆస్కారం వుండదు. ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా 2,42,662 మంది సైన్స్ విద్యార్థులు ఎదుర్కొన్న అనుభవాలను ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. వచ్చే విద్యాసంవత్సరం (2017-18) నుంచైనా జంబ్లింగ్ విధానానికి పూర్తిగా మంగళం పాడాలి. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.

-వాండ్రంగి కొండలరావు