సబ్ ఫీచర్

కుంగదీసే చికాకులకు ‘సంతృప్తే’ ఔషధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కుటుంబంలో అన్ని ఉన్నప్పటికీ ఎందుకో ఆ కుటుంబ యజమానికి చికాకులు పరాకుగా మాట్లాడిస్తూ వేధిస్తుంటాయి. నేటి సామాజిక పరిస్థితుల్లో ఎంతోమంది ఈ స్థితిని అనుభవిస్తూ మానసికంగా అనారోగ్య పాలవుతున్నారు. ఆధునిక నాగరికత ప్రభావంవల్ల మనం ఎరిగిన ఎందరో మహానుభావులు బాల్య దశలో కడు పేదరికాన్ని అనుభవించినవారేనని విస్మరించరాదు. అంతటి దిగువ స్థాయి నుంచి ప్రపంచం కీర్తించిన స్థాయికి ఎదిగారంటే, వారిలో ఎంతటి క్రమశిక్షణ, సమయపాలన వుండేదోనన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంది. నేటి యుగంలో ఒకర్ని చూసి మరొకరు అందని ‘ద్రాక్ష’ కోసం ఎగురుతూ, ఇంకా సాధ్యం కాకుంటే నైతిక విలువలను కాలరాసి, తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఈ ‘పరుగు’ ధర్మానికి విరుద్ధమన్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. దీనివల్లనే జీవితానికి తెలియని ‘అసంతృప్తి’ అనే ముప్పు పుట్టుకొస్తుంది.
సంపాదన అవసరమే. అయితే, ఇది ఎంతమేరన్నదానిపై ఎవ్వరూ దృష్టి పెట్టడంలేదు. ఇరుగు, పొరుగోడు బీభత్సంగా చూడబెడితే తాను కూడా అలా ఎందుకు చేయకూడదని ఆలోచించి, అందుకు సంసిద్ధుడవుతున్నాడు. ఇక్కడే అతను పక్కతోవ పట్టాడని చెప్పొచ్చు. ఇంటిని, ఇల్లాలిని, దేవుళ్లలాంటి పిల్లలు, నమ్ముకున్న ఇతర కుటుంబ సభ్యుల బాగోగులు పట్టించుకోక కేవలం ‘్ధన సంపాదన’ ధ్యేయం అన్నట్టు ప్రవర్తించడంవల్ల పరిష్కరించలేని మానసిక చికాకుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. ఇంకా ఇంకా ధనం కూడబెట్టడం ఎలా అని నిత్యం ఆలోచించకుండా దొరికిన దానితో సంతృప్తిపడడం ఎంతో మేలు.
పదుగురికి సాయం
ఆధ్యాత్మికత అలవడినపుడు పదిమందికి సాయం చేయాలనిపిస్తుంది. స్నేహాన్ని ఆహ్వానిస్తుంది. ఆత్మవికాసం ఏర్పడి తోటివారికి నాలుగు మంచి మాటలను చెప్పాలని మనస్సు ఉబలాటపడుతుంది. దీనివల్ల తనతోపాటు సమాజానికి మేలు చేకూరుతుంది.
మానవతా విలువలకు అగ్రస్థానం
సమాజంలో ఉత్తముడిగా వెలుగొందాలంటే వినయం, అణుకవ తప్పక ఉండాలి. వినయం అంటే గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనభావాన్ని, నిరాశా నిస్పృహలను మనస్సులోకి రానివ్వకూడదు. ఇవి మనిషి వెనక్కులాగే శత్రువులు. ఇవి లేని వ్యక్తే అత్యంత సమర్థుడు, నిపుణుడై ఉంటాడు. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కారం చూపే పదునైన కత్తిలా ఉంటాడు. వంటినిండా మానవతా విలువలతో నిండివుం, పదుగురికి మంచిని బోధించే శక్తిని కూడగట్టుకొని, మంచి దాతగా స్థిరపడతాడు.
సాధన మంత్రం!
వివేకంతో ఆలోచించిన మనిషి సమస్యలకు ఆందోళన చెందడు. అసలు సమస్య ఎక్కడ పుట్టిందోనని ఆ మూలాలను వెతుక్కుని, ఆ సమస్యను పాతిపెడతాడు. జీవిత సమస్యలు ఆత్మస్థైర్యం, వివేకం, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, ఉన్నదానితో సంతోషపడి సంతృప్తిచెంది, తమ మానవ జన్మను సార్థకం చేసుకుని, లోకంలో ఆదర్శవంతునిగా నిలవాలి.

- జి.కల్యాణి