సబ్ ఫీచర్

ఆరంభం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉధృతంగా వీచిన కమలం గాలిని తట్టుకుని నిలిచిన యువతి అదితి. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా, అమెరికానుంచి ఈమధ్యే వచ్చినా ఆమె అద్భుతమైన మెజారిటీతో నెగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రి బరినుంచి తప్పుకోగా అదితి పోటీ చేసి అలవోకగా నెగ్గింది. యుపిలో కాంగ్రెస్ నెగ్గిన ఎనిమిది సెగ్మెంట్లలో అదితి గెలిచిన రాయబరేలీ ఒకటి. ఇప్పుడామే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాయబరేలీలోని ఓ చిన్న పల్లె అది. మహిళలు, చిన్న పిల్లలతో మాట్లాడుతున్న ఈ యువతే అదితిసింగ్. కాం గ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గమైనప్పటికీ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ యువకెరటం పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయాన్ని కైవసం చేసుకుంది. ఎక్కడో అమెరికాలో చదువుకుంటూ మూడేళ్ల క్రితం ఇంటికి వచ్చిన అదితి ఎక్కడా రాజకీయ పాఠాలు నేర్చుకోలేదు. ప్రజలతో మమేకమైందీ లేదు. చిన్నప్పటి నుంచి ఢిల్లీలో చదువుకుంది. అక్కడ నుంచి అమెరికా వెళ్లిపోయింది. మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన అదితి మూడేళ్ల క్రితమే రాయబరేలీ వచ్చింది. ఈమె తండ్రి అఖిలేష్ సింగ్‌కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.
ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన సందర్భం కూడా ఉంది. తదనంతరం ఈయన కాంగ్రెస్‌లో చేరిపోయాడు. ఈ నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధితో పాటు ప్రియాంక గాంధీ వల్ల తాను గెలిచానని చెబుతోందామె. 28 ఏళ్ల వయసున్న అదితి తన తండ్రి వలే ఇక్కడ స్ట్రాంగ్ లీడర్‌గా ఎదిగితే నియోజకవర్గ ప్రజలు కోరుకున్న పనులు చేయవచ్చని చెబుతోంది. ఇక్కడ, అమెరికా పాలిటిక్స్‌లో ఉన్న వ్యత్యాసం గురించి అడిగితే అమెరికాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జాతీయ అజెండా మాత్రమే ఉంటుందని, ఇక్కడైతే పార్టీ అజెండా ఉంటుందని చెబుతుంది. రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఈమె తండ్రి అఖిలేష్ సింగ్ గత 1993 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి తన కుమార్తెఅదితిసింగ్‌ను నిలబెట్టి తాను తప్పుకున్నారు. దళితుల ఓటింగ్ ఎక్కువగా ఉండే ఇక్కడ ఎస్పీ, బిఎస్పీ, బిజెపిలను తట్టుకుని 1,28,319 ఓట్ల మెజార్టీతో గెలవటం సామాన్య విషయం కాదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తుడి చి పెట్టుకుపోయిన దశలో గెలిచిన ఎనిమిది మంది అభ్యర్థులలో అదితి అత్యధిక మెజార్టీతో గెలవటం వెనుక విజయ రహస్యం తనది ప్రజల అజెండా కావడమేనని అంటోంది.