సబ్ ఫీచర్

మహిళా వ్యాపారవేత్తలకు మనసుండదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా పారిశ్రామికవేత్తలపై ఎన్నో అభూత కల్పనలు ప్రచారంలో ఉన్నాయి. వారు కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించలేరదే అపోహ ఉంది. ఎప్పుడూ బిజినెస్‌లో తలమునకలై ఉండటం వల్ల వ్యాపారం తర్వాతే కుటుంబమని- ఇలా రకరకాల దురభిప్రాయాలు వెల్లబు చ్చుతుం టారు. ముఖ్యంగా వీరు లైఫ్ పార్ట్‌నర్‌గా పనికిరారన్న ఒపీనియన్ కొంచెం బాధపెట్టే విషయమే. అయితే ఇవన్నీ అవాస్తవాలే. ఇంటి ఆర్థిక మంత్రి ఇల్లాలే అయనపుడు మంచి అర్థాంగి కావడానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఆమెకు ఉన్నాయ.
మహిళా వ్యాపార వేత్తలు సహజంగానే ఆశావాదులు. ఫ్యామిలీ, ఫ్యూచర్ వంటి విషయాల్లో స్వతం త్రంగా వ్యవహరిస్తారు. టైమ్‌కి అప్పులు కట్టేస్తారు. జీవిత భాగస్వామి జయాపజయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇంట్లో అయినా, బిజినెస్‌లో అయినా గిల్లికజ్జాలను ఒడుపుగా పరిష్కరించుకునే నేర్పరితనం ఉంది. జీవిత భాగస్వామి కావడానికి ఇలాంటి దృక్పథం సరిపాదా?
మహిళా వ్యాపారవేత్తలు స్వాప్ని క జీవులు. కలల సాకారానికి శక్తివంచన లేకుండా కష్టపడతారు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న భాగస్వామి దొరక టం అదృష్టం కాదా?
బిజినెస్‌లో ఎన్ని సమస్యలున్నా పెదాలమీద చెరగని చిరునవ్వుతో ఈవెనింగ్ ఇంటికి తిరిగొస్తారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే వ్యక్తులంతా గొప్ప జీవిత భాగస్వాములవుతారని ఒక అధ్యయనంలో తేలింది.
రోజువారి పనిలో సవాళ్లు, వ్యాపారంలో ఎదురుదెబ్బలు సహజమే. వాటిని చూసి కృంగిపోకుండా పరిష్కారం ఆలోచించడం మహిళా వ్యాపారవేత్తల ప్రత్యేకత. చూసిందే నమ్ముతారు, చెప్పుడు మాటలు అసలు వినరు. సంసారంలో కావాల్సింది ఇదే కదా!
మహిళా వ్యాపారవేత్తలకు ప్రతిరోజూ ప్రత్యేకమే. రోజువారి పనిలో భాగంగా ఎన్నో చర్చలు, పనుల్లో మమేకమవుతారు. ఇక ఇంటికి వచ్చిన భర్తతో ఈ కబుర్లు పంచుకోవటం వల్ల ఈ బంధం మరింత బలపడుతుంది.
మహిళా వ్యాపారవేత్తలు ఇతరులకు స్ఫూర్తిగా పనిచేస్తుంటారు. భర్త కూడా బిజినెస్ మ్యాన్ అయతే జీవితం మరింత బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపారవేత్తలే కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా
సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
మహిళా వ్యాపారవేత్తలకు ఉండే విశాల దృక్పథం వల్ల పరిస్థితులకు తమను తాము అనుకూలంగా మలచుకుంటారు. రకరకాల గోల్స్, ఎజెండాలు ఉన్న బోలెడంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటారు. సాధ్యమైనంత వరకు వాటి ని సాకారం చేసే ప్రయ త్నం చేస్తుంటారు. ఈ లక్షణా లన్నీ సంసా రా న్ని ఈదడంలో ఉపయోగపడవా?
మహిళా వ్యా పారవేత్తలకు రోజులో సింహభాగం కమ్యూనికేషన్‌కే సరిపోతుంది. అది ఈమెయిల్స్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి! అవతలివాళ్ళకు పంపే ప్రతి సందేశం సూటిగా ఉంటుంది. చెప్పే విషయంలో స్పష్టత ఉండే ఇలాంటి వ్యక్తులనే చాలామంది జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.
వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడమే
కాకుండా, సామాజిక సేవలోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు మ హిళా వ్యాపారవేత్తలు. అంత మంచి ఉదార స్వభావం వున్నవారు వాళ్లు. భర్తను ఇంకెంత బాగా చూసుకుంటారు చెప్పండి.
అన్నింటికిమించి సక్సెస్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తలు వారి జీవిత భాగస్వాముల కెరీర్‌కూ సాయం చేస్తుంటారు. ప్రొఫెషనల్‌గా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇప్పుడు చెప్పండి! ఎవరి జీవితాన్నైనా అందంగా అర్థవంతంగా మార్చగలిగే శక్తి మహిళా వ్యాపారవేత్తలకు ఉందనే సత్యాన్ని అంగీకరించక తప్పదు.