సబ్ ఫీచర్

కరుగుతున్న మంచు ఫలకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటార్కిటికా భూగోళానికి దక్షిణాగ్రాన వున్న మంచు ఖండము. దక్షిణ ధృవము ఇక్కడే ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ పేరుతో 2016లో ఒక నివేదిక ప్రచురించింది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో పశ్చిమ అంటార్కిటికా తీరాన ‘అమండ్‌సెన్ సముద్రం’ వ్యాపించి ఉంది. ఈ సముద్రంలో గల ఆరు పెద్ద మంచు చరియలు సంబంధించి శాటిలైట్లు, విమానాలు, నౌకల ద్వారా గత ఇరవై ఏళ్లుగా సేకరించిన సమాచారాన్ని నాసా అధ్యయనం చేసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్తవ్రేత్తలు వేరొక నివేదిక ప్రచురించారు. వీరు థ్వైట్స్ మంచు చరియను (్ధ్వట్స్ గ్లేసియర్) కంప్యూటర్ల సహాయంతో రూపొందించిన నమూనాల సాయంతో అధ్యయనం చేసారు. ఇది ‘సైన్స్‌‘ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ రెండూ స్వతంత్ర అధ్యయన నివేదికలు. ఈ రెండు నివేదికల సారాంశం ఏమిటంటే ‘పశ్చిమ అంటార్కిటికాలోని మంచు కొండలు కరిగి కుప్పకూలిపోతున్నాయి. దీని ఫలితంగా రాబోయే వందేళ్లలో సముద్రమట్టం బాగా పెరగనుంది. పర్యావరణంలో సంభవిస్తున్న ఈ పరిణామాలను ఆపడం ఎవరి తరము కాదు’ అని.
పశ్చిమ అంటార్కిటికాలో అతి పెద్ద మంచు ఫలకం వుంది. దీనికి ఆధారంగా వున్న భూభాగం సముద్ర మట్టానికి చాలా దిగువన ఉంది. ఒకవేళ ఈ మంచు ఫలకం పూర్తిగా కరిగిపోయినట్టయితే భూగోళంపై సముద్రమట్టం 3-4 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. భూ ఉపరితల వాతావరణం వేడెక్కుతూ వుండడం వల్ల పశ్చిమ అంటార్కిటికాలో గల ఈ మంచు ఫలకం నుండి పెను ముప్పు పొంచి వుందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటిదాకా శాస్తవ్రేత్తలు ఈ మంచు ఫలకం పూర్తిగా కరిగిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తూ వచ్చారు. కానీ నాసా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్తవ్రేత్తలు జరిపిన అధ్యయనాలు మరొక 200 సంవత్సరాలలోనే ఈ ఉపద్రవం సంభవించే అవకాశం ఉందని వెల్లడి చేస్తున్నాయి.
ఎరికిరింగ్టన్ నాసా పరిశోధకుడు. అమండ్‌సెన్ సముద్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కొండలు కరుగుతున్నాయని, ఫలితంగా రాబోయే రెండు వందల ఏళ్లలో సముద్రమట్టం 1.2 మీటర్లు అనగా 3.93 అడుగులు ఎత్తుకు పెరగవచ్చని, తగిన నివారణ చర్యలు తీసుకోగలిగే పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయిందనీ ఆయన అంటున్నారు. టోపోగ్రాఫిక్ మాప్స్, కంప్యూటర్ సిమ్యులేషన్స్, రాడార్లు ఉపయోగించి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్తవ్రేత్తలు కనుగొన్నది ఏమిటంటే థ్వైట్స్ మంచు చరియకి కూడా కరిగి కూలిపోయే దశ మొదలైందని. ఇదొక్కటీ కరిగిపోతే సముద్రమట్టం 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుందని అంచనా.
శ్రీ్ధర్ ఆనందకృష్ణన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో జియోసైనె్సస్ ప్రొఫెసర్. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) పశ్చిమ అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం గురించి సరైన అంచనాలు వేయలేకపోయింది. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. 2100 వచ్చేసరికి సముద్రమట్టం 90 సెంటీమీటర్ల ఎత్తు పెరగనుంది’ అంటారు. దీనినిబట్టి వాతావరణంలో ఎంత వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి అర్ధమవుతుంది.

-దుగ్గిరాల రాజకిశోర్