సబ్ ఫీచర్

పసివాళ్లలో కసి నింపే పాఠ్యాంశాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మోదీ హవా లేనే లేదని ‘ఆప్’ నేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఓ సభలో విమర్శిస్తుండగా- ‘తల నుంచి మెడ వరకూ చుట్టుకున్న మఫ్లర్‌ను కాస్త తొలగించి చూడండ’ని ఎవరో సలహా ఇచ్చారట! పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా మోదీలో వాడి,వేడి తగ్గలేదు. కొత్త శకాన్ని చూపిస్తున్న మోదీకి, ఆయన అనుచరగణానికి యుపి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దేశంలోని అన్ని ప్రధాన జాతీయ జీవన రంగాలను భ్రష్టు పట్టించింది యుపిఎ ప్రభుత్వం. అందులో దేశ స్వాభిమానం గురించిన విషయం చాలానే ఉంది. దేశంలో గత ఏడాది విశ్వవిద్యాలయ స్థాయిలో కొన్ని చోట్ల జరిగిన తీవ్రవాద పోకడలకు మూలం వక్రీకరించబడిన చరిత్రయే.
2008 డిల్లీ విశ్వవిద్యాలయం బిఏ కోర్సులో ‘ప్రాచీన భారతీయ సంస్కృతి’ పాఠ్య పుస్తకంలో- ‘300 రామాయణాలు’ పేరిట ఉన్న పాఠ్యాంశాన్ని ఎ.కె.రామానుజన్ వ్రాశారు. రావణుడి ముక్కు నుంచి సీత పుట్టిందని, సీతకు లక్ష్మణుడికి అనైతిక సంబంధాలుండేవని, హనుమంతుడు లంకలో శయన గదుల్లో శయనించేవాడని అందులో ఆయన వ్రాశారు. దీంతో కొందరు జాతీయవాదులు దిల్లీ కోర్టుకెక్కారు. కోర్టు ‘సహనం’ వహించమని సలహా ఇచ్చింది. రామాయణం జాతీయ జీవన గ్రంథమని భావించిన వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ ఇది విద్యాలయాలు తేల్చుకోవాల్సిన విషయం అన్నారు. డిల్లీ విశ్వవిద్యాలయం ‘దేశద్రోహ శక్తుల మాయాజాలమైంద’ని ఎవరూ గ్రహించలేకపోయారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ చాన్సలర్‌ను కలిసి ఆ పాఠ్యాంశాన్ని తొలగించడంలో జాతీయవాదులు విజయం సాధించారు. నాడు చాలావరకూ స్వదేశీ, విదేశీ మీడియా ‘విద్య కాషారుూకరణ’ అంటూ గగ్గోలు పెట్టాయి. మన చరిత్రను మన చరిత్రగా చదువుకోవడం, అందుంచి స్ఫూర్తి పొందడం- ‘అభివ్యక్తీకరణను వ్యతిరేకించడం ఎలా వుంది?’. ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి నీరు తాగుతూ, ఈ నేలపై పండిన పంటలనుభవిస్తూ, భారత భావన లేని ‘భ్రష్టుపట్టిన మేధావులు’ సృష్టించిన చరిత్ర మనదేశానికెంతో కీడు చేసింది. నిజానికి బ్రిటిష్ కాలం నాటి ‘మెకాలే’ విద్యా విధానం లక్ష్యం కూడా అదే. భౌతికంగా మనకు కొంత భూభాగం ఇచ్చి వెళ్లిపోయినా బ్రిటిష్ వారు శాశ్వతంగా ఈ దేశ వాసులు భావదాస్యంతో బతికేలా, భారతీయులు తమ సంస్కృతిని, తమ జీవన గ్రంథాలను, తమ జాతీయ మహా పురుషులను అసహ్యించుకునేలా చేసేందుకు మన చరిత్రను, చదువుల్ని విషపూరితం చేశారు.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి నాయకులు సైతం ఓట్ల రాజకీయాల్లో పడి ఈ విషయమై చాలా మైళ్లు దారి తప్పారు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను కొందరు మేధావులు తమదైన సిద్ధాంత భావ జాలంతో తిరగరాశారు. బెంగాల్, ఇతర చోట్ల కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాల్లో కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని చేర్చారు. అరవింద యోగి, మహాత్మా గాంధీ చెప్పిన విషయాలు అక్కడ కనిపించవు. ఎవరైనా ఆ విషయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరితే వారిని మతతత్త్వ వాదులని ముద్ర వేస్తారు. అనేకమంది విదేశీ భావదాస్యం తలకెక్కించుకున్న రోమిల్లా థాపర్ వంటి సోకాల్డ్ మేధావులు ఐసిహెచ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్), ఎన్‌సిఇఆర్‌టి వంటి సంస్థల్లో చేరి ఇష్టం వచ్చినట్టు చరిత్రను వక్రీకరించారు. ఇప్పటికీ బెంగాల్‌లోని పాఠ్యపుస్తకాల్లో రష్యా విప్లవం ప్రపంచ చరిత్రలో గొప్ప సంఘటన అని ఉంటుంది. నిజానికి రష్యా కమ్యూనిజాన్ని వదిలించుకుని చాలా ఏళ్లు గడిచినా, ఈ మేధావులు నిజాన్ని అంగీకరించరు. ఈ తరహా దుందుడుకుతనం కొనసాగింపుగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయమేమంటే ‘సబ్‌రంగ్ ట్రస్ట్’ పేర నడుస్తున్న సంస్థ 2010-14 మధ్య కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి పుష్కలంగా నిధులు దండుకుని పసిహృదయాలలో కసి నింపే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం, వాటిని నాటి యుపిఏ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్ధించడం. సబ్‌రంగ్ ట్రస్ట్‌ను గుజరాత్ హిందూ కుటుంబానికి చెందిన తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌లు నిర్వహిస్తున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. మోదీపై కక్ష కట్టి ఎన్నో కేసులు, వాదనలతో కోర్టుకెక్కింది. మూడు స్థాయిల్లోని కోర్టులన్నీ ఆమె అభియోగాలను కొట్టివేసాయి. జాతీయవాద శక్తులను, జాతీయ సాంస్కృతిక మూల్యాలను వ్యతిరేకిస్తూ ఆమె ఓ ఫౌండేషన్ ద్వారా నిధులను తెచ్చుకుని ‘్భరత్‌లో కమ్యూనలిజం, అసహనం’ పేరిట సెమినార్‌లు నిర్వహిస్తూ విద్వేషం చిమ్మే ప్రయత్నం కొనసాగించింది.
ఐటి నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించారన్న కారణంతో ఆమె సంస్థను మోదీ ప్రభుత్వం నిషేధించింది. నిధుల రాకను స్తంభింపచేసింది. 2015లో నాటి మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ ‘ఖోజ్ విద్య’ పేర ‘ప్లూరల్ ఇండియా కార్యక్రమం’ కోసం ‘సబ్‌రంగ్’కు 11.39 కోట్ల నిధులు యుపిఎ ప్రభుత్వం నుంచి పొందిన విషయమై విచారణకు ఆదేశించారు. ఇందులో నిధుల దుర్వినియోగంతోపాటు ‘విద్వేష’ ప్రచారానికి సంబంధించి ఆరోపణలున్నాయి. ఈ విద్వేషం కొత్త పుంతలు తొక్కింది. 4వ తరగతి పుస్తకంలో కన్యాకుమారిలో హిందూ,క్రైస్తవుల ఘర్షణల గురించి హిందూ సామ్రాజ్యవాద వైఖరి గురించి ఉల్లేఖించారు. 6వ తరగతి చరిత్ర పుస్తకంలో కాశ్మీర్ ప్రత్యేక ప్రాంతమని, భారత్ కాశ్మీర్‌పై దాడులు చేస్తున్నదని వ్రాశారు. ఈ పుస్తకాల రూపకర్త తీస్తా సెతల్వాద్ ఈ అభూతకల్పనలను ఆమోదించింది. శివాజీ, జ్యోతిబా పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్‌ల గురించి కూడా ఈ పుస్తకాలలో తీస్తా సెతల్వాద్ తనదైన దృక్కోణంలో రాసింది. హిందూ సామ్రాజ్యవాదమే ఉంటే ప్రపంచంలో ఎన్నో దేశాలపై మనం దండెత్తి ఉండేవాళ్లం. మనం ఆత్మరక్షణ కోసమే పలు సందర్భాల్లో యుద్ధాలు చేసాం. నిమ్న వర్గాలలో పుట్టినందుకు శివాజీ పట్ట్భాషిక్తుడు కాలేదని తీస్తా రాసింది. కానీ, శివాజీ ఎప్పుడూ తనకు తను మరాఠీ సర్దారుగా కూడా ఊహించుకోలేదు. ఆయన హిందూ ధర్మ రక్షకుడిగా, జాతీయ వీరుడిగా తన కర్తవ్యం నిర్వహించాడు.
తీస్తా సెతర్వాద్ చేసిన కసి నింపే కవ్వింపు చర్య దేశద్రోహం కాక మరేమిటి? గత ఏడాది పార్లమెంటులో నాటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిణి స్మృతి ఇరానీ ఈ విషయమై గంభీర ఉపన్యాసం చేసి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టారు. ఆమె ఆదేశం మేరకు ఏర్పడిన ‘బారి కమిటీ’ నివేదిక అనేక వాస్తవాలను బయటపెట్టింది. ఐపిసి 153ఏ, 153బి కింద తీస్తాను శిక్షార్హురాలిగా ప్రకటించింది. 2,3 నెలల క్రితమే ‘టైమ్స్ నౌ’ వంటి టీవీ చానళ్లు తీస్తా నిర్వాకాన్ని బయటపెట్టాయి. బారి కమిటీ నివేదిక జూన్ 2015లోనే వెలువడింది. గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధిపతి సయ్యద్ బారి, సుప్రీం కోర్టు న్యాయవాది అభిజిత్ భట్టాచార్య, మానవవనరుల అభివృద్ధి శాఖ సంచాలకులు శ్రీ గయప్రసాద్ ఈ కమిటీలో ఉన్నారు. విద్యా సంబంధ విషయంలో సబ్‌రంగ్ ట్రస్ట్‌కు అవకాశం ఇవ్వడమే నాటి ప్రభుత్వం చేసిన తప్పని కమిటీ అభిప్రాయపడింది. సబ్‌రంగ్ ట్రస్ట్ రాజకీయ ప్రేరితమైన సంస్థ కావడమే ఇందుకు కారణం. రెండు దశాబ్దాల క్రితం నుంచే సబ్‌రంగ్ ట్రస్ట్ ఈ తరహా చరిత్ర వక్రీకరణలో కాకలు తీరింది. పసి హృదయాలెన్నింటినో కసితో కలుషితం చేసింది. 2016 ఫిబ్రవరి 10న జెఎన్‌యులో అఫ్జల్‌గురుకు అనుకూలంగా జరిగిన ప్రదర్శన వంటివి ‘తీస్తా’ మతి తప్పిన, గతి తప్పిన పోకడల పర్యవసానమే. జాతీయ శక్తులు బలం పుంజుకుంటున్న నేటి భారతంలో ‘తీస్తా’ సెతల్వాద్ వేర్పాటువాదుల అరుపులు ‘తాటాకు చప్పుళ్లు’గా మిగిలిపోవడం ఖాయం.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్