సబ్ ఫీచర్

సేవచేసే నేతలు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలు వాటి పాత్రను సక్రమంగా నిర్వహించనందునే మన ప్రజాస్వామ్యం బలహీనమై పోతోంది. పదవుల కోసం నేతల తపన. ప్రజాసేవ హామీలకే పరిమితం. అభివృద్ధి కాగితాల పైనే. గత నాలుగు దశాబ్దాల్లో మన రాజకీయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టింది. అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేయడం మొదలు పెట్టింది. ఇందిరాగాంధీ నుండి సోనియాగాంధీ వరకు ఇదే తీరు. ప్రాంతీయ నాయకులలో ఎవర్నీ ఎదగనివ్వలేదు. హైకమాండ్‌కు విధేయులై వుంటే చాలు. అసమర్ధుడైనా ఏ రాష్ట్రానికో గవర్నరు కావచ్చు. దీంతో ప్రాంతీయ నాయకులు సమస్యలను గాలికి వదిలేసి, హైకమాండ్ చుట్టూ తిరగడం మొదలెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏనాడూ క్షేత్రస్థాయి పరిస్థితులకు, సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొద్దిమందిపైనే ఆధారపడి వారిచ్చే తప్పుడు సలహాలతో హైకమాండ్ తప్పులు చేసుకుంటూ చివరికి కుప్పకూలింది. తెలుగు రాష్ట్రాల విభజన ఎలా జరిగిందో ఎవరు మరచిపోతారు?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కంటే బిజెపి మెరుగైన పరిపాలనాదక్షత ప్రదర్శించింది. పెద్దనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయం. నల్లధనం ప్రమాదస్థాయిని ఏనాడో దాటిపోయింది. మోదీ చర్యను విమర్శించేవారు ప్రత్యామ్నాయాలను మాత్రం చూపడం లేదు. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచే స్థితిలో లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. వీటి సహాయంతోనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. తమ సమస్యలను ప్రాంతీయ పార్టీలు పరిష్కరిస్తాయని ఓటర్లు నమ్ముతున్నారు. అయితే, ప్రాంతీయ పార్టీల పనితీరు ఎలా వుంది? తమిళనాడు రాజకీయం ఏ స్థితికి వెళ్ళిందో చూశాం. అక్కడి ఓటర్ల తీర్పు కూడా వింతగా వుంది. అవినీతిలో రికార్డు సృష్టించి శిక్షపడిన వారిని ‘అమ్మ’, ‘చిన్నమ్మ’ అని కొలుస్తున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణ సాధనకు త్యాగాలు చేసిన వారికి పదవులు లేవు. చాలామంది మంత్రులకు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఏపిలో ఒక మహిళానేత కాంగ్రెస్‌లో ఎన్‌టిఆర్‌ను చూసుకుంటున్నానని చెప్పి, ఆ పార్టీలో చేరి గతంలో కేంద్రమంత్రి అయ్యారు. ప్రస్తుతం బిజెపితో వున్నారు. అంటే ఇపుడు బిజెపిలో ఎన్‌టిఆర్‌ను చూసుకుంటున్నారా? ఓ యువనేత కాబోయే ముఖ్యమంత్రి తానేనని పోలీసులను బెదిరిస్తున్నాడు. సాధ్యం కాని ‘ప్రత్యేక హోదా’ కోసం ఉద్యమాలంటున్నారు. నాయకత్వ లక్షణాలు లేని నాయకుల వల్లనే మన ప్రజాస్వామ్యం క్షీణ దశకు చేరుకుంది.
సామాన్య ఓటర్లు పౌర హక్కులు గురించో, ప్రత్యేక హోదా గురించో ఆలోచించరు. వాళ్ళకి కావలసింది కనీస వసతులు, ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం, తగినన్ని పని దినాలు. మరుగుదొడ్లు లేకపోయినా ఫర్వాలేదు, కలర్ టీవీలు, సెల్‌ఫోన్లు ఉచితంగా ఇవ్వండని సగటు ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
నేతల్లోను, ఓటర్లలోనూ మార్పు వచ్చినప్పుడే మన రాజకీయ వ్యవస్థ మెరుగుపడుతుంది. గతంలో నేతలు ఎలాంటి పదవులు లేకుండా ప్రజాసేవ చేయలేదా? అలాంటి వారినే జనం ఎన్నుకోవాలి. ఎన్నికల్లో ధన ప్రభావం, ఉచిత పథకాల ప్రభావం తగ్గాలి.

- ఇమ్మానేని సత్యసుందరం