సబ్ ఫీచర్

నగరాలకు జలగండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిలో సహజంగా లభించే చమురు, బొగ్గు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను ఒక్కసారిగా దగ్ధం చేస్తే భూగోళంపై సగటున 12డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే గనుక జరిగితే ధృవాల వద్ద, ఇతర ప్రాంతాల్లోను మంచు అంతా కరిగి సముద్రమట్టం అనూహ్యంగా పెరుగుతుంది. అయితే, ఈ విపరిణామం రాత్రికి రాత్రి జరగదు. కానీ, గ్రీన్‌లాండ్‌లో భారీగా మంచు, అంటార్కిటికా వద్ద పెద్దపెద్ద మంచు ఫలకాలు కరుగుతున్నందున భూఉపరితల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడానికి కారణం సహజ ఇంధనం దగ్ధవౌతూండడమే. ఫలితంగా భవిష్యత్తులో భూగోళం ముఖచిత్రమే మారిపోనుంది. సహజ ఇంధనాన్ని వేరే వాటితో భర్తీచేయలేము. ‘్ధృవాల వద్ద మంచు కరగకుండా ఉండాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి’ అని పోస్ట్‌డామ్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పి.ఐ.సి.ఐ.ఆర్.)లో జూనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రికార్డా వింకెల్మాన్ అంటున్నారు.
భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరగడంతో అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగిపోతూ సముద్రమట్టం ఏడాదికి 3 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతోంది. అంటార్కిటికాలో మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టం 58 మీటర్లు అంటే- 190 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు భూగోళమంతా జలమయమైపోతుంది. ఇది జరగడానికి కొన్ని వేల ఏళ్లు పట్టవచ్చు. అంటార్కిటికాలో, గ్రీన్‌లాండ్‌లో ప్రస్తుతం మంచు కరుగుతున్న వేగం ఇలాగే కొనసాగితే రాబోయే 200 ఏళ్లలో సముద్రమట్టం కనీసం 20 అడుగుల మేరకు పెరుగుతుందని, దీంతో ప్రపంచంలోని ప్రధాన నగరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మంచు ఇదే రీతిలో కరుగుతుంటే ఉత్తర ఐరోపాలోని నెదర్లాండ్స్ పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. జర్మనీలోని హాంబర్గ్, బెర్లిన్ నగరాలు కనుమరుగైపోయి, జర్మనీ తీరప్రాంతం 400 కిలోమీటర్లు దక్షిణానికి జరగనుంది. డెన్మార్క్ దేశం చిన్న దీవిగా మారుతుంది. వెన్నిస్ నగరం పూర్తిగా సముద్రంలో మునుగుతుంది. ‘టోక్యో, హాంగ్‌కాంగ్, షాంఘై, కోల్‌కత, హాంబర్గ్, న్యూయార్క్ వంటి నగరాలు భవిష్యత్తులో మిగిలి ఉండాలనుకుంటే తూర్పు అంటార్కిటికాలో మంచు చరియలు పదిలంగా ఉండాలి. అందుకు మొదట మనం వాయు కాలుష్యాన్ని నిరోధించాలి. ఇందుకోసం శిలాజ ఇంధన వినిమయాన్ని పూర్తిగా నిలిపివేయాలి’ అని అంటారు పి.ఐ.సి.ఐ.ఆర్.కి చెందిన అండర్స్ లివార్మాన్.
సముద్రమట్టం పెరిగితే ఎక్కువగా దెబ్బతినేది ఆసియా దేశాల్లోని వారే. బంగ్లాదేశ్ యావత్తూ వరదలకు గురై అక్కడి 180 మిలియన్ ప్రజలూ నిరాశ్రయులౌతారు. సింగపూర్, హాంగ్‌కాంగ్, షాంఘై, బీజింగ్ నగరాలు కనుమరుగైపోతాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రత 2డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగినా సముద్రమట్టం ఒక మీటర్ ఎత్తుకు పెరుగుతుంది. అప్పుడు మాల్దీవులు, తువలు వంటి ద్వీప సముదాయాలు అదృశ్యమవుతాయి. భూ ఉపరితల వాతావరణంలో మార్పుల ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తోంది. అవి- భూమీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, జనజీవనాన్ని అతలాకుతలం పెనుతుపానులు కావచ్చు. మన తరువాతి తరాలవారు ఎదుర్కోబోయే పర్యావరణ దుష్ప్రరిణామాలు చాలా ఘోరంగానే ఉంటాయి.
ఇప్పటి దాకా సముద్రమట్టం పెరగడంలో అంటార్కిటికా పాత్ర 10 శాతమే. భూమిపై ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే ఏదో ఒకనాడు దక్షిణ ధృవం వద్ద ఉన్న మంచు పర్వతాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలుతాయి. ఇది జరగడానికి చాలా సమయమే పట్టవచ్చు. కానీ, భౌగోళానికి పొంచి ఉన్న ఉపద్రవం మాత్రం అనివార్యమే!

- దుగ్గిరాల రాజకిశోర్