సబ్ ఫీచర్

నువ్వుల నూనెతో నిగారింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వుల నూనె ఆహార పదార్థాల తయారీకి, ఊరగాయలకు, పిండివంటలకు, బాడీ మసాజ్‌కు, సౌందర్య సాధనాల తయారీకే కాక, దీపారాధనకూ ఉపయోగిస్తున్నారు. నువ్వుల నూనెలో ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు.
ఆహార పదార్థాల తయారీలో నువ్వుల నూనెను వాడటంవల్ల బి.పి, రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటాయి. నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా వుంటుంది. శరీరానికి మసాజ్ చేయడంవల్ల దేహంలోని విషతత్వాలను తొలగిస్తుంది. నువ్వుల నూనెలో పసుపు కలిపి పాదాల పగుళ్ళమీద రాస్తూంటే చర్మం మెత్తబడి పగుళ్ళు తగ్గిపోతాయి. గోరువెచ్చని నూనెను తలకు పట్టించి, మృదువుగా మర్దనా చేస్తే తలలో రక్తప్రసరణ బాగా జరగటమే కాక వెంట్రుకలు రాలిపోవటం తగ్గుతుంది. వివిధ రకాల బాడీ లోషన్స్, కాస్మటిక్స్‌లో నువ్వుల నూనె కలుపుతారు. సయాటికా నొప్పికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల నువ్వుల నూనె కలిపితే చర్మానికి మృదుత్వం కలుగుతుంది. ఆహార పదార్థాల్లో కలపడంవల్ల అవి కలుషితం కాకుండా, నిలువ ఉండేట్లుగా చేస్తుంది. నిలవ ఊరగాయల్లో, నిలవ పచ్చళ్లలో నువ్వుల నూనెను కానీ, నువ్వు పప్పు నూనెనుకానీ వాడతారు. ఆకలిని వృద్ధి చేస్తుంది. బాలింతరాలు ఆహార పదార్థాల్లో ఈ నూనెను వాడితే చనుపాలు వృద్ధి చెందుతాయి. స్ర్తిలలో నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. వెన్నునొప్పిని నివారిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. ధమనులలో ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తుంది.
వంటలలో నువ్వుల నూనెను వాడితే వంటికి పట్టిన నీరును తొలగిస్తుంది. కౌమారానికి చేరుకున్న అమ్మాయిల శారీరక ఆకృతి అందంగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని పోగోడుతుంది. బాక్టీరియాను విధ్వంసం చేస్తుంది. స్నానానికి ముందు చర్మానికి ఈ నూనెను పట్టిస్తే చర్మం తేమగా మృదువుగా వుంటుంది. కీళ్ళనొప్పులకు ఔషధంలా పనిచేస్తుంది. క్యాన్సర్ నిరోధక గుణాలు ఈ నూనెలో ఉన్నాయి. రక్తంలోని హానికారక పదార్థాలను నాశనం చేసే యాంటీబాడీస్ ఉత్పత్తిని ఉత్తేజితం చేసి అంటువ్యాధులు సోకకుండా పనిచేస్తుంది. నరాలకు సంబంధించిన అనారోగ్యాలను రానివ్వదు. రక్తంలోని కొలెస్ట్రాలు పెరగకుండా తోడ్పడుతుంది. జీవశక్తిని పెంచుతుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుకు సాయపడుతుంది. స్ర్తిల లో నెలసరి సంబంధిత ఋతుస్రావం అధికం కాకుండా చూస్తుంది.

- కె.నిర్మల