సబ్ ఫీచర్

అందమైన సృజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం అంటే వారికి ఇష్టం... తామే కాదు.. ఈ ప్రపంచం అంతా అందంగా ఉండాలనుకోవడం వారి ప్రత్యేకత. చూడాలికానీ అన్నిట్లోనూ అందం దాగి ఉంటుందన్నది వారి విశ్వాసం. అది నిరూపిస్తున్నారు ఆ ఇద్దరు మహిళలు.. పగిలిన పైప్ కనిపిస్తే మనం పారేస్తాం కదూ..

పాడైన ఏసి మిషన్‌లో ఫిల్టర్ ఫోమ్ ఎందుకంటూ చెత్తబుట్టలో వేసేస్తాంకదూ.. కొళాయిగొట్టంతో అందమైన నెక్లస్ చేశారని తెలిస్తే నమ్ముతారా? ఎందుకూ పనికిరాని చెత్తను రీసైక్లింగ్ చేసి, కొన్నింటి రూపురేఖలు మార్చి అందమైన అలంకరణ సామాగ్రిగా మార్చేశారు ఆ ఇద్దరూ. అక్కడితో ఆగితే గొప్పేముంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో అలాంటి వస్తువులు ధరించి క్యాట్‌వాక్ చేసి వాహ్ అనిపించుకున్నారు కూడా. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు?
ఢిల్లీకి చెందిన ఓ బ్లాగర్ ఆంచన్ సుఖిజ. నిండా 23 ఏళ్లు లేవు. కేవలం బ్లాగర్‌గానే కాకుండా మోడలింగ్ అన్నా, ఫ్యాషన్ అన్నా ఇష్టం. పర్యావరణాన్ని కాపాడుకోవడం అభిరుచి. అందరికన్నా భిన్నంగా ఆలోచించాలనుకుంది. సృజనకు పదునుపెట్టింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనుకుంది. అంతే ఓ ఐడియా వచ్చింది. ఇంట్లోని చెత్తను సేకరించింది. పాడైన లైట్లు, పగిలిన గొట్టాలు, కొళాయిలు, స్కూృలు, రెం చ్‌లు, ఏసీ మిషన్లలోని ఫోమ్ ఇలా ఏది దొరికితే అది. వాటితో నెక్లెస్‌లు, కంఠాహారాలు, చెవిరింగులు, గాజులు, బెల్టులు ఇలా మార్చింది. చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే డిబ్బీలు విరగ్గొట్టాక ఎందుకూ పనికిరావనుకుంటే పొరపాటే. వాటినీ అలంకరణ సామాగ్రిగా మార్చేస్తుంది ఆంచన్. తన
నలుగురు స్నేహితులతో బ్లాగ్ నడుపుతూనే ‘మిషన్ ప్లూటో’పై దృష్టిపెట్టింది. వీటితో ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది.. ఈమధ్యే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె తయారు చేసిన వస్తువులను ధరించి క్యాట్‌వాక్ చేసింది. ఆమె షో ప్రత్యేకతలు ఎన్నో. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘మిషన్ ప్లూటో’ ప్రాజెక్టులో ఇలాంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. చిరిగిన గుడ్డలు, కాగితాలు వంటివాటిని రీసైక్లింగ్ చేసి గౌన్లు, ఆధునిక డిజైన్లలో దుస్తులు తయారు చేసి ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త సొబగులు తెస్తోంది. ఈమెకు తోడైంది ముంబైకు చెందిన డిజైనర్ వైశాలి షడంగ్లే. ఆమెదీ అలాంటి ప్రపంచమే. ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంది. క్రియేటివిటీతో సంచలనాలు సృష్టిస్తున్న ఆంచన్ ఆమె దృష్టిలో పడింది. ఆంచన్ సృజనకు తను తోడైతే చాలనుకుంది. ఇద్దరిదీ ఒకటే ఆలోచన. మిగతావారికన్నా విభిన్నంగా, కొత్తదనంతో చరిత్ర సృష్టించాలని. కలలుగన్నారు. కొత్తకొత్త డిజైన్లు సృష్టించారు. ఆంచన్ ఢిల్లీ వేదికగా ఎదిగితే. 32 ఏళ్ల వయసులో చిన్నపిల్లతో వైశాలి ముంబై వేదికగా తన కెరీర్‌ను తీర్చిదిద్దుకుంది. ఒకప్పుడు నిలువనీడలేని ముంబైలో ఇప్పుడు నగరం నడిబొడ్డున 2వేల చదరపు అడుగుల అధునాతన ఔటెలెట్‌లో తనకు ఇష్టమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని నిర్వహిస్తోంది. ఈ ఇద్దరూ కలసి ఇటీవల జరిగిన వింటన్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సంచలనాలు నమోదు చేశారు. ఫ్యాషన్ ప్రపంచంలో భారత యువ తారలుగా ప్రసిద్ధిగాంచిన ఫ్యాషన్ మ్యాగజైన్లు కొనియాడాయికూడా. వైశాలి ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చింది. ఇద్దరి సృజన దేశానికి గుర్తింపు తెస్తోంది.

40మందికి ఉపాధి
వైశాలి జీవితం వడ్డించిన విస్తరికాదు. మధ్యప్రదేశ్‌లోని విదిషకు చెందిన ఆమె బిఎస్‌సి పూర్తిచేసి ఫ్యాషన్‌పై దృష్టి పెట్టింది. అదే కోర్సులో చేరినా అడ్మిషన్ తిరస్కరించడంతో పొట్టచేతపట్టుకుని ముంబైలోని బాంద్రా చేరింది. జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొద్దిరోజులు పనిచేసింది. ఎక్స్‌పోర్ట్ కంపెనీలో మరికొంతకాలం పని. ఆ తరువాత ఫ్యాషన్ స్టూడియోలో అవకాశం వెదుక్కుంది. నెలకు ఐదువందల రూపాయలు వస్తే గొప్ప. ఆధునిక డిజైన్లలో దుస్తుల తయారీపై దృష్టిపెట్టింది. ఓ బ్యాంక్ మేనేజర్ సహకరించి 50వేల రుణం ఇచ్చాడు. దాంతో సొంతంగా డిజైనర్ దుస్తులు తయారు చేయడం మొదలెట్టింది. క్రియేటివిటీ తోడైంది. ఆదరణ పెరిగింది. ఒకప్పుడు అడ్మిషన్ నిరాకరించిన విద్యాసంస్థలోనే పీజి చేయడానికి అవకాశం వచ్చింది. ఒకప్పుడు అడుగుపెట్టనివ్వని ఎన్నో ఫ్యాషన్ సంస్థలు రారమ్మని ఆహ్వానించాయి. ఇప్పుడు ఆమెవద్ద ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న ఉద్యోగుల సంఖ్య 40. పరోక్షంగా వందలాదిమంది లబ్దిపొందుతున్నారు.