సబ్ ఫీచర్

అందరి దృష్టి అమెరికాపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు. ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల వల్ల అమెరికా అంటే చాలామందిలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఎవరైనా అమెరికా వెళ్లి వచ్చాక ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. అమెరికా గొప్పదనం ఏమంటే ఇతర దేశస్థులకు సైతం అవకాశాలు కల్పించడం. తాము ఎప్పటికీ అగ్రరాజ్యంగానే ఉండాలన్నదే అమెరికన్ల తపన. అమెరికాను ఎన్నో విషయాల్లో ముందు వరుసలో ఉంచడానికి ఆ దేశస్థులే కాదు, ప్రవాస భారతీయులు, వివిధ దేశాల వారు సహకరిస్తున్నారు.
అందరినీ చిరునవ్వుతో పలకరించే అమెరికన్ల సభ్యతా సంస్కారాలు అన్ని దేశాల వారికీ ఆదర్శమే. అమెరికన్లు పుట్టుక, వంశ చరిత్రలకంటే వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యమిచ్చే సమాజాన్ని సృష్టించారు. అక్కడ ప్రతి రంగంలో మార్పులు అతివేగంగా చోటుచేసుకుంటాయి. ప్రపంచంలో మరెక్కడా లేని గతిశీలత అమెరికాలో ఉంది. శిఖరాగ్ర స్థాయికి చేరిన అమెరికన్ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, న్యాయవాదులు అనామక కుటుంబాలలో పుట్టినవారే. కటిక పేదరికం నుంచి వచ్చినా అద్భుతాలు సాధించినవారు ఎందరో ఉన్నారు. అయితే, సంపద, సామాజిక అంతస్తులకు సంబంధించి అమెరికన్ సమాజంలో తీవ్ర అసమానతలు ఉన్నాయి. అయినప్పటికీ వ్యక్తుల ప్రాభవ పతనాలు అనేవి పూర్తిగా వారి స్వంత ఆకాంక్షలు, సామర్థ్యాలపైనే ఆధారపడి వుండేవిగా అక్కడి సమాజం వ్యవస్థీకృతమైంది. ఈ కారణంగానే సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు సామాన్యులుగాను, పేద కుటుంబాల నుంచి వచ్చినవారు అసామాన్యులుగా వెలుగొందడం జరుగుతోంది. వర్గ వ్యవస్థ ఉన్నా, వర్గ భావన లేకపోవడం అమెరికన్ సమాజ విశిష్టత. ఒక కంపెనీ సిఇఓ సైతం ఫ్యాక్టరీలో సామాన్య కార్మికులతో ఒక సహచరుడుగా మెలగుతాడు. శ్రమకు సంపూర్ణ గౌరవం లభిస్తుంది. అక్కడి ఉద్యోగులు భౌతిక శ్రమకు విలువనివ్వడమే కాదు, ఇంట్లోనూ స్వయంగా వివిధ పనులు చేయడానికి సైతం అమెరికన్ సిఇఓలు వెనుకాడరు. అందుకనే ఆ దేశంలో వంట మనుషులు, పనిమనుషుల వ్యవస్థ కనిపించదు.
అమెరికాలో ఇతర ఆధునిక సమాజాలలో కంటే వర్గం, సామాజిక హోదాలకు ప్రాధాన్యం తక్కువ. వృత్తిపరమైన ఉన్నతి లేదా ఉద్యోగపరమైన ఎదుగుదలలో కుటుంబ నేపథ్యం పెద్ద పాత్ర వహించదు. బిల్‌గేట్స్ ఇందుకు ఉదాహరణ. స్వశక్తితో అపర కుబేరుడైన బిల్‌గేట్స్ తన ఆర్జనలో అత్యధిక భాగాన్ని దానధర్మాలకే వినియోగిస్తున్నాడు. చాలా స్వల్పభాగాన్ని మాత్రమే తన పిల్లలకు ఇచ్చాడు. వారు మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడానికి గాని లేదా ఆ కంపెనీ ప్రతిష్ఠను సొంతానికి వాడుకోవడానికి గాని ఆయన అనుమతించరు. బిల్‌గేట్స్ పిల్లలైనా వారంతట వారే జీవితంలో పైకి రావాల్సి వుంది.
రాజకీయ పక్షాలను కుటుంబ వ్యాపార సంస్థలుగా మార్చివేయడం వల్ల భారత్‌లో ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టమేమిటో అందరికీ తెలిసిందే. రాజకీయాలలో అర్హతలను పట్టించుకోకుండా సొంతవారిని అందలాలు ఎక్కించడం వల్ల జరుగుతోన్న నష్టం అంతకంటే ఏ మాత్రం తక్కువ కాదు. ప్రైవేట్ రంగానికి పేరుపొందిన అమెరికాలో అత్యున్నత విద్యాసంస్థలు చాలావరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే కావడం విశేషం. ప్రైవేట్ లేదా ప్రభుత్వ విద్యాసంస్థలు వాటి ప్రతిష్ఠను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. అయితే, అంతర్జాతీయ వ్యవహారాల్లో మాత్రం అమెరికా దౌర్జన్యకారి. సామ్రాజ్యవాది కూడా. ప్రజాస్వామిక సమాజం బలంగా ఉన్న దేశం అమెరికా. గతంలో సానుకూల దృక్పథంతో అమెరికాను పదే పదే తలచుకుంటుండగా, ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ విధానాల కారణంగా వ్యతిరేకంగానైనా నిత్యం ఆ దేశాన్ని స్మరించుకోవాల్సి వస్తోంది.

-పుట్టా సోమన్నచౌదరి