సబ్ ఫీచర్

కెసిఆర్‌కు గుడి కట్టేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని కాన్సస్‌లో జాతివిద్వేషాన్ని జీర్ణించుకున్న ప్యూరిన్టన్ అనే నరహంతకుడి కిరాతక చర్య గురించి విన్న ఇక్కడి తెలుగువారికి వచ్చే తొలి ఆలోచన ఏమంటే- తె లంగాణ సిఎం కెసిఆర్‌కు గుడి కట్టేయ వచ్చని...
‘మీకు ఈ దేశంలో ఏం పని? ఇక్కడి నుంచి వెళ్లిపోండ’ని హైదరాబాద్ యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌పై తుపాకీ గుళ్లతో గర్జించిన ఆ ‘తెల్లతోడేలు’ చేసిన వ్యాఖ్యలు అనేకానేక హెచ్చరికలకు సంకేతం గా భావించాలి. అమెరికా దేశాధినేత ట్రంప్ తెచ్చిన సంస్కరణలు, ఆయన భావజాలాన్ని జీర్ణించుకున్న ‘తెల్లతోడేళ్లు’ ఇక అక్కడ విదేశీయులను బతకనివ్వవన్న నిజం చాలామందికి అర్థమైంది. ఆ ఘటనలో గాయపడిన మరో బాధితుడి తండ్రి ‘బతికుంటే ఏదో ఒకటి చేసుకుని జీవించవచ్చు. ఎక్కడో దేశం కాని దేశంలో ఆ దుస్థితి ఎందుకు? సొంతగడ్డకు వచ్చేయ’మంటూ హృదయవిదారకంగా చేసిన వ్యాఖ్యలు ‘డాలర్ల మోజు’లో పడిన ప్రవాసీయులకు కనువిప్పు కావాలి!
అమెరికాలో భారతీయులపై వరుస దాడులు, పదిరోజుల వ్యవధిలో రెండు హత్యలు, ట్రంప్ వైట్‌హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నిర్నిరోధంగా జరుగుతున్న అవమానాలు చూస్తే.. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో ఉంటూ, ఇప్పటికీ సుఖంగా, స్వేచ్ఛగా జీవిస్తున్న ‘సెటిలర్లు’ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడికట్టేయవచ్చన్న భావనలో తప్పేమీ లేదు. తొలిదశ ఉద్యమంలో సంగారెడ్డి వంటి కొన్ని ప్రాంతాల్లో కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుల దాడులకు గురైనా, మొత్తంగా సీమాంధ్రులను తెలంగాణ ఉద్యమకారులు గౌరవంగానే చూశారన్నది నిర్వివాదం. మలిదశ ఉద్యమ పతాక నాయకత్వం అందుకున్న కేసీఆర్ ఢిల్లీ పాలకులను, ఆంధ్ర పెట్టుబడిదారులను హడలెత్తించినా ‘సెటిలర్ల’ జోలికి వెళ్లలేదు. ‘పొట్టకొట్టడానికి వచ్చిన వారిపైనే’ తమ యుద్ధమన్నారు.
అప్పుడది రాజకీయ ప్రేరిత ఉద్యమం, ఉద్యమ ప్రేరిత రాజకీయ వ్యూహాలతో నడిచిన ఆకాంక్షల సమరం! కాబట్టి ఉద్యమకారుడికి అన్ని లక్ష్యాలూ సహజంగానే ఉంటాయి. సొంత వారిలో ఉద్యమస్ఫూర్తి రగిలించేందుకో, సహచరుల్లో నమ్మకం పెంచేందుకో, రాజకీయ కోణంలోనో సెటిలర్లపై కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్‌రావు కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ‘మీరు సంక్రాంతికి వెళ్లి వచ్చేలోగా మీ ఇళ్లు స్వాధీనం చేసుకుంటామ’ని కొందరు ఉద్యమకారులు హెచ్చరికలు చేసి ఉండవచ్చు. కానీ, ఏనాడూ అలాంటి దుందుడుకు చేష్టలు కనిపించలేదు, ఎవరిపైనా చేతులు వేసిన దాఖలాలు కూడా లేవు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రసంగాల తీరు, ఉద్యమకారుల దూకుడు చూసి తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రులంతా వెనక్కి వెళ్లిపోవాలేమోనన్న భావన ఏర్పడింది. ఇప్పుడు ట్రంప్ మాదిరిగా అప్పుడు కేసీఆర్ ప్రకటనలు చేయకపోయినా ‘నీరు, నిధులు, నియామకాల’ నినాదం చూసిన వారికి దాదాపు అలాంటి భయమే పుట్టింది. అధికారంలోకి వచ్చాక- ‘సకల జనుల సర్వే’ కేవలం సీ మాంధ్రుల జనాభా తేల్చేందుకే చేయించారనుకున్నా, దానికి సంబంధించిన కలెక్టర్ల సమావేశానికి సీమాం ధ్ర మూలాలున్న అ ప్పటి అధికారులను ఆహ్వానించకుండా, కొంతకాలం ఉద్యమభావనలో ఉన్న కేసీఆర్ ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకుని, చివరికి సీమాంధ్రులతో ‘శభాష్’ అనిపించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఏ ఒక్క సెటిలర్ కూడా విమర్శించే పరిస్థితి లేదు. ఆంధ్రావాళ్లు పెట్టుబడి పెడితే వద్దంటామా? వాళ్లకూ అందరి మాదిరిగానే రెడ్ కార్పెట్ వేస్తామన్నారు. ఒక ఉద్యమకారుడిలో అంత త్వరగా మార్పు రావడమన్నది అబ్బురమే.
ఉద్యమం వేరు, పరిపాలన వేరన్నది కేసీఆర్ అత్యంత సులభంగా గ్రహించి, దానిని ఆచరణలో పెట్టి, తనలోని రాజనీతిజ్ఞుడిని ఆవిష్కరింపచేసుకున్నారు. లేకపోతే.. ఉద్యమ సమయంలో ఆంధ్ర పెట్టుబడుదారులు తెలంగాణను దోచుకుతింటున్నారన్న ఆయన, పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత- అన్ని కాంట్రాక్టులనూ అదే ఆంధ్ర కంపెనీలకు కొనసాగించలేరు కదా? కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో చక్రం తిప్పిన వైఎస్ ఆత్మ ఇప్పుడు తెలంగాణనూ ఎలా ఆవహిస్తుంది? ఏపిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఐవైఆర్ కృష్ణారావును పిలిపించుకుని ‘తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్’ ఏర్పాటుకు సలహాలివ్వమని కోరలేరు కదా? ఏపి సిఎం చంద్రబాబు ఇంటి అనుమతులను మొదట తిరస్కరించిన అదే ప్రభుత్వం, తర్వాత అవన్నీ మంజూరుచేయలేదు కదా? ఏపిలో బాబు సర్కారును తూర్పారపడుతున్న వైకాపా జగనన్న తెలంగాణ గడ్డపై సుఖంగా, సురక్షితంగా ఎలా ఉండగలుతున్నారు?
కేసీఆర్ రెండేళ్ల పాలనలో ఒక్క సెటిలర్‌పైనా దాడి జరగలేదని, వారిని మేం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాటిచ్చారు. సెటిలర్లు కూడా వాటినే నమ్మి ‘గులాబీ’ని గుబాళింపచేశారు. అందువల్ల అమెరికాలో జీవించడం కంటే హైదరాబాద్‌లో నివసించడం చాలా సుఖం, సు లభం! అమెరికాలో ట్రంపు ‘కంపు సంస్కరణల’తో తె లుగువాళ్లు హడలిపోతుం టే, ఎన్నికల తర్వాత సమానత్వ సిద్ధాంతాన్ని అమలుచేస్తున్న కేసీఆర్‌కు సెటిలర్లు గుడికట్టిస్తే తప్పులేదు.
* * *
ఎవరూ ఫలానా కులంలోనో, ఫలానా మతంలోనో, ఫలానా ప్రాంతంలోనే పుట్టాలని కోరుకోరు. ‘ఇది దొరల రాజ్యం, గడీల పాలనం’టూ రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తున్న సందర్భంలో మంత్రి కేటీఆర్ ఆవేదనతో చేసిన వ్యాఖ్య ఇది. ఈ విశాల ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు. ఒకరి హక్కులు హరించనంత వరకూ ఎవరికీ సమస్యలు రావు. అలాంటి అనుమానం, భావన వస్తేనే సమస్య. సమైక్య రాష్ట్రంలో పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలుచేసి, తెలంగాణకు సమున్నత గౌరవం ఇచ్చి, అక్కడ సంపదను కొన్ని వర్గాలు కబళించకుంటా ఉండి ఉంటే విభజన ఆలోచనే వచ్చేది లేదు. సరే.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. ఎవరికి ఇష్టం లేకపోయినా దాన్ని గౌరవించాల్సిందే.
ఇప్పుడు- ‘మా ఉద్యోగాలు కొల్లగొడుతున్న భారతీయులు మా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేన’న్న శే్వతజాతీయుల మాటలు- రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలోని కొందరు ఉద్యమకారుల నుంచి వినిపించేవి. ‘ఆంధ్రోళ్లు మా ఉద్యోగాలు దోచుకుంటున్నార’నే ఆవేదన సోషల్ మీడియాలో వినిపించేది. వాటికి అమెరికాలో ఉం టున్న ఎన్‌ఆర్‌ఐలూ షేర్లు, లైకులూ కొట్టేవారు. ఇప్పుడు అమెరికాలో ఒక్క తెలుగువాళ్లనే కాదు, అసలు భారతీయులందరినీ గెంటివేయాలన్న ని నాదం వినిపిస్తోంది. ఒకప్పుడు ‘ఆంధ్రావాలా గో బ్యాక్’ అనే నినాదాన్ని సోషల్ మీడియాలో సమర్ధించిన ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు అమెరికాలో పరిస్థితులను ఖండిస్తున్నారు. ‘ట్రంప్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నా డు. ఆయన ఏ దేశంలోనైనా వ్యాపారం చేసుకోవచ్చు. మేం ఇక్కడ ఉద్యోగాలు చేసుకోకూడదా?’ అన్నది వారి ప్రశ్న. రెండున్నరేళ్ల క్రితం ఉద్యోగాల విషయంలో ‘ఆంధ్రోళ్ల’కు ఎదురైన ప్రశ్న- ఇప్పుడు శే్వతజాతీయులు భారతీయులకు వేస్తున్నారు. దేశం మారిందే తప్ప.. ప్రశ్నలో మార్పు లేదు.
మేధస్సు ఎవరి సొంతం కాదు. ఒక ప్రాంతానికి పరిమితమైనదీ కాదు. దానిని వాడుకున్న వాడే గొప్పవాడు. ట్రంప్ రాకముందు భారతీయుల మేధస్సును అమెరికా గుర్తించి, గౌరవించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజాల వల్ల లాభపడింది, పడుతున్నదీ ఆ దేశమే తప్ప, మనం కాదు. ఎవరైనా ప్రతిభ ఉంటేనే ఉద్యోగమిస్తారు. అమెరికా కంపెనీలు భారతీయుల్లో పనిమంతులకే ఉద్యోగాలు, కష్టానికి తగ్గ జీతాలు ఇస్తున్నాయి. సదరు కంపెనీలను మెప్పించి శే్వతజాతీయులూ ఉద్యోగాలు పొందవచ్చు. ఇక్కడ మాదిరిగా అక్కడ ‘రిజర్వేషన్లు’ లేవు కాబట్టి, ప్రతిభే కొలమానంగా తెల్లవారూ అవకాశాలు సాధించవచ్చు. ఇచ్చేది ఎవరో అయినప్పుడు- అందులో ఎవరి ఉద్యోగాలు ఎవరు కొల్లగొట్టినట్లు? బాధితుడి తండ్రి చెప్పినట్లు, ట్రంపుసారు మెడపట్టి గెంటేంతవరకూ ఉండకుండా, అక్కడే ఉండి శే్వతజాతీయుల అరాచకాలకు బలికాకుండా, డాలర్లపై మమకారం విడిచి మాతృదేశానికి రావడమే మంచిదన్న భావన శుభ పరిణామమే.
ప్రపంచానికి భద్రత కల్పిస్తానని ‘కాలరు’ పైకెత్తే అమెరికా, తన దేశంలో ఉన్నవారినే రక్షించుకోలేని దుస్ధితికి కూచిభొట్ల శ్రీనివాస్ మరణం ఓ నిదర్శనం. ‘తెల్లతోలు’ డొల్లతనాన్ని లాడెన్ ఎప్పుడో చూపించాడు. పరాయి గడ్డపై పాట్లు పడే కంటే అపార సంపద, వనరులున్న సొంత దేశంలోనే పనితనాన్ని ప్రదర్శించుకోవడం తెలివైన పని. అలా వచ్చిన వారి మేధస్సును దేశానికి వాడుకోవాల్సిన బాధ్యత పాలకులపైనా ఉంది.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144