సబ్ ఫీచర్

ఎనె్నన్నో అందాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో ప్రకృతికీ, మనిషికీ ఉన్న సంబంధం అం తా ఇంతా కాదు. ప్రకృతిలో తనూ ఒక భాగమయ్యాడు. ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకున్నాడు.. ప్రకృతిని దైవంగా, గురువుగా ఆరాధించాడు. అందుకే ప్రకృతికీ మనిషికీ అవినాభావ సంబం ధం ఏర్పడింది. ఉదయం నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూస్తాడు.. పక్షుల కిలకిలారావాలకు, సెలయేళ్ళ గలగలలకు పరవశించిపోతాడు. ఉదయం సూర్యోదయంలాగే సాయంత్రం సూర్యాస్తమయం కూడా కళ్లకు విందు చేసే ఓ సుందర దృశ్యమే. ఆకాశంలో మబ్బులు, రాత్రివేళ మిలమిల మెరిసే నక్షత్రాలు.. పచ్చటి తివాచీ పరిచినట్టుండే పచ్చిగడ్డి నేలమీద పూసే పువ్వు, కూసే కోయిల - ఇలా అన్నీ మనిషికి అందా ల దృశ్యాలే.. చెవులకు శ్రావ్య సంగీతాలే. అందుకే ఏ మాత్రం భావుకత ఉన్న మనిషయినా ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆనందిస్తాడు. ప్రకృతినుంచి మనిషి ఎన్నో నేర్చుకున్నాడు. ఎంతగానో ఎదిగాడు. నీళ్లలో ఈదే చేపను చూసి పడవలు, నౌకలు కనిపెట్టాడు.. ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి విమానాలు, హెలికాప్టర్లు కనిపెట్టాడు. అందమైన చందమామను చూసి ఆ లోకం ఎక్కడుందో అని వెతకటం కోసం అంతరిక్షానికి ఎగబాకాడు. ఇలా చెబుతూపోతే ఒకటా రెండా..? ఇప్పుడు సాంకేతికంగా, శాస్ర్తియం గా మనం ఎంతో ఎదిగామనుకుంటున్న సకల పరిశోధనలకూ మూలాలు ప్రకృతిలోనే ఉన్నాయి. అయి తే ఇక్కడ ఇంత ఆనందంలో నూ విచారించదగ్గ ఒక్క విషయం ఏమిటంటే, ‘తనే ప్రకృతి.. ప్రకృతే తను’ అనుకున్న ఆ మనిషే ప్రకృతికి దూరం కావడం. పాశ్చాత్య సంస్కృతి, వెర్రితలలు వేస్తున్న నాగరికత సమాజంలో బాగా పెచ్చుపెరిగిపోయాక కింద ఉండే నేలను, పైన ఉండే ఆకాశాన్ని కనీ సం కంటితో చూడటానికి కూడా నోచుకోలేకపోతున్నాడు. కాలు కిందపెట్టే అవసరం లేకుండా వాహన యంత్రాలకు అలవాటుపడిన మనిషి అసలు నేలమీద కాలుపెట్టి నడుస్తూ.. మట్టివాసనను ఆ స్వాదిస్తూ ముం దుకు నాలుగు అడుగులు వెయ్యలేకపోతున్నా డు. కారణం ఏమిటం టే అపార్ట్‌మెంట్ల సంస్కృతి! అవి వచ్చి మన భూమ్యాకాశాలను మనకు దూరం చేసాయి. ఆ తరువాత మరో కారణం. బిజీ లైఫ్! దేనికీ టైమ్ లేదు టైమ్ లేదు అంటూ ఉరుకులు పరుగుల ఫాస్ట్‌లైఫ్‌లో మునిగితేలటం ఫ్యాషనైపోయింది. దీనివల్ల కూడా మనిషి ప్రకృతికి దూరంగా వెళ్ల డం జరుగుతోంది.
ప్రతి విషయంలోనూ సహజత్వానికి వీడ్కోలు చెప్పి కృత్రిమత్వానికి ఆహ్వా నం పలకడం ఈ నవనాగరిక యుగంలో మనకు బాగా అలవాటైపోయింది. ఉన్నదాన్ని పొగొట్టుకోవ డం.. దాన్ని మరో రూపంలో పొం దడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడంలో ఇప్పటి మనిషి బాగా తెలివిమీరిపోయాడు. తనను తాను ఊరడించుకుంటూ సర్దుకుపోయే రాజీతత్వాన్ని మనసుకి బాగా దట్టంగా పట్టించుకున్నాడు.
సరస్సుల్లోనో, సముద్రంలోను ఉండాల్సిన చేపలు గాజుల పలకల మధ్య ఎలా ఈదుతున్నాయో చూడండి అంటూ అపర భగీరథుడి ఫోజొకటి. ‘సమ్‌థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్’ అన్న ట్లు పరిస్థితులననుసరించి సర్దుకుపోతూ మనిషికి అస్సలు ప్రకృతి ప్రేమ లేని దానికన్నా అది ఆర్ట్ఫిషియల్ రూపంలోనైనా కొంత ఉన్నందుకు ఆనందించి తీరాలి. రోజులు మళ్లీ మారి మనిషి ప్రకృతికి చేరువ కావాలని ఆశించాలి.

-కొఠారి వాణీచలపతిరావు