సబ్ ఫీచర్

ఎన్నికల సంస్కరణలు ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో నేడు ఎన్నికలంటేనే కులాలు, మతాలు, ధనం- ఈ మూడూ అత్యంత కీలకమైనవిగా మారాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఎన్నికలొచ్చినపుడు దేశంలోని ప్రధాన సమస్యల గురించి ఆలోచించడం, వాటికి పరిష్కార మార్గాలు అనే్వషించే పరిస్థితి ఉందా? ఉచిత పథకాలను, ధన ప్రభావాన్ని నియంత్రించే మార్గమే లేదా? అందుకే సరైన ఎన్నికల సంస్కరణల గురించి చర్చించాల్సిన తరుణం ఇది.
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ గుర్తించిన జాతీయ, ప్రాంతీయ పార్టీలెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసలింతమంది అభ్యర్థులెందుకు? కేవలం గుర్తింపు పొందిన పార్టీలే- వాటి పేర్లపై పోటీ చేస్తే చాలదా? అభ్యర్థుల పేర్లను ప్రచారంలో గాని, బ్యాలెట్ పేపర్ మీద గాని ఉండరాదు. అంతటా పార్టీల పేర్లు, వాటి గుర్తులను మాత్రమే వాడాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి-టిడిపి (ఎన్నికల పొత్తు ఉందనుకుంటే), మజ్లిస్, సిపిఎం, సిపిఐ ఇంకేమైనా గుర్తింపు పొందిన పార్టీలుంటే- ఎన్నికల్లో అవే పోటీ చేయాలి. ఎక్కడా ఏ అభ్యర్థి పేరూ ఉండదు. వోటరు కూడా తనకున్న అవగాహన, తనకు ఆయా పార్టీల మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వోటేస్తాడు. ఎన్నికలైన తర్వాత రాష్ట్రం మొత్తం మీద పోలైన వోట్ల మేరకు ఎక్కువ వోట్లుపడ్డ పార్టీ ఏదో తేలిపోతుంది. ఆ పార్టీకి అసెంబ్లీలో ఎన్ని స్థానాలు లభించాయో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అభ్యర్థులకు బదులు ఆయా పార్టీలు గెలిచినట్లు ప్రకటించాలి. ఆయా నియోజకవర్గాల్లో అధికశాతం వోట్లు పొందిన పార్టీల అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.
అభ్యర్థుల పేర్లు ఎన్నికల ప్రచారంలో ఉండవు గనుక ఎక్కడా వ్యక్తిగత విమర్శలు, కులమతాల ప్రస్తావన ఉండవు. వోటర్లను డబ్బుతో ప్రభావితం చేయటానికీ ఏ అభ్యర్థి కూడా ప్రయత్నించడు. రాజకీయ పార్టీలు తమకు బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేస్తాయి కాబట్టి ఎన్నికల ప్రచారంలో హంగామా చాలావరకూ తగ్గుతుంది. రాజకీయ పార్టీలకు ప్రచారానికి అవసరమయ్యే ధనాన్ని ప్రభుత్వమే సమకూరిస్తే ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చు. ప్రచారం అంతా పార్టీ పేరుమీదే జరుగుతుంది కాబట్టి అభ్యర్థుల మధ్య శత్రుత్వాలు, ఘర్షణలకు అవకాశం ఉండదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు సొంత డబ్బును ఖర్చు చేయరు గనుక, వారు గెలిచాక అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఉండదు.

-చాణక్య